Lovers commit suicide: ప్రేమికుల ఆత్మహత్యాయత్నం | ఒకరు మృతి
Lovers commit suicide: ప్రేమికుల ఆత్మహత్యాయత్నం
Lovers commit suicide: ప్రేమ వివాహం చేసుకున్న భార్యభర్తల జంట ఆత్మహత్యాయత్నానికి(Lovers commit suicide)కు పాల్పడిన చేసుకున్న సంఘటన గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది. నెల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో భర్త చనిపోగా, భార్య పరిస్థితి విషమంగా ఉంది. తండ్రికి ఫోన్ చేసిన మాట్లాడిన యువకుడు కొద్దిసేపటికే ఇలా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.
ప్రకాశం జిల్లా హనుమంతులపాడు మండలంలోని చిన్న ముప్పాళ్లపాడుకు చెందిన పృథ్వీ, హైదరాబాద్ లోని జవహార్‌నగర్‌కు చెందిన ఫర్హానాలు మంగళవారం ఉండవల్లి గుహల సమీపంలో కొండపైకి వెళ్లారు. అక్కడున్న కొందరు పిల్లలు వారిని గమనించి ఇంటి దగ్గర తల్లిదండ్రులకు చెప్పారు. ఈ జంట ఎంత సేపటికీ కిందకు రాకపోవడంతో అనుమానంతో స్థానికులు కొండపైకి వెళ్లి చూశారు.
ఘటనా స్థలంలో ఇద్దరూ నురగలు కక్కుతూ పడి ఉండటం చూసి వెంటనే 108 వాహన సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఇద్దర్నీ ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అప్పటికే పృథ్వీ చనిపోగా, యువతి అపస్మారక స్థితిలో ఉండటంతో స్థానికులు కొండపై నుంచి మోసుకొచ్చి అంబులెన్స్‌లో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పోలీసుల సమాచారంతో ఘటనా స్థలానికి వెళ్లి మృతుడి జేబులో ఫోన్ నెంబర్, ఆధార్, ఓటరు గుర్తింపు కార్డులను గుర్తించారు. వాటి ద్వారా ప్రకాశం జిల్లా చిన్నముప్పాళ్లపాడులోని అతని తండ్రి గోపాలరెడ్డికి సమాచారం ఇచ్చారు.
పండ్ల వ్యాపారం చేస్తున్న పృథ్వీ
మృతుడు పృథ్వీ కొంత కాలంగా తెనాలి, విజయవాడ ప్రాంతాల్లో పండ్ల వ్యాపారం చేశారు. ఇటీవల హైదరాబాద్ వెళ్లి జవహర్‌నగర్ లో అదే వ్యాపారం ప్రారంభించారు. అక్కడే ఫర్హానాను ప్రేమించి జనవరిలో ఇద్దరూ కలిసి వెళ్లిపోయారు. మరో వైపు ఆమె తల్లిదండ్రులు అక్కడి పోలీస్ స్టేషన్లో తమ కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు.
మంగళవారం సాయంత్రం చిన్నముప్పాళ్లపాడులోని తండ్రికి పృథ్వీ ఫోన్ చేసి తాను ప్రేమించి, పెళ్లి చేసుకున్నానని, కోడలను ఇంటికి తెస్తున్నానని తండ్రి గోపాల్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరో వైపు పృథ్వీతో ఫర్హాన వెళ్లినట్టు గుర్తించిన ఆమె బంధువులు చిన్నముప్పాళ్లపాడు చేరుకుని ఆరా తీశారు.
ఇంతలోనే ఇద్దరూ ఆత్మహత్యకు యత్నించారని, పృథ్వీ మృతి చెందాడని తెలుసుకొని అమ్మాయి కుటుంబ సభ్యులు తెలుసుకుని తీవ్ర ఆందోళన చెందారు. అమ్మాయి కాళ్లకు మెట్టెలు ఉన్నాయని, ఇరువురూ పెళ్లి చేసుకున్నట్టు భావిస్తున్నారు.
ఇది చదవండి: family health optima insurance plan: తెలుగులో తెలుసుకోండి!
ఇది చదవండి:నిఘా నీడన పంచాయతీ ఎన్నికలు!
ఇది చదవండి:జగ్గయ్యపేటలో కొనసాగుతున్న పోలింగ్
ఇది చదవండి:అటవీ శాఖకు బాలుడు ఫిర్యాదు,రూ.67వేలు జరిమానా!
ఇది చదవండి:ఎన్నికల వేళ ఏపీలో భారీగా మద్యం స్వాధీనం!
ఇది చదవండి: మంత్రి పువ్వాడపైన నిప్పులు చెరిగిన భట్టి విక్రమార్క
ఇది చదవండి:పదేళ్లు నేనే సీఎంను! ఇది పక్కా!
ఇది చదవండి:మరో పవన్ కళ్యాణ్ లా వస్తున్న ఉప్పెన వైష్టవ్ తేజ్