lord krishna stories: భయంకరమైన కొండ చిలువగా మారి తనను సంహరించేందుకు వచ్చిన కంసభృత్యుడు అఘాసురుణ్ణి తుదముట్టించాక కృష్ణుడు తన సహవాస గాళ్లందర్నీ తీసుకుని యమునా తీరానికి వ్యాహ్యాళికి వెళ్లాడు. గోప బాలురందరూ ఆవులను పచ్చికలను తోలి కృష్ణయ్యతో ముచ్చట్టు పెట్టుకున్నారు. కాసేపటికి అందరికీ ఆకలైంది. అన్నం మూటలు విప్పారు. ఊరగాయ వాసనలు గుప్పుమన్నాయి.
ఒకరి మూట మీదకు మరొకరు ఎగబడ్డారు. చద్దన్నం, ఆవకాయ కలగలిసిన రాసులు క్షణాల్లో తరిగిపోయాయి. ఆ తరువాత గోంగూర, మీగడ పెరుగు మేళవించిన చద్దిముద్దల కోసం పోటీపడి ఒకరి చేతిలో ముద్దను ఇంకొకరు ఎగరేసుకు పోయారు. కృష్ణుడు కావాల్సినంత సందడి చేశాడు. తను భోక్త అయి కూడా మిగిలిన పిల్లల్లాగ ఆయన కూడా చద్దన్నం ముద్దలు ఆనందంగా ఆరగించాడు. పై నుండి చూస్తున్న దేవతలకిదంతా ఆశ్చర్యంగా వుంది.
lord krishna stories: ఆవుదూడల్ని మాయం చేసిన బ్రహ్మ!
గోప బాలురు ఆట పాటల్లో ఉన్న సమయాల్లో ఆవులు పచ్చిక మేసేందుకు దూరంగా వెళ్లాయి. అది తెలీక గోపబాలురు వాటికోసం ఆందోళన చెందారు. భయపడాల్సిన పనిలేదని కృష్ణయ్య వారికి నచ్చ చెప్పి ఆవుల మంద వున్న వైపుకి వెళ్లాడు. సరిగ్గా ఆ సమయంలో బ్రహ్మదేవునికో కోరిక కలిగింది. కృష్ణయ్య లీలలు గురించి తను వింటున్నాడు. చూస్తున్నాడు. కృష్ణయ్య చేసేవన్నీ అద్భుతాలే. అటువంటి అద్భుతాలు మరికొన్ని చూస్తే బాగుండననిపించిందాయనకు.
వెంటనే దూరంగా వనాంతరాల్లో పచ్చిక మేస్తున్న ఆవుల్నీ ఆవుదూడల్నీ మాయం చేశాడు. అది తెలియని కృష్ణయ్య వాటికోసం చాలా సేపు వెతికాడు. కానీ ఎంతకీ అవి కనిపించడం లేదు. తిరిగి స్నేహితులుండే చోటికి వెళ్లాడు. అక్కడ వాళ్లు కూడా లేరు. కృష్ణయ్య అప్పుడు దీర్ఘంగా ఆలోచన చేశాడు. ఆయన కర్మధర్మ చక్రవర్తి, భూత, భవిష్యత్ వర్తమానాలు తెలిసినవాడు కాబట్టి జరిగిందేమిటో క్షణాల్లో పసిగట్టాడు.
అదంతా బ్రహ్మదేవుని మాయని తెలుసుకున్నాడు. మాయలు చేయడం ఆయనకు తెలీకపోతేగా! వెంటనే ఆయన ఒక మాయ చేశాడు. ఆవులూ, ఆవుదూడలూ ఎన్ని ఉన్నాయో వాటన్నింటి ఆకారాలూ ఆయనే ధరించి గోకులం చేరాడు. ఎవరి గోవులను వారి దొడ్లలో వదిలి పెట్టాడు. అలాగే గోప బాలురెందున్నారో (gopa balurulu) వాళ్లందరినీ వాళ్ల ఇళ్లకు చేర్చాడు. తనూ ఇంటికి చేరాడు.
lord krishna stories: అదేమిటో చిత్రం ఎప్పుడూ లేనంతగా ఆ రోజు గోకులంలోని వారందరికీ తమ బిడ్డలూ, ఆవులూ, దూడలూ అన్నీ తెగ ముద్దొచ్చాయి. వాత్సల్యంతో అన్నిటినీ దగ్గరకు తీసుకున్నారు. గోవుల్లోనూ, గోవత్సల్లోనూ గోప బాలురలోనూ కృష్ణయ్య దాగి వుండటం మూలంగా గానే తమకంత అపూర్వ ఆనందం కలుగుతోందన్న సంగతి వాళ్లకు తెలీదు. ఇది ఏడాది కాలం గడిచింది. మనకు ఏడాది కాలం అంటే అది బ్రహ్మ దృష్టిలో తృటి మాత్రం.
ఆ తృటికాలం గడిచిపోగానే బ్రహ్మకు మళ్లీ ఆ వనంలో krishnudu అతని మిత్రులు, గోవులు, లేగదూడలూ అన్నీ కనిపించాయి. ఆశ్చర్యపోయాడు. మాయా గృహంలో వీళ్ళందర్నీ తను దాచిపెడితే మళ్లీ ఎలా బయటకు వచ్చారు? ప‌్రాణాల్ని సృష్టించే శక్తి తనకు తప్ప మరెవరికీ లేదే. వీళ్లందర్నీ ఎవరు సృష్టించారు? కలా? భ‌్రమా?. కృష్ణుడ్ని తను మాయ చేయాలనుకుంటే కృష్ణుడే తనను మాయం చేశాడు.
విర్రవీగినందుకు మన్నించమన్నాడు
కళ్లు విప్పార్చుకుని కృష్ణుడి వంక గోవుల వంక గోపబాలుర వంక చూశాడు. అన్నీ ఒకే విధంగా కృష్ణరూపాలు ఉన్నాయి. అందరూ నీలిమేఘచ్ఛాయలో ఉన్నారు. ఆనంద పరవశులై ఉన్నారు. అదంతా చూస్తున్న బ్రహ్మకు కన్నుల పండువగా వుంది. అప్రయత్నంగా చేతులు జోడించాడు. సృష్టించే శక్తి తనకు తప్ప మరెవరికీ వుండదన్న అహంకారంతో విర్రవీగినందుకు మన్నించమని వేడుకున్నాడు.


దీంతో కృష్ణుడు తన మాయను తొలగించాడు. తన లీలా రూపాలన్నింటినీ ఉపసంహరించాడు. brahma కృష్ణుడి పాదాల మీద సాగిలపడి జగతృతీ నేను అల్పుడ్ని. నీ మహిమ తెలుసుకోలేక అహంకారంతో ప్రవర్తించాను. నువ్వే సకల భూతాలకు సాక్షివి. సకల ప్రాణాలకు రక్షవీ అని తెలీక గర్వం కళ్ళకు కప్పటం వలన నిన్నేదో మాయ చేద్ధామనుకున్నాను. నా తప్పు నాకు తెలిసింది.
నన్ను మన్నించు. నువ్వు యోగీశ్వరుడవు. నీ యోగ మాయతో నువ్వే రూపాన్నైనా ధరించగలవు. ఏ లీలనైనా ప్రదర్శించగలవు. నిన్ను తెలుసుకోలేనంత వరికే ఎవరికైనా అహంకారం. lord krishna stories తెలుసుకున్నాక మహదానందం అని వినయంగా అన్నాడు. కృష్ణుడు బ్రహ్మను మన్నించాడు.