Madanapalle అక్కాచెల్లెళ్ల హ‌త్య : విస్తుపోయే విష‌యాలు ఒక్కొక్క‌టి వెలుగులోకి!

0
28

Madanapalle అక్కాచెల్లెళ్ల హ‌త్య : విస్తుపోయే విష‌యాలు ఒక్కొక్క‌టి వెలుగులోకి!Madanapalle: తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం రేపిన చిత్తూరు జిల్లా మ‌దన‌ప‌ల్లె అక్కాచెల్లెళ్ల హ‌త్య‌(అలేఖ్య‌, దివ్య‌)  కేసులో విస్తుపోయే విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. మూఢ భ‌క్తితో ఇద్ద‌రు కూతుళ్ల‌ను డంబెల్‌తో అతి కిరాత‌కంగా కొట్టి చంపేసిన త‌ల్లీ ప‌ద్మ‌జ ఆ త‌ర్వ‌త పెద్ద కుమార్తె అలేఖ్య‌(27) నాలుక‌ను కోసి తినేసింది. ఈ విష‌యాన్ని ప‌ద్మ‌జ భ‌ర్త పురుషోత్తం నాయుడు డాక్ట‌ర్ల‌కు చెప్పిన‌ట్టు తెలుస్తోంది. పోస్టుమార్టం నివేదిక వ‌చ్చాక మాత్రం ఈ విష‌యంలో స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని పోలీసులు చెబుతున్నారు.

పూర్వ‌జ‌న్మ‌లో అర్జునుడిన‌ని చెప్పిన అలేఖ్య‌

తాను పూర్వ జ‌న్మ‌లో అర్జునుడిన‌ని అలేఖ్య త‌న‌తో చెప్పేద‌ని పురుషోత్తం డాక్ట‌ర్ల‌కు చెప్పిన‌ట్టు స‌మాచారం. క‌లియుగం అంత‌మై త్వ‌ర‌లోనే స‌త్య‌యుగం వ‌స్తుంద‌ని, క‌రోనా ఇందుకు చ‌క్క‌ని ఉదాహార‌ణ అని అలేఖ్య చెప్పేద‌ని, తాను చ‌దివిన ఆధ్యాత్మిక పుస్త‌కాల్లోనూ ఇలాంటి విష‌యాలే ఉండ‌టంతో ఆమె మాట‌లు వివ్వ‌సించాన‌ని పురుషోత్తం చెప్పిన‌ట్టు స‌మాచారం. ప‌ద్మ‌జ‌, పురుషోత్తం ఇద్ద‌రిలోనూ మాన‌సిక వ్యాధి ల‌క్ష‌ణాలు ఉండ‌టంతో వారిని విశాఖ‌లోని ప్ర‌భుత్వ మాన‌సిక చికిత్స కేంద్రానికి సిఫారుసు చేసిన‌ట్టు తిరుప‌తిలోని రుయా ఆసుప‌త్రి డాక్ట‌ర్లు తెలిపారు.

బిడ్డ‌ల కోసం ఇంటికి  వెళ‌తానంటున్న త‌ల్లీ

త‌న బిడ్డ‌లు తిరిగి వ‌స్తున్నార‌ని, వెంట‌నే ఇంటికి వెళ్లాల‌ని చెబుతున్న ప‌ద్మ‌జ, జైలులో త‌న‌కు తోడుగా ఉన్న శివుడు, కృష్ణ‌య్య క‌నిపించ‌డం లేద‌ని డాక్ట‌ర్ల‌కు చెబుతోంది. మ‌రోవైపు, వారి ర‌క్త సంబంధీకుల్లోనూ మాన‌సిక స‌మ‌స్య‌లు ఉన్న‌ట్టు డాక్ట‌ర్లు గుర్తించారు. ప‌ద్మ‌జ తండ్రి ఏకంగా 20 ఏళ్ల‌పాటుఇలాంటి స‌మ‌స్య‌ల‌తోనే ఇబ్బంది ప‌డిన‌ట్టు తేలింది. ప‌ద్మ‌జ మేన‌మామ‌లోనూ ఇలాంటి ల‌క్ష‌ణాలే ఉన్నాయ‌ని, తండ్రి నుంచి ప‌ద్మ‌జ‌కు, ఆమె నుంచి ఆమె కూతుళ్ల‌కు వంశ‌పారంప‌ర్యంగా ఇది సంక్ర‌మించి ఉండొచ్చ‌ని డాక్ట‌ర్లు భావిస్తున్నారు.

Madanapalle అక్కాచెల్లెళ్ల హ‌త్య, Madanapalle Parents Kill

మాన‌సిక స్థితి స‌రిగ్గా లేదు!

గ‌త 5 రోజుల క్రితం క‌న్న కూతుళ్ల‌ను మూఢ‌భ‌క్తితో హ‌త్య చేసిన కేసులో నిందితులు ప‌ద్మ‌జ‌, పురుషోత్తం నాయుడు 14 రోజుల రిమాండ్ నిమిత్తం మ‌ద‌న‌ప‌ల్లె స‌బ్ జైలులో ఉంటున్న విష‌యం తెలిసిందే. అయితే, వారి మాన‌సిక స్థితి స‌రిగా లేనందున‌, తిరుప‌తి రుయా ఆస్ప‌త్రికి త‌ర‌లించాల‌ని రెండు రోజుల క్రితం జైలు అధికారుల‌కు డాక్ట‌ర్లు సూచించారు. కోర్టు అనుమ‌తితో శుక్ర‌వారం ఉద‌యం నిందితుల‌ను జైలు నుంచి చిత్తూరు ఏఆర్ సిబ్బంది భ‌ద్ర‌త న‌డుమ తిరుప‌తి రుయా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఓపి అనంత‌రం వారిద్ద‌రినీ ఆస్ప‌త్రిలోని సైకియాట్రీ వార్డుకు త‌ర‌లించారు. నిందితుల ఆరోగ్య ప‌రిస్థితిపై ఆస్ప‌త్రి సూప‌రింటెండెంట్ భార‌తి ఆరా తీశారు.

Latest Post  Annamayya District:అన్న‌మ‌య్య జిల్లాలో సారాపై స‌మ‌రం

త‌రుచూ ఏవో పూజ‌లు చేసేది ప‌ద్మ‌జ‌

మ‌న‌ద‌ప‌ల్లె శివ‌న‌గ‌ర్‌లోని పురుషోత్తం నాయుడు కుటుంబం నివాస‌ముంటుంది. అలేఖ్య‌, సాయి దివ్య అక్కా చెల్లెళ్ల హ‌త్య కేసులో అరెస్టు కాబ‌డిన ప‌ద్మ‌జ‌, పురుషోత్తం నాయుడును పోలీసులు విచారించ‌గా ప‌లు ఆస‌క్తిక‌ర కోణాలు వెలుగుచూస్తున్నాయి. చిత్తూరుకు చెందిన ప‌ద్మ‌జ చాలా ఏళ్ల క్రిత‌మే మ‌దన‌‌ప‌ల్లెలో స్థిర‌ప‌డ్డారు. ఆమె త‌ల్లి చిత్తూరులోని ఎస్‌బీఐ కాల‌నీలో నివాస‌ముంటున్నారు. హ‌త్య‌కు గురైన అలేఖ్య‌, సాయిదివ్య త‌ర‌చూ అమ్మ‌మ్మ ఇంటికి వ‌చ్చేవారు. ప‌ద్మ‌జ త‌ల్లి ఇంట్లో త‌ర‌చూ ఏవో పూజ‌లు చేస్తుండేవార‌ని తెలుస్తోంది. ఈమె ద‌గ్గ‌ర కాల‌నీ వాసులు మంత్రాలు కూడా వేసుకున్న‌ట్టు స‌మాచారం. అర్థ‌రాత్రిళ్లు ఇంట్లో నుంచి పొగ‌లు రావ‌డం చూవామ‌ని స్థానికులు చెబుతున్నారు. ప‌లు మార్లు అలేఖ్య‌, సాయిదివ్య కూడా ఇక్క‌డ పూజ‌లు చేశార‌ని తెలిపారు. క్షుద్ర‌పూజ‌ల పేరిట మోసాల‌కు పాల్ప‌డేవారు త‌మిళ‌నాడు నుంచి చిత్తూరుకు వ‌స్తుంటారు. ఈ త‌రుణంలో పూజ‌లు చేసిన వ్య‌క్తి చిత్తూరు మీదుగా మ‌ద‌న‌ప‌ల్లెకు వెళ్లి ఉండొచ్చ‌నే అనుమానం త‌లెత్తుతోంది.

ఉన్న‌త‌ చ‌దువులు మూఢ‌న‌మ్మ‌కాల‌పై న‌మ్మ‌కాలు

అలేఖ్య ఉన్న‌త‌చ‌దువులు చదివింది. కానీ మూఢ‌న‌మ్మ‌కాల‌కు ప్ర‌భావితురాలైంది. మంచి చ‌దువు చ‌దువుకుని, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఉద్యోగం చేస్తున్న అలేఖ్య ప్ర‌ముఖ‌ల ప్ర‌సంగాల‌కు ఆక‌ర్షితురాలై.. వాటినే అధ్య‌యనం చేసిన‌ట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్ర‌ముఖ‌ల ప్ర‌సంగాలు వింటూ, ర‌చ‌న‌లు చ‌దువుతూ చివ‌ర‌కి వారు త‌మ‌ను తాము దేవుళ్లుగా ఊహించుకుంటూ భ్ర‌మ‌ల్లోకి వెళ్లి పోయార‌ని భావిస్తున్నారు. త‌న‌లా అమ్మాయి రూపంలో శివుడు రావ‌డం అరుద‌ని భావించి అలేఖ్య‌, త‌న మూఢ‌విశ్వాసాల‌ను త‌ల్లిదండ్రులు న‌మ్మేలా చేసింది.

Madanapalle అక్కాచెల్లెళ్ల హ‌త్య, Madanapalle Parents Kill

చివ‌ర‌కు ఉన్న‌త విద్యావంతులైన త‌ల్లిదండ్రులు కూడా అదే మూఢ విశ్వాసాల‌తో భ‌యాన‌క ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డ్డారు. ఇద్ద‌రు కుమార్తెల‌ను దారుణంగా హ‌త‌మార్చారు. వీరిద్ద‌రి మాన‌సిక ప‌రిస్థితిని ప‌రిశీలించిన వైద్యులు వారికి జైలు లాంటి వాతావ‌ర‌ ణంలోనే చికిత్స చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, అంద‌రితో పాటు ఉంచితే ప్ర‌మాద‌మ‌ని పేర్కొన్నారు. అందుకోసం వారికి విశాఖ ప్ర‌భుత్వ మాన‌సిక చికిత్స కేంద్రానికి వైద్యం కోసం సిఫార్సు చేశారు.

చెల్లి చ‌నిపోతా అంటే ఆపాల్సిన అక్క ప్రోత్స‌హించింది. చెల్లిని తిరిగి తీసుకు వ‌స్తానంటూ చెప్పిన అక్క‌ను వారించాల్సిన త‌ల్లిదండ్రులు ఆమెకు స‌హాయం చేయ‌డం ఫ్యామిలీ మొత్తం మాన‌సిక వ్యాధితో బాధ‌ప‌డుతున్న‌దని స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంది. ప‌ద్మ‌జ స‌న్నిహితుల‌ను మాన‌సిక వైద్యులు విచారించ‌గా ఆమె తండ్రి కూడా 20 ఏళ్లుగా మాన‌సిక స‌మ‌స్య‌లు ఎదుర్కొన్నార‌ని తెలిసింది. ప‌ద్మ‌జ మేన‌మామ కూడా ఇలాంటి ఇబ్బందులే ప‌డ్డార‌ని, వంశ‌పారంప‌ర్యంగా ప‌ద్మ‌జ‌కు, ఆమె కూతురు అలేఖ్య‌కు ఇది సంక్ర‌మించి ఉండొచ్చ‌ని మాన‌సిక వైద్యులు భావిస్తున్నారు.

Latest Post  lal bahadur shastri information: ఏకంగా హోంమంత్రినే బ‌య‌ట కూర్చోవ‌య్యా అంటూ క‌సురుకున్న కానిస్టేబుల్‌

ఇది చ‌ద‌వండి: జ‌గ‌న్ స‌న్నిహితుల‌ను నిమ్మ‌గ‌డ్డ టార్గెట్ చేశారా?

ఇది చ‌ద‌వండి: ఏపీలో నామినేష‌న్ల జాత‌ర ప్రారంభం

ఇది చ‌ద‌వండి:మ‌హ‌బూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం

ఇది చ‌ద‌వండి:స‌ర్పంచ్ అభ్య‌ర్థిగా మ‌హిళా వాలంటీర్ పోటీ ఎక్క‌డంటే?

ఇది చ‌ద‌వండి:అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌పై నిషేధం పొడ‌గింపు

ఇది చ‌ద‌వండి:రెండుగంట‌ల్లో మ‌ర్డ‌ర్ కేసును ఛేదించిన పోలీసులు

ఇది చ‌ద‌వండి:ఎమ్మెల్యే మామ‌య్య‌కు అరుదైన గౌర‌వాన్ని తెచ్చిన ఐపిఎస్ కోడ‌లు!

ఇది చ‌ద‌వండి:కేటీఆర్ ముఖ్య‌మంత్రి అయితే కేబినెట్‌ మారుస్తారా?

ఇది చ‌ద‌వండి:మ‌ద‌న‌ప‌ల్లె హ‌త్య‌లో దిమ్మ‌తిరిగే ట్విస్ట్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here