maha shivaratri pooja | శివకేశవుల అభేద తత్వానికి ప్రతీకైన కార్తికం మహిమాన్వితమే కాదు దీపదానానికి కడుప్రసిద్ధమైంది. ప్రదోషకాలంలో మహా శివుని ఆత్మశుద్ధితో పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించిన ఫలితాన్ని ఆ పరమేశ్వరుడే కలుగజేస్తాడని స్కాండపురాణం చెబుతుంది. ఈ కార్తికంలో ఏ పుణ్యకార్యం చేసినా చేసినదానికి రెట్టింపు పుణ్యాన్ని మహాశివుడు భక్తులకు అనుగ్రహిస్తాడని అంటారు. వీటికన్నా కూడా శివకేశవాలయాలలో చేసే దీపారాధన, దీపదానం అనంతకోటి పుణ్య ఫలాలను ఇస్తుందని(maha shivaratri pooja) అంటారు.
దీపారాధన ఎలా చెయ్యాలి?
ఈ దీపరాధనను ఆవు నెయ్యి, నువ్వులు, విప్ప, కొబ్బరి లాంటి నూనెలతో చేయాలి. అలా వీలుకుదరక పోతే ఆముదంతోనైనా దీపారాధన చేయడం కాని వెలుగుతున్న జ్యోతికి కాస్త నూనెను జోడించడం కాని, కొడి గట్టుతున్న దీపాన్ని సరి చేయడం కాని చేసినా కార్తికం పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. అశుతోషుడైన పరమశివుడు భోళాశంకరుడు. ఓం నమః శివాయ నమః అంటూ ఉసరిక కాయమీదనో పిండి ప్రమితోనో, మట్టి ప్రమిదతోనో దీపం వెలిగిస్తే తన సమీపంలోనే తన భక్తుని నిలుపుకుని తానే రక్షకుడై కా పాడుతాడు.

రాజు కథ!
పూర్వం పాంచాలదేశాన్నేలే రాజు పరమ భక్తుడు. అతని రాజ్యం సర్వసుభిక్షంగా ఉండేది. ప్రజలను కన్నబిడ్డలవలే పాలించేవాడు. కాని నిరంతరం తాను అపుత్రవంతుణ్ణి అన్న బాధతో విచారించేవాడు. ఎ్నిసంపదలున్నా తన వంశానికి వారసుడు లేడని విలపించేవాడు. భగవంతుని కరుణ కోసం ఎన్నో యాగాలు, యజ్ఞాలు, క్రతువులు, నోములు, వ్రతాలు చేసేవాడు. కాని ఎన్ని చేసినా ఆ పాంచాలదేశాధిపతి పుత్రవంతుడు కాలేకపోయాడు. ఒకసారి ఆయన దగ్గరకు పిప్పలాదుడనే మహర్షి వచ్చాడు. ఆ పిప్పలాదుని దర్శించుకుని రాజు తన బాధను తెలుపుకున్నాడు.
ఆ పిప్పలాద మహర్షి ఓ రాజా కార్తికమాసంలో శివాలయంలో నీవు దీపదానం చేయి. నీకు ఇష్టకామ్యార్థసిద్ధి కలుగుతుంది అని దీవించాడు. కార్తికం కోసం ఎదురు చూసిన కార్తికం వచ్చీరాగానే ఆ రాజు ఆ నెలంతా ఉపవాసాది నియమాలు పాటిస్తూ శివాలయంలో మహర్షి చెప్పిన విధంగా దీపారాధన చేశాడు. ఆ రాజుకు శివానుగ్రహం కలిగింది. పుత్రుడు పుట్టాడు. రాజు పరమానంద భరితుడయ్యాడు. ఆ పుట్టిన శిశువుకు శత్రజిత్తు అని పేరు పెట్టుకొని అల్లారు మద్దుగా పెంచసాగాడు.
అలా పెరుగుతున్న రాజబిడ్డడికి గారాబం ఎక్కువైంది. విచ్చలవిడితనం అబ్బంది. వయసుతో పాటుగా పొగరు పెరిగింది. పెద్దలను ఆదరించేవాడు కాదు. స్త్రీలను, వృద్ధులను అవమానించేవాడు. పరకాంతా వ్యామోహితుడు అయ్యాడు. కాముకత్వంతో కళ్లుమూసుకుని పోయాయి. చివరకు ఉచ్చ నీచభేదం లేకుండా ఓ బ్రాహ్మణ స్త్రీతో విహరించడం మొదలు పెట్టాడు. ఓ రోజు వారిద్దరూ కలిసి ఏకాంతం కోసం ఓ పాడుబడిన శివాలయం చేరుకున్నారు. వీరి కథ తెలుసుకొని ఆ బ్రాహ్మణ స్త్రీ భర్త వీరిని అంత మొందించాలనే కోరికతో వెంబడిం చసాగాడు.

ఆ శివాలయం చేరిన ఆ ప్రేమికులలోని స్త్రీ వెలుగు కోసం తన చీరచెంగును చించి వత్తిగా చేసి అక్కడున్న ప్రమిదలో పెట్టి దీపం వెలిగించింది. ఆ రాజకుమారుడు అక్కడ ఇక్కడ ప్రమిదలలో మిగిలి ఉన్న నూనెను ఆ దీపానికి చేర్చాడు. ఆ వెలుగులో ఆ శృగారం కోసం వచ్చిన వారు యథేచ్ఛగా విహరించాడు. దీన్నంతా చూస్తున్న ఆ స్త్రీ భర్త వారిరువురిని అదనుచూసి హత్యచేశాడు. తాను పాపం చేస్తానన్న బాధతో ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ముగ్గురి ప్రాణాలను తీసుకొని పోవడానికి యమదూతలను చూసి ఆశ్చర్యపోయారు.
మీరాకకు కారణం ఏమిటని అడిగారు. ఆ శివదూతలు వీరిద్దరూ స్వలాభం కోసమేనయినా శివాలయంలో కార్తిక పౌర్ణమి తిథినాడు దీపం వెలిగించారు. రోజంతా ఉపవాసం చేవారు. పైగా శివాలయంలోనే గడిపారు. ఈ దీపారాధన వల్ల వారు అనేక జన్మలలో చేకున్న పాపపురాశి అంతా భస్మీపటం అయింది.
దీంతో శివానుగ్రహం కలిగింది. వీరిని తీసుకురమ్మని పరమశివుడు ఆదేశించాడు. దాని వల్ల మేము వచ్చాం అని చెప్పే శివశంకరుల మాటవిని యమదూతలు ఆవ్చర్యనందాలకు లోనైనారు. ఇది విన్న ఆ రాజకుమారునికి జ్ఞానోదయం కల్గింది. రాజకుమారుడు తమకు లభించిన పుణ్యంలో కాస్త విప్రునకు దానం చేశారు. దానితో ఆ ముగ్గురికీ శివలోకం ప్రాస్తించింది. ఇలా తెలిసి చేసినా తెలియక చేసినా దీపారాధనకు అనంతమైన పుణ్యం లభిస్తుంది. పూర్ణిమరోజైనా, సోమవారం నాడు లేక కార్తికమాసం సాయంత్రం వేళ తాము నివసిస్తున్న ఇంటి వాకిట్లోగాని, తులసీ కోట ముందుగాని, శివాలయంలోకాని, విష్ణువాలయంలోగాని దీపం పెట్టాలి.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!