Madanapalle Murder : shocking twist in Madanapalle incident | మదనపల్లె హత్యలో దిమ్మతిరిగే ట్విస్ట్
అంతా పెద్దమ్మాయి డైరెక్షన్లోనే
Madanapalle Murder : shocking twist in Madanapalle incident | మదనపల్లె హత్యలో దిమ్మతిరిగే ట్విస్ట్Chittoor: చిత్తూరు జిల్లా మదనపల్లె(Madanapalle) లో ఇద్దరు కూతుళ్ల హత్య కేసులో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పెద్ద కూతురు అలేఖ్య గురించి షాక్‌కు గురయ్యే విషయాలు బయటకు వస్తున్నాయి.ఈ ఘటన మొత్తానికి పెద్దమ్మాయి అలేఖ్య (27)నే కారణమని తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రెండు వారాల క్రితం పెంపుడు కుక్కతో బయటకు వెళ్లిన చిన్న కూతురు సాయి దివ్య.. బయట ఏదో ముగ్గు తొక్కినట్టు అనుమానపడింది. అప్పటి నుంచి తాను చనిపోతానంటూ భయంతో ఏడుస్తూ ఉండేది. అంత బాధగా ఉంటే చనిపోవాలని, తాను మళ్లీ బతికిస్తానని అలేఖ్య రెచ్చ గొట్టింది.

ఈ నేపథ్యంలో ఈ నెల 23న భూత వైద్యుడితో తల్లిదండ్రులు పురుషోత్తం నాయుడు, పద్మజ దివ్యకు తాయొత్తులు కట్టించారు. అయినా ఈ నెల 24న మధ్యాహ్నం దివ్య తాను చనిపోతానంటూ.. ఏడుస్తూ ఇంట్లో మేడపైన ఉన్న తన గదిలోకి వెళ్లింది. తల్లిదండ్రులు, అలేఖ్య మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో గదిలోకి వెళ్లి దివ్యకు వేపాకులతో మంత్రాలు చేశారు. అయినా కూడా దివ్య గట్టిగా ఏడ్వడం ప్రారంభించింది. ఇక లాభం లేదనుకుని తల్లిదండ్రులు డంబెల్‌తో తలపై మోది చంపేశారు. తర్వాత శూలంతో పొడిచి ముఖాన్ని చెక్కేశారు.
చెల్లిని తీసుకొస్తానని చెప్పిన అలేఖ్య
ఇది జరిగిన నాలుగు గంటల తర్వాత సాయంత్రం 5 గంటల సమయంలో దివ్యను చంపినట్టుగానే తనను కూడా చంపెయ్యాలని అలేఖ్య తల్లిదండ్రులను కోరింది. తాను కూడా చనిపోయి చెల్లి దివ్యను తీసుకొస్తానని తల్లిదండ్రులను కోరింది. తాను పునర్జన్మలపై ప్రయోగాలు చేశానని, కుక్కను ఇలాగే చంపేసి బతికించానని తల్లిదండ్రులకు అలేఖ్య నమ్మబలికింది. తర్వాత పూజ గదిలోకి వెళ్లి గుండు కొట్టుకొని, బట్టలన్నీ విప్పేసి, ఒక చీర వంటి బట్టను ధరించింది. అనంతరం నవ ధాన్యాలు పోసిన రాగి చెంబును నోట్లో పెట్టుకుని పూజ గదిలో కూర్చుంది. తర్వాత కొన్ని పూజలు చేసిన తర్వాత సాయంత్రం 5 గంటల సమయంలో అలేఖ్యను దివ్య మాదిరిగానే డంబెల్స్‌తో కొట్టి తల్లిదండ్రులు చంపారు. ఇలా చెల్లిని తల్లిదండ్రులతో కలిసి చంపిన అలేఖ్య, చనిపోయిన దివ్యను తీసుకొస్తానని తల్లిదండ్రుల చేతిలో హతమైంది. పునర్జన్మలపై విశ్వాసమే ఈ హత్యలకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.
అలేఖ్య, సాయిదివ్య (ఫైల్)
ఇది చదవండి:తిరుపతి ఉప ఎన్నికలో జనసేన-బీజేపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి
ఇది చదవండి:నలుగురు తమిళ స్మగర్లు అరెస్టు
ఇది చదవండి: మళ్లీ రాజకీయాల్లో రాబోతున్న మెగాస్టార్!
ఇది చదవండి:స్థానిక ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్న బీజేపీ-జనసేన పార్టీలు
ఇది చదవండి:హత్యకు గురైన స్వామీజీ? వివాదమే కారణమా?
ఇది చదవండి:ఈ ఎన్నికలకు మీరు దూరంగా ఉండాలి: ఎస్ఈసీ