lord shiva abhishekam:శివునికి ఏ అభిషేకం చేస్తే ఫ‌లితాలుంటాయి?

lord shiva abhishekam: శివున్ని ఆరాధించే భ‌క్తులు చాలా భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో ఆరాదిస్తుంటారు. ప్ర‌తిరోజూ శివుడిని త‌లుచుకోకుండా ఏ ప‌నీ చేయ‌రు. నిత్య పూజ‌లో శివుడిని త‌పిస్తుంటారు. అయితే మ‌రి శివునికి ఏ అభిషేకం చేస్తే మంచి ఫ‌లితాలుంటాయి. దీని గురించి కింద తెలుసుకుందాం?

lord shiva abhishekam: శివునికి అభిషేకం

గ‌రిక నీటితో శివాభిషేక‌ము చేసిన న‌ష్ట‌మైన ద్ర‌వ్య‌ము తిరిగి పొంద‌గ‌ల‌రు. నువ్వుల నూనెతో అభిషేకించిన అప‌మృత్యువు న‌శించ‌గ‌ల‌దు. ఆవు పాలు(cow’s Milk) అభిషేకం స‌ర్వ సౌఖ్య‌ముల‌ను ప్ర‌సాదిస్తుంది. పెరుగుతో అభిషేకించిన బ‌ల‌ము, ఆరోగ్య‌ము, య‌శ‌స్సు ల‌భిస్తాయి. ఆవు నెయ్యితో అభిషేకించిన ఐశ్వ‌ర్య ప్రాప్తి క‌లుగుతుంది. చెర‌కు ర‌స‌ముతో అభిషేకించిన ధ‌న వృద్ధి క‌లుగుతుంది. మెత్త‌ని చెక్క‌ర‌తో అభిషేకించిన దుఃఖ నాశ‌న‌ము క‌లుగుతుంది.

మారేడు బిల్వ‌ద‌ళ జ‌ల‌ము చేత అభిషేక‌ము చేసిన భోగ‌భాగ్య‌ములు ల‌భిస్తాయి. తేనెతో అభిషేకించిన తేజోవృద్ధి క‌లుగుతుంది. పుష్పోద‌క‌ము చేత అభిషేకించిన భూలాభ‌ము క‌లుగుతుంది. కొబ్బ‌రి (Coconut) నీటితో అభిషేకం స‌క‌ల సంప‌ద‌ల‌ను క‌లిగిస్తుంది. రుద్రాక్ష జ‌లాభిషేకం స‌క‌ల ఐశ్య‌ర్య‌ములునిస్తుంది. భ‌స్మాభిషేకంచే మ‌హాపాపాలు న‌శిస్తాయి. గందోద‌క‌ము చేత అభిషేకించిన స‌త్పుత్ర ప్రాప్తి క‌లుగుతుంది. బంగార‌పు నీటితో అభిషేకం వ‌ల్ల ఘోర దారిద్ర‌ము న‌శిస్తుంది.

నీటితో అభిషేకించిన న‌ష్ట‌మైన‌వి తిరిగి ల‌భిస్తాయి. అన్నంతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షం, దీర్ఘాయ‌వు ల‌భిస్తాయి. శివ‌పూజ‌ (lord shiva abhishekam)లో అన్న లింగార్చ‌న‌కు ప్ర‌త్యేక ప్రాధాన్య‌త క‌ల‌దు. పెరుగు క‌లిపిన అన్నంతో శివ లింగానికి మొత్తంగా అద్ది పూజ చేస్తారు. ఆ అద్దిన అన్నాన్ని అర్చ‌నానంత‌రం ప్ర‌సాదంగా పంచి పెట్ట‌డ‌తారు. ద్రాక్షా ర‌స‌ముచే అభిషేక మొన‌ర్చిన ప్ర‌తి దానిలో విజ‌యం ల‌భిస్తాయి.

మ‌హా శివుడు

ఖ‌ర్జూర ర‌సంతో అభిషేకం శ‌త్రుహానిని హ‌రింప జేస్తుంది. నేరేడు పండ్ల ర‌సంతో అభిషే కించిన వైరాగ్య సిద్ధి ల‌భించును. క‌స్తూరి క‌లిపిన నీటిచే అభిషేకించిన చక్ర‌వ‌ర్తివ్త‌ము ల‌భిస్తుంది. న‌వ‌ర‌త్నోద‌క‌ము చే అభిషేక‌ము ధాన్య‌ము,గృహ‌, గోవృద్ధిని క‌లుగును. మామిడి పండ్ల రసం చేత అభిషేకం చేసిన దీర్ఘ వ్యాధులు న‌శించిను. ప‌సుపు నీటితో అభిషేకించిన మంగ‌ళ ప్ర‌ద‌ము అగును. శుభ కార్య‌ములు జ‌రుగ క‌ల‌వు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *