Body Fitness : పరగడుపున Exercise చేస్తే లాభమా? నష్టమా?
Exercise : ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం, ధృడత్వానికి ధృడత్వం.. ఇవన్నీ ఒకే చోట ఎక్కడైనా దొరికితే అది పక్కా ఎక్సర్సైజేనని ఫిట్నెస్ ట్రైనర్లు సూచిస్తున్నారు. కానీ ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి? తిన్నాక చేయాలా? తినకముందు చేయాలా? అన్నదానిపై చాలా మందికి అవగాహన తక్కువ. ఎడాపెడా ఎక్సర్సైజ్ (Exercise)లు చేస్తుంటారే తప్ప దాంట్లో ప్రామాణికత ఉండదు. ఒళ్లు తగ్గించుకోవాలని ఎక్సర్సైజ్ చేస్తే సరైన మెలుకువలు తెలియక ఓవర్ వెయిట్(అధిక బరువు) సమస్య వచ్చిపడుతుంది. కాబట్టి సరైన మెలకువలు పాటించాలి. కనీసం కాఫీ అయినా తాగనిదే మనోళ్లకు ఎక్సర్సైజ్(Exercise) చేసే అలవాటు లేదు. ఇలా చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. పైగా ఇలా ఇష్టమొచ్చినట్టు ఎక్సర్సైజ్లు చేసుకుంటూ పోతే బరువు అధికమయ్యే ప్రమాదం ఉంది.

కాబట్టి బ్రేక్ఫాస్ట్ ముగించుకొని ఎక్సర్సైజ్ చేయడమనేది ఇప్పటినుంచి మరిచిపోండి. పరగడుపున ఎక్సర్సైజ్ చేయడం వల్ల బరువు ఈజీగా తగ్గుతారు. కేవలం బరువు తగ్గడం మాత్రమే కాదు నరాల పనితీరు మెరుగుప డుతుంది. ఇంకా బ్లడ్ సర్యులేషన్ కూడా సక్రమంగా జరుగుతుంది. మనసు ప్రశాంతత కలుగుతుంది. ఇన్సులిన్ నిరోధకతను కంట్రోల్ లో ఉంచుతుంది. పేరుకుపోయిన కొవ్వును తగ్గించేస్తుంది. కాబట్టి పరగడపున మాత్రమే ఎక్సర్సైజ్ బెటర్ అని గుర్తుంచుకోవాలి. కాకపోతే నీరసంగా ఉన్నప్పుడు మాత్రం ఏమీ తినకుండా ఎక్సర్సైజ్ చేయడం అంత మంచిది కాదు.
12 గంటల వ్యాయామంతో 10 వ్యాధులు దూరం!

వ్యాయామంతో ఆరోగ్యం పదిలమని వింటూనే ఉన్నాం. ముఖ్యంగా పక్షవాతం, గుండెపోటు, మధుమేహం, రొమ్ము, పేగు క్యాన్సర్ల ముప్పును కసరత్తులతో కట్టడి చేయవచ్చని గతంలో చాలా పరిశోధనలు తేల్చా యి. తదనుగుణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాయామ ప్రమాణాలను కూడా రూపొందించింది. ఆ ప్రకారం ప్రతి ఒక్కరూ నడక, తోటపని వంటి తేలికపాటి వ్యాయామాలైతే వారినికి 150 నిమిషాలు, పరుగు, సైకిల్ తొక్కడం వంటి కసరత్తులైతే 70 నిమిషాలు చేయాలి. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది దీనినే పాటిస్తున్నారట. కానీ, ఈ నిడివి సరిపోదని వాషింగ్టన్ పరిశోధకులు వెల్లడించారు. భారత్ సహా చైనా, దక్షిణాభ్రికా, అమెరికాల్లో చేపట్టిన 200 అధ్యాయనాలను విశ్లేషించి మరీ ఈ నిర్ణయానికి వచ్చారు.

