lovers suicide: తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రేమ జంట మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. తిరుపతి గోవిందరాజు స్వామి ఆలయ నార్త్ మాడ స్ట్రీట్లో ఉన్న ఓ ప్రైవేటు లాడ్జిలో ఈ ఘటన వెలుగు చూసింది. తూర్పు గోదావరి కొవ్వూరు కి చెందిన అనూష, హైదరాబాద్కు చెందిన కృష్ణారావుగా పోలీసులు గుర్తించారు.
ఏడాది క్రితం పోసి బాబుకు అనుషాను ఇచ్చి కుటుంబ సభ్యులు వివాహం చేశారు. ఇష్టం లేని పెళ్లి చేయడంతోనే ఆత్మహత్య(lovers suicide) చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ నెల మూడో తేదీ తూర్పు గోదావరి కోవూరు పోలీసు స్టేషన్లో అనూషపై మిస్సింగ్ కేసు కూడా నమోదయ్యింది.