lorry owner association | దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో Minority సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రవాణా శాఖ మంత్రి Puvvada అజయ్ కుమార్ అన్నారు. ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన ప్రభుత్వం మైనార్టీల అభ్యున్నతికి కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం khammam నగరంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ (lorry owner association)ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన Iftar విందు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
ఇఫ్తార్ వింద్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే!
ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ CM కేసీఆర్ రాష్ట్రంలోని ముస్లీంలను గౌరవంగా నిలబెట్టారన్నారు. దేశంలో ఇఫ్తార్ విందు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనన్నారు. అందరి సహకారంతో ఖమ్మంను అభివృద్ధి చేసుకున్నామన్నారు. అభివృద్ధి విషయంలో వేలెత్తి చూపే వారే లేరని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఖమ్మం అభివృద్ధి బాగుందని కొనియాడతున్నారన్నారు. పట్టణాన్ని Allah దయవల్ల సీఎం కేసీఆర్ సహకారంతో మరింత అభివృద్ది చేసుకుందామని చెప్పారు. ముస్లీం ఆడపిల్లలకు సీఎం కేసీఆర్ అండగా నిలిచేలా shaadi ముబారక్ పేరిట ఆర్థిక సహాయం అందిస్తున్నారని, దేశంలో ఎక్కడా ఇలాంటి పథకం లేదని తెలిపారు.
విద్య కోసం పెద్దపీట వేశారని, మైనార్టీ పాఠశాలలను ఏర్పాటు చేసి వారి చదువుకు భరోసా అందిస్తున్నారని తెలిపారు. దేశంలో మైనార్టీ పాఠశాలలు ఏర్పాటు చేసి వారి అభ్యున్నతి కోసం పాటు పడుతూ Telangana రాష్ట్ర మోడల్‌గా నిలిచిందని ఇటీవలే ఓ నివేదిక కూడా తెలిపినట్టు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.