Tiger Kid : మద్రాస్ సిమెంట్ క్వారీ సమీపంలో పులి పిల్ల? | Jaggayyapeta Madras Cement Factory
Madras Cement Factory : కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని మద్రాస్(రామ్కో) సిమెంట్ క్వారీ సమీపంలో పులి పిల్లో లేక చిరుత పిల్లో ఏదో అడవి జంతువు తెలియదు కానీ సంచరిస్తున్నట్టుగా ఫొటోలు వైరల్ అవుతున్నాయి. జిల్లా, స్థానిక అటవీశాఖ, రెవెన్యూ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఆ అడవి జంతువును సంరక్షించాలని, లేని యెడల గ్రామాల్లోకి వచ్చే ప్రమాదముందని పలువురు భావిస్తున్నారు. అడవీ జంతువు ఎంసీయల్ క్వారీలో బ్లాస్టింగ్ కు గురై ప్రాణాలు పోకుండా జంతువును రక్షించాలని, చుట్టుప్రక్కల ప్రజలు జాగ్రత్త వహించేలా అధికారులు చూడాలని ప్రజలు కోరుతున్నారు.