Madupriya Shivaratri song 2022 mp3 | మహా శివరాత్రి 2022 సందర్భంగా సింగర్ మధుప్రియా ఓ పాటను తన అఫిసియల్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా రెండ్రోజుల కిందట విడుదల చేశారు. ఈ పాటను ఇప్పటికే వేల మంది చూసి లైక్ చేశారు. ఇప్పటికే మధుప్రియ చిన్న వయసు నుండే సింగర్‌గా గుర్తింపు పొందింది. ఆడ పిల్ల నమ్మా ..నేను ఆడపిల్లనని అనే పాటతో తన లైఫ్ కెరియర్ ప్రారంభమైందని చెప్పవచ్చు.
తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్న మధుప్రియ ఎన్నో జానపద పాటలు పాడారు. చిన్న వయసు నుండే పాటల మీద పట్టు సాధించారు. తన స్వరంతో ఇప్పటికే ఎన్నో హిట్ పాటల్ అందించారు. ఆడ పిల్లలపైనా, ఆర్మీ జవాన్లపైనా, బతుకమ్మ పండుగలపైన, మేడారం జాతరంపైన ఇలా ఎన్నో పాటలను పాడి ప్రేక్షకులను సంపాదించుకున్నారు.
ఈ మధ్య కాలంలో సింగర్ మధుప్రియకు సినిమా పాటలు పాడే అవకాశాలు రావడంతో మరింత పాపులర్ అయ్యారు. ఫిదాలో పాడిన పాటతో తన సినిమా కెరియర్లో ఒక మెట్టు ఎక్కారు. తన స్వరంతో పాడిన ఎన్నో పాటలు ఇప్పుడు నెట్టింట్లో అందుబాటులో ఉన్నాయి. జానపద సింగర్‌గా మరింత గుర్తింపు వచ్చిన మధు ప్రియ తనకంటూ ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకొని ప్రత్యేక ఆల్బామ్స్ తయారు చేస్తున్నారు.
మహా శివరాత్రి సందర్భంగా మధుప్రియ పాడిన పాటకు రాజేంద్ర కొండ లిరిక్స్ అందించారు. నవీన్ సంగీతం అందించారు. ఈ పాటలో తన తల్లిదండ్రులు కూడా నటించారు. శివుడి పాటకు తగ్గట్టుగా లోకేషన్‌ను మిట్ట మల్లిఖార్జున స్వామి దేవాలయం(గుంజపడుగు) వద్ద షూటింగ్ చేశారు. సింగర్ మంగ్లీ ద్వారా జానపద పాటల్లో అత్యధికంగా రాణిస్తున్న వారిలో మధుప్రియ ఒకరు. తెలుగు రాష్ట్రాల్లో మధుప్రియ పాటలను ఇష్టపడే వారు చాలా మంది ఉన్నారు. ఆమె పాడిన మహా శివరాత్రి పాట బాగుందని అభినందనలు తెలియజేస్తున్నారు.
Madupriya Shivaratri song 2022 mp3
Producer singer Actor: Madhuppriya
Directed by Krish
Lyrics: Rajendhar Konda
Dop: Uday kiran
Editing and Di: Saiteja Kundarapu
Kashif Kreations maneger: PavanKumar Mekala
Music: Naveen J
Artist: Supriya, Ajaykumar, Sruthipriya, Nithya, Akshay Kumar, Shiva, Harsha Vardhan, Aishu, spandana, Sruthi
POWERED BY: KASHIFKREATIONS
Special thanks to : శ్రీ శ్రీ శ్రీ మిట్ట మల్లిఖార్జున స్వామి దేవాలయం (గుంజపడుగు)
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!