1990 నాటి పనికి సమానమైన జీవక్రియ (మెట్) సూచీని ఆధారం చేసుకుని రకరకాల పనులకు అవసరమయ్యే శక్తిని, వ్యాయామ నిడివిని పెంచారు. ఆ ప్రకారం దీర్ఘకాలిక రుగ్మతలు దరిచేరకుండా ఉండాలంటే తేలికపాటి వ్యాయా మాలు వారానికి కనీసం 12.30 గంటలు, కష్టతర వ్యాయామాలైతే 6.15 గంటలు చేయాలని సూచిస్తున్నారు. ఈ తాజా పరిశోధనను అంతర్జాతీయ వ్యాధినిరోధక పరిశోధన సంస్థ ఆచార్యుడు ఫిలిపె అటిర్ విశ్లేషిస్తూ ”రుగ్మతలపై వ్యాయామ నిడివి ప్రభావం గురించి ఇప్పుడో అవగాహన వచ్చింది. కానీ ఆరోగ్య ప్రయోజనాల కోసం కష్టతర కసరత్తులు చేయాలా? లేక తేలికపాటి వ్యాయామాలు మంచిదా అన్నదానిపై స్పష్టత రాలేదు.” అని వ్యాఖ్యానించారు.

వ్యాయామం సమయంలో చెమట సమస్య!
- వ్యాయామానికి ముందు తలకు లైవ్ ఆన్ సీరమ్(livon serum) రాసుకోండి. ఇది చెమట నుంచి శిరోజాలకు రక్షణగా నిలుస్తుంది. వ్యాయామం అయ్యాక మామూలుగా కడిగేసుకుంటే సరిపోతుంది.
- తలకు సంబంధించిన ప్యాక్ ఏదైనా సరే, వ్యాయామం చేసే ముందు వేసుకుని తలను ముడిలా చుట్టేసుకోండి. వ్యాయామం పూర్తయ్యాక చల్లటి నీళ్లతో కడిగేయాలి. పెరుగూ, టీ డికాక్షన్, గుడ్డు తెల్లసొనా… ఇలా దేన్నయినా వాడొచ్చు.
- చాలా మంది జట్టు గట్టిగా ముడివేసుకునే వర్కవుట్లు చేయడానికి ప్రయత్నిస్తుంటారు ఇది పొరపాటు. ఇందువల్ల చెమట ఎక్కువుగా పట్టడమే కాదు, జుట్టు చిట్లిపోతుంది కూడా. కాబట్టి కాస్త వదులుగా జడ వేసుకోవాలి. మీది పోనీటెయిల్ అయితే, తలకు హెయిర్ బ్యాండ్ పెట్టుకున్నా సరిపోతుంది.
- చెమట పడుతోంది కదాని.. రోజూ షాంపూతో తలస్నానం చేయాలని చూడకండి. దాని వల్ల జుట్టు పొడి బారుతుంది. రోజు మార్చి రోజు తలస్నానం చేయాలి. ఒక వేళ మరీ తప్పదనిపిస్తే కొద్దిగా డ్రై షాంపూ తీసు కుని కుదుళ్లకు పట్టించి తర్వాత కడిగేసుకుంటే చాలు. చెమట సమస్య వదలడమే కాదు.. తల్లో మురికి ఉన్నా పోతుంది.
- ఆరుబయట వ్యాయామం చేస్తున్నప్పుడు ఎండ ప్రభావం జుట్టుపై పడుతుంది. పొడిబారడం, జుట్టు చివర్లో చిట్లడం లాంటి సమస్యలు ఎదురుకావచ్చు. అందుకే ఎస్పీఎఫ్(SPF) ఉన్న ఉత్పత్తి ఏదైనా తలకు రాసుకోవడం మంచిది.
- world facts: తాబేలు నెత్తిన పడి గ్రీకు నాటక రచయిత మృతి ఇలాంటి ప్రపంచ వింతలు తెలుసుకోండి!
- Castor Oil for hair: జుట్టుకు ఆమదం నూనె అబ్బే అనేవారి కోసమే ఇది!
- Urinary Infections: మూత్రంలో మంట, ఇతర సమస్యలు సులవైన చిట్కాలివే!
- Husband abaddalu: మగవారు ఎక్కువుగా ఆడవారితో చెప్పే 7 అబద్ధాలు ఇవేనట?
- man beauty tips: పురుషులు అందంగా కనిపించాలంటే ఏఏ చిట్కాలు పాటించాలి?