Maadi Telangana Jaathi MP3 Song | కందికొండ యాదగిరి(kandikonda yadagiri)….ఈ పేరు వింటేనే తెలంగాణ తల్లి మురిసి పోతుంది. తెలంగాణ సమాజం వెయ్యి గొంతులతో ఉద్యమ పాటను వెలుగెత్తి పాడుతుంటాయి. ప్రత్యేక రాష్ట్రం కోసం కందికొండ కలం ఉద్యమం లో దూకి చిందులు వేసింది. ఆ పాటకు తెలంగాణ బిడ్డలు దూందాం ఆడారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ప్రత్యేక రాష్ట్ర పాలన కొనసాగుతుంది. ఇది మురిసి తరించిన కందికొండ యాదగిరి నేడు మన మధ్య నుండి వెళ్లిపోవడం ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు తీరని శోఖం. కందికొండ యాదగిరి ప్రముఖ తెలంగాణ కవి, పాటల రచయిత, తెలంగాణ ఉద్యమ కళాకారుడు అని చెప్పవచ్చు.
Maadi Telangana Jaathi MP3 Song
కందికొండ యాదగిరి(kandikonda yadagiri) రాసిన పాట మాది తెలంగాణ జాతి..అనే పాట అప్పట్లో తెలంగాణ ప్రజలకు నచ్చిన మెచ్చిన పాట. ఆ పాట వింటుంటేనే ఒళ్లు నిక్కరపొడిచేలా రాశారు కందికొండ. ఇప్పుడు కందికొండ యాదగిరిను స్మరించుకుంటూ వారు పాడిన ఈ పాటను అందరూ వింటున్నారు. అప్పటి ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో యాదగిరి రాసిన పాటలు సూపర్ డూపర్ హిట్‌ను అందుకున్నాయి. ఇప్పటికీ అవి ఎవర్గ్రీన్ గా మారాయి. 2001లో ఇట్లు శ్రావణి సుబ్రమణ్యంలో 1.మల్లికూయవే గువ్వా..2.నీకోసం వచ్చి, ఇడియ్ సినిమాలో 3.చూపుల్తో గుచ్చి గుచ్చి…4.ఈ రోజే తెలిసింది, 5.సర సర సై లాంటి సూపర్ హిట్ పాటలు రాశారు.
కందికొండ ఎక్కువుగా లవ్ సాంగ్సే రాశారు. అమ్మనాన్న, ఓ తమిళ అమ్మాయి, శివమణి, సత్యం, ఆంధ్రావాలా, 143 లాంటి సినిమాలకు మంచి పాటలు రాశారు. సినిమా పరిశ్రమలో రవితేజ, మహేష్, ప్రభావస్, అల్లు అర్జున్ లాంటి పెద్ద పెద్ద హీరోల సినిమాలకు పాటలు రాశారు. ఎక్కువుగా రవితేజ తీసిన సినిమాలకే పాటలు రాశారు. తెలంగాణ కళాకారుల్లో కందికొండ యాదగిరికి ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలంగాణ కళాకారుల్లో అతి కొద్ది మందిలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన వారులో వీరు ఒకరు. తెలంగాణ బాస, యాసతో చెవులకు ఇనుసొంపుగా ఉండే ఎన్నో పాటలు అందించి అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు. 2022, మార్చి 12న తుదిశ్వాస విడిచి మన మధ్య నుండి వెళ్లిపోయారు.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