love

love poetry in telugu:నిజ‌మైన ప్రేమికుల తెలుగు ప్రేమ క‌విత‌లు

Telugu stories

love poetry in telugu:నిజ‌మైన ప్రేమికుల తెలుగు ప్రేమ క‌విత‌లు

-ప్ర‌తిక్ష‌ణం నీకు దూరం అవుతున్నాన‌ని అనుకున్నా
కానీ…అనుక్ష‌ణం నీ ఆలోచ‌న‌ల‌తో నీకు మ‌రింత చేరువ‌వుతున్నా.

-ఎన్నెన్ని కాలాలు మారినా ఎద‌లో నీ జ్ఞాప‌కాలు మాత్రం ఎన్న‌టికీ మార‌వు.

-ఎటో తెలియ‌ని దారుల్లో ఎవ‌రి కోసం న‌డిచే న‌డ‌కనో…
గ‌మ్యం తెలియ‌ని తీరంలో కొట్టుకునే నావ‌నో..
ఎగిసే అల‌ల తాకిడికి గురైన తీరంనో…
ఎలా వ‌ర్ణించ‌ను నిన్ను!
ఎలా వ‌ర్ణించ‌ను నిన్ను!!

-గుండెల్లో ప‌దే ప‌దే స్పందించి
నీవైపు లాగేస్తూ.. ఒక అద్భుత‌మైన ఒక అనంత‌మై
ఒక సంతోష‌మై ఒక ఉప్పెనై మ‌న మ‌న‌సుల‌ను
కొత్త లోకానికి తీసుకెళ్లే శ‌క్తి ఈ ప్రేమ‌.

-ఇన్నాళ్లు నువ్వు నా బ‌లం అనుకున్నా.
కానీ..నా బ‌ల‌హీన‌త కూడా నువ్వేన‌ని
నువ్వు తోడుగా లేని క్ష‌ణ‌మే తెలుసుకున్నా.

-నా హృద‌య‌మ‌నే కోవెల‌ను
ప్రేమ అనే తాళంలో తెరిచి చూస్తే
అందులో కొలువుంది నీ రూపం.

-నా మ‌న‌సుకు మాట‌లొస్తే
అది ప‌లికే తొలి మాట‌…
నువ్వంటే నాకిష్ట‌మ‌ని

-నీ మాట‌ల పూతోట‌లోకి వ‌స్తున్నా
ఆ ప‌రిమ‌ళంతోనే నేనూ గుబాళిద్దామ‌ని

-ఒంట‌రిగా ఉన్న‌ప్పుడు నీ జ్ఞాప‌కాల‌తో
ఎలా స‌హ‌జీవ‌నం చేయొచ్చో
నీ స‌హ‌చ‌ర్యంలో నేర్చుకున్నాను.

-గాలి లాంటిది నీ జ్ఞాప‌కం
ఎప్పుడూ న‌న్ను తాకుతూనే ఉంటుంది
స్పంద‌న క‌లిగిస్తూనే ఉంటుంది.

త‌ప‌న‌: love poetry in telugu:

-ఓ హృద‌య రాగ‌మా
నా మ‌దిలో క‌ద‌లాడే ప‌రిమ‌ళ తాళ‌మా
నీ అనురాగ జోల ప‌ల్ల‌(కి)వికై
నే ప‌రిత‌పిస్తున్నాన‌ని
విప్ప‌రాని కంఠంతో
విష‌ము దిగ‌మింగిన శివునివోలె
త‌హ‌త‌హ‌లాడుతున్నా

-న‌న్నాద‌రించ రావా అని
మ‌న‌సు విప్ప వ‌ష‌ము గాదు
చూపు క‌లిపే సాకు లేదు
ఆశ వ‌దిలే వీలు లేదు
ఏమ‌ని చెప్ప‌ను నా పిచ్చి ప్రేమ‌
ఇక‌పై నీవే తెలుసుకో నేస్త‌మా!

