Madanapalle: ఒంటరి తనాన్ని అనుభవిస్తున్న మహిళ జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోయి నాలుగైదు రోజులు కావస్తుండడంతో మృతదేహాం కుళ్లిపోయి దుర్వాసన వస్తుండడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
జీవితం మీద విరక్తితో!
Madanapalle ఒకటో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని పిఅండ్ టి కాలనీకి చెందిన కృష్ణమూర్తి, లక్ష్మీదేవి దంపతులకు పిల్లలు లేకపోవడం తో ఓ బాలికను దత్తత తీసుకుని పెంచి పెద్ద చేసి పెళ్లిచేసి అత్తవారింటికి పంపేశారు. అప్పటి నుంచి భార్యాభర్తలు ఇద్దరే పిటండ్ టీ కాలనీలోని ఒక అద్దె ఇంట్లో ఉంటూ జీవనం చేసేవారు. కాగా మూడేళ్ల క్రితం మొదటి సారి Corona ప్రబలిన సమయంలో కృష్ణమూర్తి కరోనా బారిన పడి మృత్యవాత పడ్డాడు. అప్పటి నుంచి లక్ష్మిదేవి ఒంటరిగా ఉంటూ ఇళ్ళలో పాచిపనులు చేసుకుంటూ జీవనం సాగించేది. ఇటీవల ఆరోగ్యం దెబ్బతినడం, ఒంటరి జీవితం తో జీవితం పై విరక్తి చెందింది.


నాలుగు రోజుల క్రితం ఇంటికి గడియపెట్టి లోపల ఉండిపోయింది. భోజనం లో విషం కలుపుకుని తిని మృత్యువాత పడింది.. ఇంట్లో నుంచి దుర్వాసన వెదజల్లుతుండడంతో గమనించిన స్థానికులు Madanapalle పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ లోకేష్ సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితి ని సమీక్షించారు. తలుపు పగలగొట్టి చూడగా మృతదేహాం కుళ్లిపోయి పడి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.