local body elections voting :Tirupathi : తిరుపతి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి తొలిదశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ను తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పల నాయుడు పరిశీలించారు. పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ను పోలీస్ వైర్ లెస్ సెట్స్ ద్వారా, మీడియా చానెల్స్ ద్వారా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలో ఇప్పటి వరకు ప్రశాంతమైన పోలింగ్ జరుగుతుందని అన్నారు. ఓటర్లు నిర్భయంగా, స్వేచ్ఛగా పవిత్ర ఓటు హక్కును వినియోగించుకోవచ్చని సూచించారు. ఎన్నికల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు పాటించిందన్నారు. షాడో పార్టీలు, స్ట్రైకింగ్ ఫోర్స్, రూట్ మొబైల్ టీమ్స్, ఫ్లైయింగ్ స్వ్కాడ్స్, వెబ్ కాస్టింగ్, వీడియో గ్రఫీ, డ్రోన్స్, బాడీ వోర్స్ కెమెరాలతో ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. పోలింగ్ లోకేషన్ పరిసరాలలో 144 సెక్షన్ తో పాటు 30 పోలీసు యాక్టులు అమల్లో ఉంటాయని ఎస్పీ వెంకట అప్పల నాయుడు తెలిపారు.
ఇది చదవండి:జగ్గయ్యపేటలో కొనసాగుతున్న పోలింగ్
ఇది చదవండి:అటవీ శాఖకు బాలుడు ఫిర్యాదు,రూ.67వేలు జరిమానా!
ఇది చదవండి:ఎన్నికల వేళ ఏపీలో భారీగా మద్యం స్వాధీనం!
ఇది చదవండి: మంత్రి పువ్వాడపైన నిప్పులు చెరిగిన భట్టి విక్రమార్క
ఇది చదవండి:పదేళ్లు నేనే సీఎంను! ఇది పక్కా!
ఇది చదవండి:మరో పవన్ కళ్యాణ్ లా వస్తున్న ఉప్పెన వైష్టవ్ తేజ్
ఇది చదవండి:కార్పొరేట్ సంస్థల సేవకుడు మోడీ!
ఇది చదవండి:ఇంక్యూబేషన్ సెంటర్లతో ఉద్యోగావకాశాలు: గవర్నర్
ఇది చదవండి:నిగ్గదీసి అడగటానికి నీకెందుకు భయం?