-నీ పేరు విన‌గానే నా ప్రాణానికి,
నీ మాట విన‌గానే నా మ‌న‌సుకి,
నీ పిలుపు విన‌గానే నా హృద‌యానికి
పుణః జ‌న్మ పుట్టుకొస్తుంది ప‌రుగు ప‌రుగునా..

-నిన్ను వ‌ద్దు అనుకున్న
ప్రేమ వెంట ప‌డ‌వ‌ద్దు
ప‌డి లోకువ కావ‌ద్దు
బ్ర‌తిమాలి ఒప్పించేది కాదు ప్రేమంటే
నువ్వు లేక‌పోతే చస్తాన‌ని
బెదిరించేది కాదు ప్రేమంటే
మ‌న తోడై వుండి నువ్వు లేనిదే నేను లేను
క‌ష్ట‌మైనా సుఖ‌మైనా
క‌లిసి క‌డ‌వ‌ర‌కూ న‌మ్మ‌కంతో
జీవిద్దామ‌న్న‌దే ప్రేమంటే

-స‌ముద్రంలో ఉండే చేప క‌న్నీళ్లు ఎవ్వ‌రికీ క‌నిపించ‌వు
ఒక వేళ అవి క‌నిపించినా ఎవ్వ‌రికీ అర్ధం కావు
మ‌నిషి జీవితం కూడా అంతే…
ప్ర‌తి మ‌నిషికి బాధ‌లు, క‌న్నీళ్లు ఉంటాయి
కానీ ఆ క‌న్నీళ్లు వెనుక కార‌ణాలు
ఎవ్వ‌రికీ క‌నిపించ‌వు, ఒక వేళ క‌నిపించినా
వారి క‌ష్టాలు ఎవ్వ‌రికీ అర్థం కావు…
ఏమైనా స్వీయానుభ‌వంతో తెలుసుకోవాల్సిందే…

-నువ్వు అలిగావ‌ని నేను అలిగితే..
ఆ బంధం నిల‌బ‌డ‌దు..
బంధం నిల‌బ‌డాలంటే..
బాధ బ‌రించాలి, బ‌తిమాడాలి, బుజ్జ‌గించాలి
అప్పుడే ఆ బంధం శాశ్వ‌తంగా నిలుస్తుంది!

-ఒక్క‌సారి మ‌న‌సిచ్చి చూడు…
పైపైన మ‌నిషిని కాదు, లోనున్న మ‌న‌సుని చూడు
పెద‌వుల పై నుండి కాదు, గుండె లోతుల్లోంచి మాట్లాడి చూడు
రోజా పువ్వుతో కాదు, నీ చిరున‌వ్వుతో ప్రేమ‌ను చెప్పి చూడు
వెంట‌ప‌డి వేధించ‌డం కాదు, కంటి చూపుతో క‌బురంపి చూడు
ఒక్క‌సారి మ‌న‌సిచ్చి చూడు…

-నువ్వు చూడ‌కున్నా…
అనునిత్యం నిన్నే చూస్తున్నా….
నువ్వు నా చెంత‌కు చేర‌కున్నా..
నిరంత‌రం నీ నీడ‌లో న‌డుస్తున్నా…
క‌లిసే అవ‌కాశం కోసం ఎదురు చూస్తున్నా…
నీతో మాట్లాడే క్ష‌ణం కోసం త‌పిస్తూ ఉన్నా…
క‌రుణిస్తావా…క్ష‌ణ‌మైనా..
వేచి చూస్తారు యుగ‌మైనా…

-లోతుకు పాతుకుపోయిన నీ చూపుల‌తో
నా మ‌దిలో చిత్రాన్ని గీశావు
ఎద చీక‌టి గ‌దుల‌లో జ్ఞాప‌కాల దివ్వెతో
నీ త‌ల‌పుల శ్వాస‌ను నింపావు

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *