Lockdown : Hyderabad : తెలంగాణపై మరోసారి కరోనా పంజా విసురుతోంది. కరోనా మహమ్మారి భారిన పడిన వారి సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతోంది. గత 15 రోజుల నుంచి రోజుకు 300పైగా కరోనా కేసులు నమోదువుతున్నాయి. అందులో దాదాపు సగానికిపైగా కేసులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గురుకులాలలోనే నమోదు కావడం తల్లిదండ్రులను ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో లాక్డౌన్ విధిస్తారనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.


తెలంగాణలో పెరుగుతున్న కేసులు!
ఈ క్రమంలో రాత్రిపూట కర్ఫ్యూ పెట్టనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గాలంటే కర్ఫ్యూ విధించాల్సిందేనా అనే కోణంలో సీఎం కేసీఆర్ అధికారులతో చర్చిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ తెలంగాణలో లాక్డౌన్ రాబోతుందా? అనేది ప్రస్తుతం చర్చ నడుస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత వారం నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొన్ని నెలలు అనంతరం ఒక్కసారిగా కరోనా కేసులు పెరుగుతుండటంతో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే మహారాష్ట్రతో పాటు కొన్ని రాష్ట్రాల్లోన్ని కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ విధించడంతో పాటు నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఈ తరుణంలో తెలంగాణలో కూడా కేసులు పెరుగుతుండటంతో లాక్డౌన్, కర్ఫ్యూ విధిస్తారనే ప్రచారం జరుగుతోంది.
లాక్డౌన్ ఆలోచన లేదు!
కరోనా కేసులు పెరుగుతున్న దృష్ణ్యా తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు (మంగళవారం) కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉన్న విద్యార్థులను ఎలాంటి పరీక్షలు లేకుండా పై తరగతులకు ప్రమోట్ చేయాలని ఇప్పటికే ప్రభుత్వానికి ఆదేశాలు అందిన్నట్టు తెలుస్తోంది. మళ్లీ ఆన్లైన్ క్లాసులు చెప్పేందుకు అనుమతులు ఇవ్వనున్నట్టు సమాచారం.
అయితే తెలంగాణలో లాక్డౌన్ మళ్లీ వస్తుందా? అనే ఊహాంగనాలపై స్పందించిన తెలంగాణ హోంమంత్రి మహమ్మద్ అలీ ఇప్పటికే లాక్డౌన్ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిందని అన్నారు. అయితే తెలంగాణలో ప్రస్తుతం లాక్డౌన్ ఆలోచన లేదని తెలిపారు. తెలంగాణలోని విద్యాసంస్థల్లో కరోనా కేసులు ఎక్కువ అవుతుండటంతో దీనిపై రెండ్రోజుల్లో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుందని హహమ్మద్ అలీ తెలియజేశారు. ఇదే విషయంపై హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు స్పందిస్తూ తెలంగాణలో లాక్డౌన్ విధించే ఆలోచన లేదని తెలిపారు.


ఆంక్షలు పాటించాల్సిందే!
అయితే కరోనా కేసులు తగ్గించేందుకు లాక్డౌన్ కాకుండా కొన్ని ఆంక్షలను మాత్రం అమలు చేయనుందట. ముఖ్యంగా తెలంగాణలోని స్కూళ్లలో కరోనా కేసులు ఎక్కువ అవుతుండటంతో పిల్లల ద్వారా ఇంట్లో వారికి సోకే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతుంది. దీంతో కరోనా కేసులు తగ్గించాలంటే ప్రజలందరూ నిబంధనలు పాటించాలని అధికారులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, శానిటేజర్తో చేతులను శుభ్రం చేసుకోవాలని తెలిపారు. అర్హులందరూ టీకా వేయించుకోవాలని, వ్యాక్సినేషన్ ఎక్కువుగా జరిగితే కరోనా వైరస్ నియంత్రణలోకి వస్తుందని వెల్లడించారు.
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court