Lord Brahma | ఈ సకల చరాచర సృష్టిని సృష్టించినవాడు బ్రహ్మదేవుడు మన తలరాతలను రాసే ధాత విధాత. జనన మరణాలు నిర్ణయించేవాడు అతనే. రాతసరిగా లేకపోతే బ్రహ్మరాతలా ఉండందాటు. అదే అతని అంతు చిక్కని అంతరంగం. ఏదైనా గుప్పెట్లో ఉన్నవంతవరకే రహస్యం. విప్పితే బట్టబయలు అవుతుంది. మనల్ని నడిపించే ఆ రహస్యమే భగవంతుడు. ఆ విధాత తలవనిదే ఏ కార్యం జరగదు. ఈ అనంతసృష్టికి మూలం ఆ దేవదేవుడు. ప్రమాదమైనా, ప్రమోదమైనా అతని వరప్రసాదమే. ఈ జగతికి కారణమైన ఆ Brahmaదేవునికి ఎక్కడా ఆలయం లేకపోవడం ఒక శాపం కారణమని పురాణాల కథనం.ఎక్కడో ఒకటి రెండు temples ఉన్నాయన్నది చరిత్ర కథనం.
మనమంతా ఒక్కటే!
బ్రహ్మ సృష్టి(Lord Brahma) గురించి చెప్పాలంటే గ్రహాల గమనాలు, నింగినేల నీరు నిప్పు గాలి లాంటి పంచభూతాలు, సప్తసముద్రాలు, సప్త ఖండాలు, నదులు, జలపాతాలు, అనంతకోటి జీవరాశులు, మనిషి మనుగడ ఎన్నని చెప్పగలం. అంతా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని సృష్టియే కదా? ఈ భూ ప్రపంచంలో భాషలు, భావాలు, ప్రాంతాలు, దేశాలు వేరైనా మనిషి జీవన గమనం అంతే ఒకటే కదా. జననం, మరణం, పగలు, రాత్రి, ఆకలి, బాధ, కోపం లాంటి నవసర భావాలన్నీ ఒకటే రంగా పలికిస్తారు. వాటికి భాషా ప్రాంత బేధాలు లేవు. అందుకే భగవంతుని దృష్టిలో మనమంతా ఒక్కటే. ఈ తారతమ్య బేధాలు అన్నీ మనిషి సృష్టించినవే. ‘ఏ దేశమేగినా, ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని‘ అన్నాడు ఓ మహాకవి.
ఎందుకంటే మన భారతావని ఎందరో మహాత్ములకు జన్మనిచ్చిన వేద, కర్మ, Punya Bhumi. ఈ అవనిలో పుట్టడమే మనం చేసుకున్న గొప్ప అదృష్టం. నాటి పురాణాల నుండి నేటి కలియుగం వరకు ఈ భారతావనిలో జరిగిన, జరుగుతున్న విశేషాలు ఎన్నో, ఎన్నెన్నో. Lord Krishna బోధించి గీతాసారం ఈ భూ ప్రపంచంలో మరెవరూ అందించలేని మహా దివ్యప్రబోధ సందేశం అని అంటుంటారు. పతంజలి, ఆర్యభట్టు, వరాహమిహిరుడు, వాత్సాయనుడు, Charakudu లాంటి మహాత్ములు అందించిన మహా గ్రంథాలు ఈ ప్రపంచానికే తలమానికాలు. వివేకానందుడు చెప్పిన ప్రబోధాలు యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించాయి.
సామాన్యుడు అసామాన్యడైన వేళ
ముఖ్యంగా యువతకు ఆయన చెప్పిన సందేశాలు, యువతను నడిపించే మార్గదర్శకాలు. ఇక ఓ Abdul Kalam గురించి చెప్పాలంటే ఓ సామాన్యుడిలా వచ్చి అసామాన్యుడిగా ఎదిగి దేశానికి ప్రథమ పౌరడ య్యాడంటే అతని కృషి, పట్టుదల, అంకుఠిత దీక్ష. ఎంతని చెప్పగలం. ప్రపంచ చరిత్రలో సదా చిరస్మరణీయుడు. అలాంటి మహామహులు ఈ భారతవనిలో కోకొల్లాలు. ఈ విశాల జగతిన భగవంతుడు సృష్టించిన వింతలు-విశేషాలు ఎన్నని చెప్పగలము. ఆసేతు హిమాలయాలు భగవంతుడు ఇచ్చిన గొప్ప వరాలు. మానస సరోవరం, Amarnath ఆలయం, వైష్ణోదేవి ఆలయము, కాంచనగంగ పర్వతము మహిమగల మహోన్నత దర్శనీయ పుణ్యస్థలాలు. వాటి దర్శనం, పూర్వ జన్మల పుణ్య ఫలం.


మునులు, ఋషులు, మహాత్ములు నడియాడే హిమాలయాలు ఎంతోమహిమగల మహోన్నత పుణ్యభూమి. కృష్ణ, గంగ, గోదావరి, యమున లాంటి జీవనదులు మనకు God ప్రసాదించిన గొప్పవరాలు. జీవ నదులు మనకు జీవజీవాలు. మనకు అన్నం పెట్టే అన్నపూర్ణలు. ఆ భగవంతుడు వెలిసిన కొన్నిదేవాలయాలు ఎవరికీ అంతుచిక్కని రహస్య శక్తి కేంద్రాలు. అటు ఉత్తరాన, ఇటు దక్షిణాణ ఎన్నో దర్శనీయ పుణ్య తీర్థాలు. వాటిని దర్శించుకుని ఆ దేవదేవుని(Lord Brahma) ముందు మన హృదయాంజలులు సమర్పించుకుందాము. అతని చల్లని ఒడిలో బిడ్డలుగా సేద తీరుదాము.