- ప్రేమ జంటను డబ్బులు డిమాండ్ చేసిన ఎస్సై
- చివరకు సస్పెండ్ అయిన వైనం
love marriage: ఆ ఇద్దరు ప్రేమించుకున్నారు. పెద్దలకు చెప్పారు. కానీ వారు అంగీకరించలేదు. అలా అని ఒకరినొకరు వదిలి పెట్టి ఉండలేరు. పెళ్లి చేసుకుందామనుకున్నారు. SI దగ్గరకు వెళ్లారు. దండం పెట్టి మా పెళ్లికి సహకరించండి సార్ అన్నారు. ఎస్సై హోదాలో సహాయం చేసి అండగా నిలవాల్సిందిగి పోయి తన వంకర అవినీతి బుద్ధిని ప్రదర్శించాడు. చివరకు సస్పెండ్ అయ్యారు.
కర్నూలు జిల్లాలో ప్రేమ జంటకు ఓ ఎస్సై నుండి ఎదురైన అనుభవం ఇది. అండగా ఉండాల్సిన పోలీసు అధికారి ట్రాక్ తప్పి, నాకు ఎంత లంచం ఇస్తారని ముఖం మీదే అడిగేశాడు. భయం భయంగా పెళ్లి చేసుకుందామనుకుంటున్న ఆ జంట(love marriage)కు తోడుగా ఉంటాడేమోనని ఎస్సైని అడిగితే వారికి ఎదురైన చేదు అనుభవంను ఆ జంట ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి గోడు వెళ్లపోసుకున్నారు.
ప్రేమ పెళ్లికి సహకరించాలని కోరిన జంట నుండి రూ.50 వేల లంచం డిమాండ్ చేసిన ఎస్సై సమీర్‌భాషపై ఎట్టకేలకు వేటు పండింది. రూ.10,000 లంచం తీసుకున్నట్టు, మిగతా డబ్బు కోసం డిమాండ్ చేసినట్టు ఆధారాలతో సహా రుజువు కావడంతో సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు జిల్లా తుగ్గలి ఎస్సై సమీర్ భాషను సస్పెండ్ చేస్తూ SP Siddhartha Kaushal ఆదేశాలు జారీ చేశారు. కర్నూలు జిల్లా మద్దికేరకు చెందిన క్రాంతి కుమార్, ప్రీతి ప్రేమించుకున్నారు. పెళ్లి (love marriage) చేసుకోవాలనుకున్నారు. పెద్దలు అంగీకరించక పోవడంతో ఎస్సై సమీర్ భాషను ఆశ్రయించారు.
తనకు 50 వేల లంచం ఇస్తే ఇబ్బందులు లేకుండా చూసుకుంటానని హామీ ఇచ్చాడు.సరే ఇస్తామని చెప్పారు జంట(love marriage). ఇందుకు రాజు అనే వ్యక్తిని మధ్యవర్తిగా పెట్టకున్నాడు ఎస్సై. మొదట రాజు పదివేల రూపాయలు ఎస్సై చెప్పిన నెంబర్కు ఫోన్ పే చేశాడు. మిగిలిన డబ్బులు ఇప్పిస్తావా లేదా అంటూ ఒత్తిడి చేయడంతో ఎస్పీని ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ఎస్పీ సిద్ధార్థ కౌశిల్ చివరకు ఎస్సైను సస్పెండ్ చేశారు.