Life with Corona : కరోనా అందర్నీ పలకరించబోతోంది!
Life with Corona :నాగుపాము పూసం విడిచినట్టు కరోనా కూడా దశ, దిశ మార్చుకొని తన పగను ప్రజలపై మరోసారి విసిరినట్టుంది ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే. ఇప్పటికే ప్రపంచ దేశాలు కరోనా దెబ్బతో ఆర్థికంగా, జనాభా పరంగా తీవ్ర నష్టం ఎదుర్కొన్నాయి. తాజాగా భారతదేశంలో కరోనా విలయతాండవం చేస్తుండటం, జనాలు కుప్పలు కుప్పలుగా మరణించడం చూస్తుంటే మరింత ఆందోళన కలిగిస్తుంది. ఒక ప్రక్క వ్యాక్సిన్ వేసుకుంటున్నప్పటికీ మరో ప్రక్క కేసులు పెరుగుతుండటం ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఇక అసలు విషయానికి వద్ధాం.!
ప్రస్తుతం కరోనా అందర్నీ పలకరించబోతోందట. మళ్లీ ఒక సారి గుర్తుంచుకోండి కరోనా అందర్నీ పలకరించబోతుంది!. దానికి ఓ ఉదాహరణగా … అమెరికా దేశంలో ఓ ఖైదీకి మరణశిక్ష విధించినప్పుడు, కొంత మంది శాస్త్రవేత్తలు ఈ ఖైదీపై కొన్ని ప్రయోగాలు చేయాలని భావించారు. చివరిగా ఉరి తీయడానికి బదులుగా విషపూరిత కోబ్రా దాడి చేసి చంపబడతావని ఖైదీకి చెప్పారట.
అతని ముందు ఒక పెద్ద విషపూరిత పామును తీసుకు వచ్చారు అధికారులు. వారు ఖైదీ కళ్లును మూసివేసి కుర్చీకి కట్టివేశారు. అతన్ని మాత్రం పాముతో కరిపించలేదట. కానీ ఆ ఖైదీ పది సెకన్లలోనే ఉన్నట్టుండి మరణించాడట. అయితే ఖైదీ శరీరంలో పాము విషాన్ని పోలిన విషం ఉందని పోస్టు మార్టం ద్వారా వెల్లడైంది.
ఇప్పుడు ఈ విషం ఎక్కడ నుంచి వచ్చింది? అసలు ఖైదీ మరణానికి కారణమేమిటి? ఇది ప్రతిఒక్కరీ సందేహం! అయితే ఆ విషం మానసిక గాయం కారణంగా తన సొంత(ఖైదీ) శరీరం ద్వారా ఉత్పత్తి చేయబడింది.
ఆ కథ ఏమి తెలుపుతుందంటే?
మీరు తీసుకునే ప్రతి నిర్ణయం సానుకూల లేదా ప్రతికూల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మరియు తదనుగుణంగా మీ శరీరం హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. 90% అనారోగ్యాలకు మూల కారణం ప్రతి కూల ఆలోచనల ద్వారా ఉత్పన్నమయ్యే శక్తి.
ఈ రోజు మనిషి మీడియాలో వస్తున్న వార్తలతో తీవ్ర భయాందోళనలకు గురవుతూ, తనను తాను కాల్చుకుంటూ తనను తాను నాశనం చేసుకుంటున్నాడు. 5 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వయస్సు ఉన్న రోగులు పాజిటివ్ నుండి కరోనాకి ప్రతికూలంగా ఉన్నారు.
మీడియాలో వస్తున్న గణాంకాల జోలికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లవద్దు..ఆలోచించ వద్దు. ఎందుకంటే సగానికి పైగా ప్రజలు బాగానే ఉన్నారు. మరియు మరణాలు కరోనా వ్యాధి వల్ల మాత్రమే కాదు. వారికి ఉన్న ఇతర అనారోగ్యాల వల్ల కూడా కలుగుతున్నాయి. కాబట్టి వారు భరించలేరు.
కరోనా చేత ఇంట్లో చనిపోతున్న వారు చాలా అత్యల్పం అని గుర్తుంచుకోండి! రోగులందరూ ఎక్కువుగా ఆసుపత్రులలోనే మరణిస్తున్నారు. ఆసుపత్రిలో వాతావరణం, కోవిడ్ గురించి రోజూ వినే ప్రచారాలు మనస్సులో భయం ఉండటానికి కారణం.


ఎల్లప్పుడూ మీ ఆలోచనలను సానుకూలంగా ఉంచండి. కరోనా వైరస్ పట్ల అవగాహనను కలిగి ఉండండి. ఇది మనం వింటున్నంత భయంకరమైనది కాదని, ప్రాణాంతకమైన వ్యాధి అసలే కాదని గమనంలో ఉంచుకోండి.
గమనిక : ఈ సందేశం ప్రస్తుతం వాట్సాప్ గ్రూప్లో వైరల్ అవుతుంది. పైన చెప్పిన ఖైదీ కథ నిజమో కాదో మాకు తెలియదు కానీ..ఈ సందేశం రాసిన మేధావికి మాత్రం ధన్యావాదాలు! కాబట్టి కరోనా విషయంలో ఎవ్వరూ భయపడవద్దు. మాస్క్ ధరించండి. సామాజిక దూరం పాటించండి. కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకోండి!.
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court