Madu yashki goud: హైదరాబాద్: కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లాలనుకునేవారు వెళ్లొచ్చు..కానీ పార్టీలో ఉంటూ వెన్నుపోటు మాత్రం పొడకవండి అని పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ గౌడ్(Madu yashki goud) ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. ఎంపీ కోమటరెడ్డి వెంకటరెడ్డి ఎదుగుదలైనా, తన ఉన్నతైనా పార్టీ అధినేత్రి సోనియా గాంధీ వల్లే అని అన్నారు.
వైఎస్ విజయమ్మ నిర్వహింది ఆత్మీయ సమ్మేళనం కాదని.. అది రాజకీయ సమ్మేళనం అని విమర్శించారు. ఆ సమ్మేళనానికి వెళ్లొద్దని పార్టీ నుంచి ఆదేశాలు వెళ్లినా కొంత మంది హాజరయ్యారన్నారు. ఆ ఆదేశాలను పట్టించుకోకుండా కాంగ్రెస్ ను వ్యతిరేకించే రాజకీయ వేదిక మీదకు వెళ్లి మాట్లాడటం ద్వారా పార్టీకి నష్టమే జరుగుతుందన్నారు.
కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోవాలా? వద్దా ? అనేది అధిష్టానం చూసుకుంటుందన్నారు. వైఎస్సార్ బతికి ఉంటే తెలంగాణ ఏర్పడేదే కాదని విజయమ్మ చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థిస్తారా? అని మధుయాస్కీ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీకి ఇచ్చిన వినతులు విభజన చట్టంలోనే ఉన్నాయని, వాటిని ఏడేళ్లు ఎందుకు మర్చిపోయారని నిలదీశారు.
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!
- Migraine: భరించలేని మైగ్రేన్ తలనొప్పి వస్తుందా?
- Amavasya: అమావాస్య రోజున ఏమి జరుగుతుంది?
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?