ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

lorry accident: అర్ధ‌రాత్రి 200 అడుగుల లోయ‌లో ప‌డ్డ లారీ

lorry accident

lorry accident చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి మండ‌లం, భాకార‌పేట ఘాటు రోడ్డులో నిన్న రాత్రి ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఏపీ29యు1377 లారీ ప‌లువ రాయితో రాయ‌చోటి ఉండి గూడూరు ప్ర‌యాణిస్తుండ‌గా అదుపుత‌ప్పి సుమారు 200 అడుగుల లోయ‌(lorry accident)లో ప‌డింది.

తిరుప‌తి పోలీస్ క‌మాండ్ కంట్రోల్ నుండి స‌మాచారాన్ని అందుకున్న ర‌క్ష‌క్ 6 సిబ్బంది హుటాహుటిన సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్నారు. వెంట‌నే స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. పోలీసులు, స్థానికుల స‌హాయంతో క్రింద‌కి దిగి చూడ‌గా క్యాబిన్ పైన మొత్తం రాళ్లు ప‌డిపోయి ఘోర‌మైన స్థితిలో సంఘ‌ట‌న స్థ‌లం క‌నిపించింది.

సంఘ‌ట‌నా స్థ‌లంలోనే డ్రైవ‌ర్ మీతి చెందిన‌ట్టు గుర్తించారు. రాత్రి నుండి చంద్ర‌గిరి పోలీస్ స్టేష‌న్ ఎస్సై విజ‌య‌కుమార్ నాయ‌క్ సిబ్బందితో పాటు రెస్క్యూ పోలీసుల బృందం మ‌రియు ఫైర్ సిబ్బంది క‌లిసి స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగించారు. చివ‌ర‌కు అతిక‌ష్టం మీద డ్రైవ‌ర్ మృత‌దేహాన్ని బ‌య‌ట‌కు తీసి రుయా ఆస్ప‌త్రి మార్చురీకి త‌ర‌లించారు.

See also  Remdesivir Injection : గ‌రిక‌పాడు చెక్‌పోస్టు వ‌ద్ద రెమిడిసివిర్ ఇంజ‌క్ష‌న్లు ప‌ట్టివేత‌

Comment here