love affair: A girlfriend who resisted boyfriend seduction | ప్రియుడు శోభనాన్ని అడ్డుకున్న ప్రియురాలు
love affair: A girlfriend who resisted boyfriend seduction | ప్రియుడు శోభనాన్ని అడ్డుకున్న ప్రియురాలు చిత్తూరు : ప్రియుడు మోసం చేసి వేరే పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లగా ప్రియురాలు వెళ్లి శోభనాన్ని అడ్డుకుంది. పెద్ద పంజాణి పోలీసు స్టేషన్లో ప్రియుడు మోసం చేశాడని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యింది. వివరాల్లోకి వెళితే.. పెద్దపంజాణి మండలం కెళవాతి గ్రామానికి చెందిన శ్రావణి (21), గంగవరం మండలం మిట్టమీద కురప్పల్లి గ్రామానికి చెందిన గణేష్ (23) గత ఆరు సంవత్సరాలుగా పలమనేరు ఓ ప్రైవేటు కాలేజ్లో చదువుకుంటు ప్రేమించు కున్నామని రెండు సంవత్సరాల క్రితం బెంగుళూరులో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో చేరి జాబ్ చేస్తున్నానని యువతి తెలిపింది. 11 నెలల క్రితం గణేష్ బెంగుళూరులో శ్రావణి పనిచేసే కంపెనీలో ఉద్యోగానికి చేరాడు. వీరిద్దరు మరింత దగ్గరయ్యారు. మూడు నెలలుగా సహజీవనం చేశారు.
అయితే మూడు నెలలుగా లాక్డౌన్ సమయంలో గణేష్ సొంత గ్రామానికి చేరుకున్నాడు. గణేష్ బుధవారం గంగవరం మండలం కలగటురు గ్రామానికి చెందిన బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న శ్రావణి గురువారం రాత్రి పెద్దపంజాణి మండలంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై గణేష్ పై ఐపిసి సెక్షన్ 417, 420 కేసులు నమోదు చేశారు. శ్రావణి అదే రోజు రాత్రి కలగటూరు గ్రామానికి వెళ్లి గణేష్ శోభనాన్ని అడ్డకుంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి పోలీసులు శ్రావణికి నచ్చజెప్పి పంపివేశారు. శుక్రవారం ఉదయం పోలీస్స్టేషన్ కు శ్రావణి వెళ్లి తనకు న్యాయం చేయాలని వేడుకున్నది.
ఎస్ఐ మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ గురువారం రాత్రి శ్రావణి అనే అమ్మాయి ప్రియుడు మోసం చేసి అతని బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ఫిర్యాదు చేసిందని కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
