Lovers Committed Suicide : నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. సుమారు 15 రోజుల కిందట ఓ అడవిలో ఇద్దరు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నారు.
Lovers Committed Suicide: ప్రేమజంట చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిజామాబాద్ జిల్లా సయీద్పూర్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో గురువారం వెలుగు చూసింది. మోస్రా మండలం తిమ్మాపూర్కి చెందిన మోహన్, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలానికి చెందిన లక్ష్మిగా పోలీసులు గుర్తించారు. అయితే 15 రోజులు క్రితమే వీరిద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతురాలు లక్ష్మికి ఆరు నెలల క్రితం మరొకరితో వివాహం జరిగింది. సుమారు 15 రోజుల క్రితం వారు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం ఇద్దరి మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started
- Grammarly Check For Great Writing, Simplified
- tips for glowing skin homemade | అందమైన ముఖ సౌందర్యం కోసం టిప్స్
- mutton curry types: మటన్ కూరల తయారీ విధానం ఇక్కడ నేర్చుకోండి!