LPG Cylinder price న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ శుభవార్త చెప్పింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ఉపయోగించే వారికి కాస్త ఊరట లభించినట్టయ్యింది. చమురు మార్కెటింగ్ సంస్థలు వాణిజ్య సిలిండర్ ధరను రూ.91 తగ్గించాయి. దేశ రాజధాని ఢిల్లీలో రూ.2 వేలకు పైగా ఉన్న సిలిండర్ ధర రూ.1907కు దిగొచ్చింది. సవరించిన ధరలు మంగళవారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చినట్టు చమురు మార్కెటింగ్ (LPG Cylinder price)సంస్థలు ప్రకటించాయి.
ఇప్పటికే కమర్షియల్ సిలిండర్ ధర పెరుగుతుండటంతో చిన్న వ్యాపారులు, హోటల్స్ నడుపుకునే వారు, రెస్టారెంట్ నిర్వహాకులపై భాగా భారం పెరుగుతూ వచ్చింది. ధర తగ్గింపుతో వారికి కాస్త ఊరట లభించింది. ఇక మరోవైపు విమాన ఇంధన ధరను రికార్డు స్థాయిలో 8.5 శాతాన్ని చమురు మార్కెటింగ్ సంస్థలు పెంచాయి. దీంతో ఢిల్లీలోని కిలో లీటర్ ATF ధర రూ. 6,743 పెరిగింది. ఏటీఎఫ్ చరిత్రలో ఇదే అత్యధిక ధర కావడం గమనార్హం. అంతర్జాతీయంగా కూడా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చమురు కంపెనీలు తెలిపాయి. 2008 సంవత్సరంలో క్రూడ్ ఆయిల్ ధర బ్యారల్ 147కి చేరినప్పుడు ATF ధర 71,028 గా ఉంది.
ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధర రూ.91 డాలర్లుగానే ఉన్నప్పటికీ విమాన ఇంధన దర రూ.86,000 వేలకు పైగా చేరింది. తాజా పెంపుతో విమాన ఇంధన ధర నెల రోజుల వ్యవధిలో 3వ సారి పెరిగినట్టయింది. ఇప్పటికే జనవరి 1న 2022 205 శాతం, జనవరి 16న 4.25 శాతం ధరలు పెరిగాయి. ఇప్పుడు ఏకంగా 8.5 శాతం పెరిగింది.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!