Love on wife: kakinada: భార్యపై ఉన్న ప్రేమతో ఆమె విగ్రహం తయారు చేయించిన సంఘటన తాజాగా ఆంధ్రప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది. తనను విడిచి వెళ్లిన భార్యకు తనకున్న ఎనలేని ప్రేమను చాటుకున్నాడో భర్త. ఆమె మధురస్మృతులు ఎప్పటికీ తనతోనే ఉండాలని ఉద్దేశంతో భార్యకు ఏకంగా నిలువెత్తు విగ్రహాన్ని తయారు చేయించాడు. అంతేకాదు ఆ విగ్రహాన్ని వేదమంత్రాల సాక్షిగా ఇంట్లో ప్రతిష్టించుకున్నాడు.
కాకినాడ రూరల్ మండలం అచ్చంపేట గ్రామం రమణరావు కాలనీలో మూడో ఏపీఎస్పీ రిటైర్డ్ ఆర్ఎస్ఐ బుర్ర వీరభద్రం నివాసముంటున్నారు. ఇతని భార్య మాణిక్యమ్మ. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. అయితే గతేడాదిన్నర క్రితం అంతుపట్టని రోగంతో భార్య అకస్మాత్తుగా తనువు చాలించింది. దీంతో వీరభద్రం తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. మాణిక్యమ్మ జాప్ఞకాలు పదిలంగా దాచుకోవాలని అనుకున్నాడు. ఇందుకు కోసం ఆమెకు నిలువెత్తు విగ్రహం(wife statue) చేయించాడు.
నవర గ్రామానికి చెందిన శిల్పి సత్యలింగంను సంప్రదించి అతని భార్య ప్రతిమను టేకు చెక్కతో తయారు చేయించాడు. మూడు నెలల శ్రమ ఫలితంగా మాణిక్యమ్మ ప్రతిబింబం తయారైంది. వేదపండితుల నడుమ, పూజా కార్యక్రమాలతో ఆమె ప్రతిమను ఇంట్లో ఏర్పాటు చేసుకుని పూజలు నిర్వహించాడు. వీరభద్రంకు తన భార్యపై ఉన్న ప్రేమను చూసిన స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇది చదవండి:రోడ్డు ప్రమాదంలో 50 గొర్రెలు మృతి
ఇది చదవండి:మిస్సైన బంగారం దొంగలు దొరికారు!
ఇది చదవండి: 26న దేశవ్యాప్తంగా బంద్కు పిలుపు!
ఇది చదవండి:కిడ్నాప్ నాటకమాడిన యువతి ఆత్మహత్య
ఇది చదవండి:దెయ్యం భయ్యం..కాలనీ ఖాళీ చేసిన ప్రజలు