Madagascar Island

Madagascar Island: అందాల ద్వీప‌క‌ల్పం..అయినా పేద దేశం..అదే మ‌డ‌గాస్క‌ర్‌!

Special Stories

Madagascar Island | ప్ర‌పంచంలోనే నాల్గో అతిపెద్ద ఐలాండ్ దేశంగా ఉంది. ఈ దేశంలో పురుషులు, మ‌హిళ‌లు ఒకే డ్ర‌స్ వేసుకుంటారు.అదే ఆఫ్రికా ఖండంలో ఉన్న‌ మ‌డ‌గాస్క‌ర్. ఇది ఒక ఐలాండ్ కంట్రీ. ప్ర‌కృతి అందాల‌కు నిల‌యం ఈ దేశం. ఇక్కడ చెట్లు ప్ర‌జా జీవ‌నానికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఈ దేశాన్ని రిప‌బ్లిక్ ఆఫ్ మ‌డ‌గాస్క‌ర్(Madagascar Island) అని కూడా పిలుస్తారు. హిందూ మ‌హా స‌ముద్రంలో గ‌ల ఒక ద్వీప దేశం. ఆఫ్రికా ఖండ‌పు ఆగ్నేయ తీరంలో ఉంది.

అందాల ద్వీప‌క‌ల్పం

ప్ర‌పంచంలోని ఉన్న జంతుజాలాలు 5% జంతు జాలాలు ఈ దేశంలోనే ఉన్నాయ‌ట‌. ప్రాచీన హిందువులు తూర్పు మ‌లియ ద్వీప‌క‌ల్పం మొద‌లుకొని, జావా, సుమిత్ర ద్వీప‌క‌ల్పం నుంచి ప‌శ్చిమాన ఉన్న మ‌డ‌గాస్క‌ర్(Madagascar) దీవుల వ‌ర‌కు త‌మ వ్యాపారాల‌ను విస్త‌రింప జేసుకున్నారు. తూర్పు ఆఫ్రికా తీరంలో సుమారు 400 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న హిందూ మ‌హాస‌ముద్రంలోని ద్వీప దేశం మ‌డ‌గాస్క‌ర్‌. 5 ల‌క్ష‌ల 92 వేల 800 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల తో మ‌డ‌గాస్క‌ర్ ప్ర‌పంచ‌లోనే 47వ ద్వీపం దేశంగా ఉంది. ఈ దేశం జ‌నాభా 2 కోట్ల 80 ల‌క్ష‌ల మంది. అత్య‌ధిక జ‌నాభా గ‌ల దేశాల‌లో మెడ‌గాస్క‌ర్ 51వ స్థానంలో ఉంది.

మ‌డ‌గాస్క‌ర్ రాజ‌ధాని అంటానా న‌రివో(Antananarivo). ఈ దేశంలో అతిపెద్ద న‌గ‌రం కూడా ఇదే. ఈ సిటీ నైటు స‌మ‌యంలో అందం డ‌బుల్ అవుతుంది. ఇక్క‌డ ఈవినింగ్ అయితే చాలు పార్టీలు ప్రారంభ‌మ‌వుతాయి. ఈ దేశం క‌రెన్సీని మ‌డ‌గ‌సి అరేరీ అంటారు. ఈ దేశం క‌రెన్సీ మ‌న రూపాయి కంటే త‌క్కువ‌. 55 మడ‌గ‌సి అరేరీలు మ‌న దేశ రూపాయితో స‌మానం. మోరింగీ అనేది మ‌డ‌గాస్క‌ర్ యొక్క సాంప్ర‌దాయ యుద్ధ క‌ళ‌. ఆయుధాలు లేకుండా వ‌ట్టి పిడికిళ్ల‌తో ఫైట్ చేస్తారు. ఇక్క‌డ ఇదే ఫ్యామ‌స్ క్రీడ‌. మ‌రోసే రానానా స‌మ‌యంలో ఈ క్రీడ ఉద్భ‌వించింది.

తూర్పు ఆఫ్రికాకు 400 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఈ దేశం 5 వేల కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఇండోనేషియా సంస్కృతిని ఫాలో అవుతుండ‌టం గ‌మ‌నార్హం. ఈ దీవిలో పూర్వం ఆసియా దేశ‌స్థులే వ‌ల‌స వెళ్లి ఉండ‌టం వ‌ల్ల ఇప్ప‌టికీ అక్క‌డ ఆసియా ప్ర‌జ‌ల ఛాయ‌లే ఉన్నాయి. ఈ దీవిలో మొత్తం 18 ర‌కాల తెగ‌ల ప్ర‌జ‌లు ఉన్నారు. తెగ‌లు వేరు అయినా అంద‌రూ మాట్లాడేది మ‌ర‌గ‌సీ భాష‌నే. ఈ దీవి వైశాల్యంలో ప్ర‌పంచంలోనే నాల్గోవ స్థానంలో ఉంది. 15వ శ‌తాబ్ధంలో పోర్చుగీసు వారు ఈ దీవిని మొద‌ట క‌నుగొన్నారు. 18వ శ‌తాబ్ధం ఆరంభం నుండి ఫ్రెంచ్ రాజులు దీనిని ప‌రిపాలించారు.

పేద దేశం

ఈ దీవిలో ప్రాణుల ఉనికి 150 మిలియ‌న్ల సంవ‌త్స‌రాల కింద‌టే ఉంద‌ని శాస్త్ర‌వేత్త‌లు అంచ‌నా వేస్తున్నారు. అనేక ర‌కాల ఖ‌నిజాలు దీవిలో ల‌భ్య‌మ‌వుతున్న‌ప్ప‌టికీ ప్ర‌పంచంలోని పేద దేశాల జాబితాలో మ‌డ‌గాస్క‌ర్ ముందు వ‌రుస‌లో ఉంటుంది. ఇక్క‌డ జ‌నాభాలో 80 శాతం కేవ‌లం జీవ‌నం కొన‌సాగ‌డానికే వ్య‌వ‌సాయం చేస్తున్నారు. వ‌రి ధాన్యం ఈ దీవిలో అధికంగా పండుతుంది. 1960లో ఇక్క‌డ స్వాంతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత ఇక్క‌డ మ‌డ‌గ‌స‌రి ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. వాస్త‌వానికి ఈ దేశం పూర్వం భార‌త దేశానికి అనుకుని ఉండేద‌ని మ‌హా ఖండం గోడ్వానా చ‌రిత్ర కార‌ణంగా విడిపోయింద‌ని పురాణాలు చెబుతున్నాయి. ఇక్క‌డ వాతావ‌ర‌ణం చాలా ప్ర‌శాంతంగా ఉంటుంది. అందుకే ఇక్క‌డ అనేక ర‌కాల పంట‌లు, జంతువులు అభివృద్ధి చెందుతున్నాయి.

అందువ‌ల్ల మ‌డ‌గాస్క‌ర్ ఒక జీవ వైవిధ్య ప్ర‌దేశంగా అవ‌త‌రించింది. ఈ దేశంలో ఉన్న వన్య‌ప్రాణుల్లో ప్ర‌పంచంలో మ‌రెక్క‌డా కూడా క‌నిపించ‌వు. ఈ ఐలాండ్‌లో అన్నీ ఉంటాయి. పెద్ద పెద్ద ప‌ర్వ‌తాలు, సేద్యం చేసేందుకు భూమి, స‌ముద్ర తీరం, ప్రాణులు జీవించ‌డానికి అనుకూల స్థ‌లం కావ‌డం వ‌ల్ల ప‌ర్యాట‌క రంగంగా కూడా పేరొందింది. ఈ దేశంలో ప్ర‌జ‌లు బోర్నియా దేశం నుంచి వ‌చ్చిన వారు. ప్ర‌పంచంలో మ‌రే దేశంలో కూడా ఒకేలా వ‌స్త్రాధ‌ర‌ణ చేయ‌డం కుద‌ర‌దు. కానీ ఈ దేశంలో ఒకేలా వ‌స్త్రాధ‌ర‌ణ క‌నిపిస్తుంది. లాంబ అనేది ఇక్క‌డ ప్ర‌జ‌లు వేసుకునే వ‌స్త్రాధ‌ర‌ణ‌.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *