Life Tension: ప‌నికిరాని ఆందోళ‌న వ‌ద్దే వ‌ద్దు!

Life Tension: ప్ర‌తిరోజూ ఆఫీసు నుంచి ఇంటికి సాయంత్రం 5 గంట‌ల‌కు వ‌చ్చే భ‌ర్త ఆ రోజు ఆరైనా రాలేదు. వెంట‌నే ల‌లిత భ‌ర్త మొబైల్ ఫోన్‌కి కాల్ చేసింది. అత‌ను ఫోన్ ఎత్త‌లేదు. దాంతో ఆమెలో విప‌రీత‌మైన ఆందోళ‌న పెరిగిపోయింది. Accident ఏమైనా అయ్యిందా అనే ఆలోచ‌న వ‌చ్చింది. ఆ ఆలోచ‌న రావ‌డం ఆల‌స్యం అదే ప‌నిగా లెక్క‌లేన‌ని సార్లు ఫోన్ చేసింది.

Life Tension: విప‌రీత‌మైన ఆలోచ‌న‌లొద్దు!

అస‌హ‌నంతో ఇంటి పని ముట్టుకోకుండా భ‌ర్త గురించి ఆందోళ‌న ప‌డుతూ కూర్చుంది. సాధార‌ణంగా కొంద‌రు ప్ర‌తి చిన్న విష‌యానికి ఆందోళ‌న ప‌డుతుంటారు. విప‌రీత‌మైన ఆలోచ‌న‌లు చేస్తుంటారు. కాని ప్రాక్టిక‌ల్‌గా ఆలోచించ‌డం మొద‌లు పెడితే వాళ్ల‌తో పాటు ఎదుటి వాళ్ల‌కి కూడా ప్ర‌శాంత‌త ఉంటుంద‌నే విష‌యం గుర్తెర‌గాలి. ఈ ఆందోళ‌న‌ను గుర్తించ‌డం, దాన్నుంచి బ‌య‌ట‌ప‌డ‌టం ఎలాగో చూద్దాం.

ఆందోళ‌న (Life Tension) ప‌డుతున్న వాళ్ల గుండె వేగంగా కొట్టుకుంటుంది. అది బ‌య‌ట‌కు వినిపిస్తుందా అనిపిస్తుంది. చెమ‌ట‌లు, ఊపిరాడ‌క‌పోవ‌డం, నోరు పొడిబార‌టం, శ‌రీరం వ‌ణుకు, చేతుల్లో వ‌ణుకు, ఛాతి ప‌ట్టేసిన‌ట్టు ఉండ‌టం, అర‌చేతులు చ‌ల్ల‌గా అయిపోవ‌డం వంటివి క‌నిపిస్తాయి. ల‌లిత త‌న చుట్టూ జ‌రిగే ప్ర‌తి చిన్న విష‌యానికి ఆందోళ‌న చెందుతుంటుంది. మొట్ట‌ మొద‌ట ఆమె త‌న ప్ర‌వ‌ర్త‌న ఇబ్బంది పెడుతున్న‌ట్టు ఉంద‌నేది గ్ర‌హించాలి. ఆందోళ‌న అనేది ఎంతో స‌హ‌జ‌మైన మాన‌వ భావోద్వేగం. రోజూ వ‌చ్చే టైంకి రాక‌పోతే ఇంట్లో వాళ్ల‌కి ఆందోళ‌న క‌ల‌గ‌డం స‌హ‌జ‌మే.

నెగిటివ్ ఆలోచ‌న మంచిది కాదు!

అలాగ‌ని దాని గురించే ప‌దే ప‌దే ఆలోచిస్తూ అదికూడా ఏదో జ‌రిగిపోయింద‌ని నెగిటివ్‌గా ఆలోచించ‌డం మంచిది కాదు. దాని గురించే ఆలోచించ‌డం, ఏడ్వ‌డం, పెద్ద‌గా అర‌వ‌డం వంటివి అస‌హ‌జ‌మైన ప్ర‌వ‌ర‌త‌న కింద‌కి వ‌స్తాయి. ఇంటికి టైంకి రానంత మాత్రాన యాక్సిడెంట్ జ‌రిగింద‌ని అనుకోన‌క్క‌ర్లేదు. ఆఫీసులో అద‌న‌పు ప‌ని వ‌ల్ల రాలేక‌పోయి ఉండొచ్చు. మీటింగ్‌లో ఉండొచ్చు. ఫోన్ ప‌నిచేయ‌క‌పోవ‌చ్చు. ఆలోచిస్తే ఆందోళ‌న పెరుగుతుంది. అందుక‌ని దాని గురించే ఆలోచిస్తూ కూర్చోకుండా వేరే ప‌నుల్లో నిమిగ్న‌మ‌వ్వాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఆలోచ‌న‌ల తీవ్ర‌త త‌గ్గుతుంది.

ఒత్తిడి

Life Tension: శ్వాస సంబంధిత వ్యాయామాల‌ను ప్రాక్టీసు చేయాలి. ప్ర‌శాంత‌మైన ప్ర‌దేశాన్ని ఊహించుకుని అక్క‌డ మీరు ఉన్న‌ట్టు భావించాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. న‌చ్చిన సంగీతం వినాలి. శారీర‌క వ్యామాలు క్ర‌మం త‌ప్ప‌కుండా చేస్తుండాలి. ఆందోళ‌న చెంద‌డం వ‌ల్ల ప‌రిస్థితుల్లో మార్పు రాక‌పోగా, ప‌రిస్థితి దారుణంగా త‌యారువుతుంది. జీవితంలో జ‌ర‌గ‌బోయే వాటిని ముందుగానే ఊహించ లేం అనే విష‌యాన్ని గ్ర‌హించాలి. త‌న స‌మ‌స్య గురించి స‌న్నిహితుల‌తో ప్ర‌స్తావించాలి. ఆ ఒత్తిడికి గ‌ల కార‌ణాన్ని గుర్తించాలి. ఇవ్వ‌న్నీ చేసిన‌ప్ప‌టికీ ప‌రిస్థితి అదుపులో లేక‌పోతే మాన‌సిక వైద్య నిపుణుల్ని సంప్ర‌దించాలి.

Share link

Leave a Comment