Love Proposal Surveyకొందరికి తొలిచూపులోనే తొలి ప్రేమ చిగురిస్తుంది. మరికొందరికి చూపులు తగిలి, చిలిపి నవ్వులు విరిసి, కొంటె సైగలు కసిరి.. ఇలా సినిమాల్లో సీన్లలా ప్రేమ ఫలిస్తుంది. ఇంకొందరికి ఏళ్లకేళ్లు దారికాచినా కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసినా కిస్మత్ కలిసిరాదు. ఎవరి సంగతి ఎలా ఉన్నా ఇదివరకెన్నడు కలవని మనుషులు, ప్యార్ కియాతో డర్నా క్యా అనుకోవడానికి ఎన్ని రోజులు పడుతుందో ఓ స్టడీలో లెక్క కట్టారంట. dating website నిర్వహించిన ఈ స్టడీలో రెండు వేల మంది యువతీ యువకులు వారి వారి ప్రేమ ప్రయాణం గురించి పూసగుచ్చినట్టు (Love Proposal Survey) వివరించారు.
కళ్లతో ఎన్ని రోజులు మాట్లాడుకుంది.. మాటలు కలవడానికి ఎన్ని రోజులు పట్టింది…హద్దులు దాటడానికి ఎంత కాలం పడుతుంది. ఇలా ప్రేమాయాణంలో రకరకాల పర్వాలకు పట్టిన కాలాలను వెల్లడించారు. ఈ వివరాలన్నీ క్రోడీకరించిన సదరు సంస్థ 143 (i love you)వ్యక్త పరచడానికి 144 రోజులు పడుతుందని లెక్క తేల్చింది. అది కూడా ప్రేమ పుట్టడం మొదలు దాన్ని వ్యక్త పరిచే వరకు ఉన్న రకరకాల మైలు రాళ్లను పక్కాగా దాటగలిగితేనే 144వ రోజున ప్రేమ ఎంతో మధురంగా ఉంటుందని లేని పక్షంలో ప్రియుడు లేదా ప్రియురాలు కఠినంగా కనిపించవచ్చని సందేహం వ్యక్తం చేసింది.


ఫెయిల్యూర్‌కు గల కారణాలను అటుంచితే, కాస్త ప్లాన్డ్గా ప్రేమిస్తే ఐదు నెలల్లో లవ్ సక్సెస్ గ్యారెంటీ అని సదరు సర్వే ప్రేమికులకు సరికొత్త ఉత్సాహాన్నిచ్చింది.
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!
- Migraine: భరించలేని మైగ్రేన్ తలనొప్పి వస్తుందా?
- Amavasya: అమావాస్య రోజున ఏమి జరుగుతుంది?
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?