Madhya Pradesh | పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, రౌడీ షీటర్లు, మాఫియా డాన్లు జైలుకు వెళ్లిన తర్వాత విడుదలయ్యే సమయంలో వారికి స్వాగతం తెలపడానికి కొన్ని వందల మంది వస్తుంటారు. పెద్ద పెద్ద కార్లు వేసుకొని వచ్చి Jail ప్రాంగణంలో ఎదురు చూస్తూ, ఎప్పుడైతే తమ నాయకుడు బయటకు వస్తాడో దండలు వేసి, నినాదాలు చేస్తూ ఉంటారు. అచ్చం ఇలానే ఒక అత్యాచార నిందితుడు జైలు నుండి వచ్చే సమయంలో వారు చేసిన అత్యుత్సాహానికి Courtకు కోపం వచ్చింది. ఆ తర్వాత లొంగి పోవాలని ఆదేశాలు జారీ చేసింది.
ఓ అత్యాచార కేసులో నిందితుడైన మధ్యప్రదేశ్(Madhya Pradesh) యువకుడు వ్యవహరించిన తీరుపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి(CJI) జస్టీస్ ఎన్.వి.Ramana నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ అత్యాచార కేసులో నిందితుడుగా ఉన్న యువకుడుకు bail వచ్చిందని స్వాగతిస్తూ బాధితురాలు నివసిస్తున్న ప్రాంతంలో Posters వెలిశాయి. Social Mediaలో యువకుడిని పొగుడుతూ ప్రచారం జరిగింది. నిందితుడిని కీర్తిస్తూ అతని బంధువులు, అనుచరులు కరపత్రాలు అతికించారు.
దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన త్రిసభ్య ధర్మాసనం నిందితుడి బెయిల్ ను రద్దు చేసింది. వారం రోజుల్లో లొంగిపోవాలని ఆదేశించింది. బెయిలొచ్చిందని నిందితుడిని స్వాగతిస్తూ బాధితురాలు నివసిస్తున్న ప్రాంతంలో భయ్యా తిరిగి వచ్చాడు అంటూ పోస్టర్లు వెలిశాయి. యువకుడి బంధువులు, అనుచరులు అతడిని ఓ Heroలా కీర్తిస్తూ వివిధ ప్రదేశాల్లో కరపత్రాలు అతికించారు. నిందితుడి ప్రవర్తన బాధితురాలి మదిలో భయాలు రేకెత్తించేలా ఉందని ధర్మాసనం తెలిపింది.
అతడు బెయిల్‌పై ఉంటే స్వేచ్ఛగా, నిష్ఫక్షపాతంగా విచారణ జరగదన్న ఆందోళన ఆమెలో కలిగించేలా ఉంది. సాక్షులను ప్రభావితం చేస్తాడని ఆమె భావించేలా ఉంది. ఈ పరిస్థితుల దృష్ట్యా నిందితుడు బెయిల్‌కు అర్హుడు కాదని భావిస్తున్నాం. హైకోర్టు తన బెయిల్ ఉత్తర్వుల్లో నిందితుడి నేర చరిత్రను ఉపేక్షించింది. అందుకే బెయిల్ ఉత్తర్వులను రద్దు చేస్తున్నాం. వారం రోజుల్లో అతడు లొంగిపోవాలి అని ధర్మాసనం పేర్కొంది.