losing belly fat పొట్ట దగ్గర కొవ్వు పేరుకుంటే అందానికే కాదు ఆరోగ్యానికి ఇబ్బందే కదా! ఇది హార్మోన్ల(harmons)నూ ప్రభావితం చేస్తోంది. అంతేకాదండోయ్ దీని వల్ల గుండె జబ్బులూ, మధుమేహం, క్యాన్సర్, అధిక రక్తపోటు వచ్చే ప్రమాదాలూ లేకపోలేదంట. ఈ విషయాలు డాక్టర్లే చెబుతున్నారు. అందుకే ఈ కొవ్వును తగ్గించేందుకు ప్రత్యేక శ్రధ్ద పెట్టాలి మరి. ఆహార పదార్థాల ఎంపికలో జాగ్రత్త వహించాలి. ఒక రోజులో మనం తినే ఆహారం నుంచి 10 గ్రాముల ఆహార సంబంధిత పీచు అందేట్లు చూసుకుంటే అంతర్గత కొవ్వు(losing belly fat)ను అదుపులో ఉంచుకోవచ్చు.


ఇందుకోసం బీన్స్(beans), పప్పు ధాన్యాలూ, పండ్లూ, కాయగూరలూ, ఓట్స్, పొట్టు తీయని తృణధాన్యాలు ఎక్కువుగా తీసుకోవాలి. వీటితో పాటూ 8 గ్లాసుల నీటిని తాగితే పీచు పదార్థాల కారణంగా ఏర్పడే గ్యాస్ వంటి ఇబ్బందులు ఎదురు కావు. ప్రొటీన్ అంటే మాంసకృత్తుల మోతాదు తగినంతగా ఉండేట్టు చూసుకోవాలి. రోజులో కనీసం వంద కెలోరీల పోషకాలు ప్రోటీన్ల నుంచి అందేట్లు జాగ్రత్త పడాలంట. ఇవి నిధానంగా జీర్ణమై ఆకలిని అదుపులో ఉంచి కొవ్వు పేరుకోకుండా చూస్తాయి. ఇందుకోసం మీగడ తీసేసిన పెరుగూ పాలూ, చేపలూ, గుడ్లూ తింటే మెరుగైన మాంసకృత్తులు అందుతాయి.
యాపిల్, పుచ్ఛకాయ, దోసకాయ, ముల్లంగి, టొమాటో, క్యాబేజీ, చిలగడదుంపల్లోనూ పీచు ఎక్కువుగా ఉంటుంది. కొవ్వు తక్కువుగా ఉండి, యాంటీ ఆక్సిడెంట్లు(antioxidants) ఎక్కువుగా ఉంటాయి. వీటిని తినడం వల్ల పొట్ట దగ్గర కొవ్వు తగ్గుతంది. ఓట్స్‌తో చేసిన పదార్థాలు కూడా పొట్ట దగ్గర కొవ్వును తగ్గిస్తాయి.
ఇవి కూడా కరిగాస్తాయి
దాల్చిన చెక్క: జీవక్రియల రేటును మెరుగుపర్చడంలో దాల్చిన చెక్క కీలక పాత్ర పోషిస్తుంది. దీన్నితరచూ తీసుకోవడం వల్ల ఇందులో లభించే పోషకాలు శరీరంలోని కొవ్వును కరిగించడానికి దోహదం చేస్తాయి. జీర్ణ వ్యవస్థకు కూడా ఇది మేలు చేస్తుంది.
పచ్చిమిర్చి: పచ్చి మిర్చిలోని పోషకాలు హాని చేసే కొవ్వును కరిగిస్తాయి. డైటింగ్ చేసే వారు కూరల్లో కారానికి బదులుగా పచ్చిమిర్చిన వాడితే మంచిది.


కరివేపాకు: దీన్లోని పోషకాలు శరీరంలోని వ్యర్థాలను దూరం చేస్తాయి. చెడు కొవ్వును కరిగించేస్తాయి. ఊబకాయంతో బాధపడేవారు రోజుకు పది ఆకులను నీళ్లలో కలిపి తీసుకోవాలి. లేదంటే ఉదయాన్నే నమిలితే చాలా త్వరగా ఫలితం ఉంటుంది.
వెల్లుల్లి: యాంటీ బ్యాక్టీరియల్, సల్ఫర్ గుణాలు అధికం. ఇవి కొవ్వు శాతాన్ని తగ్గిస్తాయి.
తేనె: శరీరానికి తక్షణ శక్తినివ్వడమే కాదు బరువు తగ్గడానికీ ఉపయోగపడుతుంది. అదనపు కొవ్వును కరిగిస్తుంది. గ్లాసు గోరు వెచ్చటి నీళ్లలో చెంచా తీనె వేసి తీసుకుంటే ఫలితం ఉంటుంది.
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!
- Migraine: భరించలేని మైగ్రేన్ తలనొప్పి వస్తుందా?
- Amavasya: అమావాస్య రోజున ఏమి జరుగుతుంది?
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?