Madhira: స‌త్తుప‌ల్లి కోర్టుకు మ‌ధిర నుండి క్యూ క‌డుతున్న IP మోస‌గాళ్లు? విష‌యం ఏమిటంటే?

Madhira | ఖ‌మ్మం జిల్లా మ‌ధిర ప‌ట్ట‌ణంలో ప‌లువురు వ్యాపారులు వ్యాపార అభివృద్ధి కోసం ఇత‌రుల వ‌ద్ద డ‌బ్బులు తీసుకొని వ్యాపారంలో న‌ష్టం వ‌చ్చింద‌ని చెబుతూ కోర్టుల్లో ప‌లువులు దివాలా పిటిష‌న్ దాఖ‌లు చేయ‌డం తో ప్ర‌జ‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. మ‌ధిరలో వ్యాపార అవ‌స‌రాల నిమిత్తం అందిన కాడికి అప్పులు చేసి తిరిగి అవి చెల్లించ లేక, IP దాఖ‌లు చేసిన సంఘ‌ట‌న‌లు వ‌రుస‌గా జ‌ర‌గ‌టంతో ప్ర‌జ‌లు ఆవేద‌న చెందుతున్నారు.

కోట్ల‌లో అప్పులు తీరా మోసాలు?

కొంత‌మంది వ్య‌క్తులు న‌మ్మ‌కంగా, స్నేహం చేసి అవ‌స‌రాల‌కు డ‌బ్బులు తీసుకొని ఐపీ పెట్ట‌డం స‌ర్వ‌సాధార‌ణంగా మారింది. తాజాగా KKఎంట‌ర్ ప్రైజెస్ పేరుతో ప‌ట్ట‌ణంలో రాయ‌ప‌ట్నం రోడ్డులో కిరాణా దుకాణం న‌డుపుతున్న కేతెప‌ల్లి కృష్ణ కుమార్ కోటి 75 ల‌క్ష‌ల‌కు Sathupalli కోర్టులో ఐపి దాఖ‌లు చేశారు.దీంతో ఆయ‌న‌కు అప్పిచ్చిన బాధితులు ల‌బోదిబో మంటున్నారు. ఫిబ్ర‌వ‌రి 18వ తేదీన త‌క్కువ ధ‌ర‌కు యాక్టివా ద్విచ‌క్ర వాహ‌నాలు, ల్యాప్ టాప్‌, కుట్టు మిష‌న్లు ఇప్పిస్తాన‌ని న‌మ్మ‌బ‌లికి పట్ట‌ణానికి చెందిన రాధాకృష్ణ ప‌లువురి వ‌ద్ద నుండి భారీ స్థాయిలో డ‌బ్బులు తీసుకొని ఉండాయించాడు.

ఇది మ‌రువ‌క ముందే ప‌ట్ట‌ణానికి చెందిన రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి గంగ‌వ‌ర‌పు కొండా రెడ్డి ప‌లువురు వ‌ద్ద అప్పు తీసుకొని అవి చెల్లించ‌కుండా మూడు కోట్ల 10 ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు స‌త్తుప‌ల్లి Courtలో ఐపి దాఖ‌లు చేశారు. గ‌తంలో Madira ప‌ట్ట‌ణంలో వైరారోడ్డులో ఓ వ్య‌క్తి Auto మొబైల్ షాప్ ఏర్పాటు కోసం వ్యాపార అభివృద్ధి కోసం స్నేహితులు, బంధువుల వ‌ద్ద అందిన‌కాడికి అప్పులు తెచ్చారు. వాటిని తీర్చ‌లేక రూ.85 ల‌క్ష‌ల‌కు ఖ‌మ్మం కోర్టులో దివాలా పిటిష‌న్ దాఖ‌లు చేశారు. రూపాయి, రూపాయి కూడ పెట్టుకొని భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని న‌మ్మ‌క‌స్తుల‌ని, నామ‌మాత్ర‌పు వ‌డ్డీకి ఇస్తే ఇలా చేస్తారా? అని రుణ‌దాత‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

మ‌ధిర ప్ర‌జలు ఆందోళ‌న‌

అంతేకాకుండా ఒక కారు డ్రైవ‌ర్ సైతం 25 ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు స‌త్తుప‌ల్లి కోర్టులో ఐపి దాఖ‌లు చేశాడు. Madhiraలో ఒక వ్యాపారి రూపాయ వ‌డ్డీకి మూడు కోట్ల రూపాయ‌లు తీసుకొని అవి చెల్లించ‌కుండా కాల‌యా ప‌న చేస్త‌న్నారు. Madhira ప‌ట్ట‌ణానికి చెందిన ఒక బేక‌రీ వ్యాపారి అంద‌రితో న‌వ్వుతూ మాట్లాడి రెండు కోట్ల వ‌ర‌కు అప్పులు చేసి ముఖం చాటేశారు. ఇవన్నీ పెద్ద స్థాయిలో జ‌ర‌గ్గా చిన్న స్థాయిలో మా ఇంట్లో పెళ్లి అని, మా ఇంట్లో వాళ్ల‌కి బాగాలేద‌ని, పిల్ల‌ల చ‌దువుల పేరు చెప్పి 10 వేల నుండి 10 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు స్నేహితుల వ‌ద్దే తీసుకొని కొంద‌రు క‌నిపించ‌కుండా తిరుగుతున్నారు.

మ‌న‌తో పాటు క‌లిసి ప‌నిచేసే వ్య‌క్తి ఆప‌ద‌లో ఉన్నాడ‌న, మాన‌వ‌త్వంతో ఇంట్లో దాచుకున్న డ‌బ్బులు ఇస్తే తిరిగి అవి ఇవ్వ‌కుండా, వ‌డ్డీ వ్యాపారం చేయ‌డం నేర‌మంటూ కొంద‌రు బ్లాక్ మెయిలింగ్‌కు పాల్ప‌డు తున్నారు. న‌మ్మ‌క ద్రోహులు దెబ్బ‌కి నిజంగా ఎవ‌రికైనా డ‌బ్బులు అవ‌స‌రం అయితే డ‌బ్బులు ఇచ్చేందుకు ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. దీని వ‌ల్ల ఆప‌ద‌లో ఉన్న‌వారికి అవ‌స‌రానికి డ‌బ్బులు దొర‌క్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *