Madanapalle Crime: మ‌ద‌న‌ప‌ల్లె కేసు వాద‌న‌కు ముందుకొచ్చిన సుప్రీంకోర్టు న్యాయ‌వాది

Madanapalle Crime: మ‌ద‌న‌ప‌ల్లె కేసు వాద‌న‌కు ముందుకొచ్చిన సుప్రీంకోర్టు న్యాయ‌వాదిMadanapalle : చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లె లో అక్కాచెల్లెళ్ల జంట హ‌త్య కేసులో నిందితులైన త‌ల్లిదండ్రుల త‌ర‌పున వాదించేందుకు సాక్షాత్తు సుప్రీం కోర్టు న్యాయ‌వాది పీవీ కృష్ణ‌మాచార్య ముందుకొచ్చారు. డ‌బుల్ మ‌ర్డ‌ర్ కేసులో నిందితుడిగా ఉన్న ప్రొఫెస‌ర్ పురుషోత్తం నాయుడి ద‌గ్గ‌ర విద్య‌న‌భ్య‌సించిన పూర్వ విద్యార్థుల అభ్య‌ర్థ‌న మేర‌కే పీవీ కృష్ణ‌మాచార్య కేసును వాదించేందుకు సిద్ధ‌ప‌డ్డ‌ట్టుగా తెలుస్తోంది.
ఈ కేసు విష‌యంలో త‌న జూనియ‌ర్ ర‌జ‌నీ ద్వారా వివ‌రాల‌ను అడ్వ‌కేట్ కృష్ణ‌మాచార్య సేక‌రిస్తున్నారు. కేసులో పూర్వ‌ప‌రాలు తెలుసు కునేందుకు ర‌జ‌నీ మ‌ద‌న‌ప‌ల్లి జైలులో ఉన్న ప‌ద్మ‌జ‌, పురుషోత్తం నాయుడిని క‌లిశారు. ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాలు ద్వారా తెలుసుకునే ప్ర‌య‌త్నం చేసిన‌ట్టుగా తెలుస్తోంది.
మ‌ద‌న‌ప‌ల్లి జంట హ‌త్య‌ల కేసులో నిందితుల త‌ర‌పున వాదించేందుకు ఒప్పుకున్న న్యాయ‌వాది పీవీ కృష్ణ‌మాచార్య ఇప్ప‌టికే సంచ‌ల‌నం సృష్టించిన దిశ కేసులో ఎన్‌కౌంట‌ర్ కి వ్య‌తిరేకంగా కోర్టులో త‌న వాద‌న‌లు వినిపిస్తున్నారు.

Madanapalle Crime
పురుషోత్తం నాయుడు కుటుంబం (ఫైల్‌)

Madanapalle Crime:మూఢ‌న‌మ్మ‌కాల‌పై విశ్వాస‌మే!

ఉన్న‌త చ‌దువులు చ‌దివిన అలేఖ్య మూఢ‌న‌మ్మ‌కాల‌కు ప్ర‌భావితురాలైంది. మంచి చ‌దువు చ‌దువుకుని, మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో ఉద్యోగం చేస్తున్న అలేఖ్య ప్ర‌ముఖుల ప్ర‌సంగాల‌కు ఆక‌ర్షితురాలై, వాటిని అధ్య‌య‌నం చేసిన‌ట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్ర‌ముఖుల ప్ర‌సంగాలు వింటూ, ర‌చ‌న‌లు చ‌దువుతూ చివ‌రికి వారు త‌మ‌ను తాము దేవుళ్లుగా ఊహించుకుంటూ భ్ర‌మల్లోకి వెళ్లిపోయార‌ని భావిస్తున్నారు. త‌న‌లా అమ్మాయి రూపంలో శివుడు రావ‌డం అరుద‌ని భావించిన అలేఖ్య‌, త‌న మూఢ విశ్వాసాల‌ను త‌ల్లిదండ్రులు న‌మ్మేలా చేశారు.
చివ‌ర‌కు ఉన్న‌త విద్యావంతులైన త‌ల్లిదండ్రులు కూడా అదే మూఢ‌విశ్వాసాల‌తో భ‌యాన‌క ఘాతుకానికి పాల్ప‌డ్డారు. ఇద్ద‌రు కుమార్తెల‌ను దారుణంగా హ‌త‌మార్చారు. వీరిద్ద‌రి మాన‌సిక ప‌రిస్థితిని ప‌రిశీలించిన వైద్యులు వారికి జైలు లాంటి వాతావ‌ర‌ణంలోనే చికిత్స చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, అంద‌రితో పాటు ఉంచితే ప్ర‌మాద‌మ‌ని పేర్కొన్నారు. అందుకోసం వారికి విశాఖ‌ప‌ట్ట‌ణం ప్ర‌భుత్వ మాన‌సిక చికిత్స కేంద్రానికి వైద్యం కోసం సిఫార్సు చేశారు.

ఇది చ‌ద‌వండి:భార‌త దేశంలో కార్మిక ఉద్య‌మ చ‌రిత్ర పూర్వ ప‌రిస్థితి!

ఇది చ‌ద‌వండి: జ‌గ‌న్ స‌న్నిహితుల‌ను నిమ్మ‌గ‌డ్డ టార్గెట్ చేశారా?

ఇది చ‌ద‌వండి:మ‌హ‌బూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం

ఇది చ‌ద‌వండి:స‌ర్పంచ్ అభ్య‌ర్థిగా మ‌హిళా వాలంటీర్ పోటీ ఎక్క‌డంటే?

ఇది చ‌ద‌వండి:ఎమ్మెల్యే మామ‌య్య‌కు అరుదైన గౌర‌వాన్ని తెచ్చిన ఐపిఎస్ కోడ‌లు!

ఇది చ‌ద‌వండి:కేటీఆర్ ముఖ్య‌మంత్రి అయితే కేబినెట్‌ మారుస్తారా?

ఇది చ‌ద‌వండి:మ‌ద‌న‌ప‌ల్లె హ‌త్య‌లో దిమ్మ‌తిరిగే ట్విస్ట్‌

చ‌ద‌వండి :  Swamiji Murder In Chittoor | Chittoor Crime News | హ‌త్య‌కు గురైన స్వామీజీ? వివాద‌మే కార‌ణమా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *