life short story: జీవితంలో కొన్ని స్టోరీలు మనల్ని ప్రేరేపిస్తుంటాయి. మనల్ని మార్చేందుకు ప్రయత్నం చేస్తుంటాయి. మార్పు చాలా అవసరం. మార్పు వల్ల మనిషి ఆరోగ్యంగా, హాయిగా ఉంటాడు. ఇక్కడ తెలిపిన కొన్ని స్టోరీలు చదివితే మీకే అర్థం అవుతుంది. జీవితానికి ఉపయోగపడే ఈ స్టోరీలు life short story, మనల్ని ఆలోచింపజేస్తాయి.
life short story: నీ జీవితం నీ ఇష్టం!
నువ్వు చచ్చాక నిన్ను శవం అనే అంటారు. ఆ శవాన్ని ఇటు తీసుకురండి. ఆ శవాన్ని కింద పడుకోబెట్టండి అనే అంటారు. నువ్వు బతికినప్పుడు ఎవరి గురించి ఆలోచిస్తూ నీ సంతాషాలని, నీ ఆనందాలని దూరం చేసుకున్నావో అదే జనాలు, నువ్వు చచ్చిన మరు క్షణం నుంచే నిన్ను పేరుతో పిలవటం మర్చిపోతారు.

ఆ రోజు నువ్వో శవం. కాల్చినాక గంట కూడా నీ కోసం ఎవరూ ఉండరక్కడ. నిన్ను పూడ్చిన పది నిమిషాలు కూడా ఎవరూ నీ కోసం Wait చేయరు. అందుకే నువ్వు నీకోసం బతుకు. నీలా బతుకు. నీకిష్టమొచ్చినట్టు బతుకు. నిజమే చెప్పు. ఇష్టముంటే అవునను. లేదంటే కాదను. నీకేం చేయాలనిపిస్తే అదే చేయ్. నీ జీవితం నీ ఇష్టం. నీ లక్ష్యం , నీ ఆశయం, నీ జీవితం..అంతే!.
తండ్రి కళ్లు తెరిపించిన కొడుకు!
ఓ ధనికుడైన తండ్రి తన కుమారుడికి పేదవారు ఎలా ఉంటారో, ఎలా జీవిస్తారో చూపించడం కోసం ఓ గ్రామానికి తీసుకెళ్తాడు. ఆ గ్రామంలోని ఒక పేద కుటుంబంతో కొంత సమయం గడిపారు. తిరుగు ప్రయాణంలో తండ్రి తన కొడుకుని ఇలా అడిగాడు. చూశావు కదా! పేదవారు ఎలా ఉంటారో, ఎలా జీవిస్తారో! దీనిబట్టి నువ్వు ఏం నేర్చుకున్నావ్.
దానికి సమాధానంగా కొడుకు ఇలా అన్నాడు. మనకి ఒక కుక్క మాత్రమే ఉంది. వారికి నాలుగు కుక్కలు ఉన్నాయి. మనకి ఒక Swimming pool మాత్రమే ఉంది. వారికి నది ఉంది. మనకి చీకటి పడితే ట్యూబ్ లైట్లు ఉన్నాయి. వారికి నక్షత్రాలే ఉన్నాయి. మనం ఆహారాన్ని కొంటున్నాము. కాని వాళ్లు వారికి కావాల్సిన ఆహారాన్ని వాళ్లే పండించుకుంటున్నారు.

మనకి రక్షణగా గోడలు ఉన్నాయి. వారికి రక్షణగా స్నేహితులు ఉన్నారు. మనకు టీవీ, సెల్ఫోన్స్ ఉన్నాయి. కానీ వాళ్లు వారి కుటుంబంతో బంధువులతో ఆనందంగా గడుపుతున్నారు. మనము ఎలా పేదవాళ్లమో నాకు చూపించిందనందుకు చాలా thanks Dady.
నీకు విలువ ఉన్న చోటే ఉండు!
ఒక తండ్రి చనిపోయే ముందు కొడుకుని పిలిచి ఈ చేతి గడియారం watch, 200 సంవత్సరాల పూర్వం మీ ముత్తాత వాడినది. ఒకసారి నగల దుకాణం దగ్గరకు వెళ్లి అమ్మటానికి ప్రయత్నించు, ఎంత ఇస్తారో అడుగు అంటాడు. కొడుకు నగల దుకాణంకు వెళ్లి అడిగితే చాలా పాతది కాబట్టి రూ.150 ఇవ్వగలం అంటారు. అదే విషయం తండ్రికి చెప్తే ఒకసారి పాన్ షాప్ దగ్గర అడిగి చూడు అంటాడు.

పాన్ షాప్ దగ్గరికి వెళ్లి అడిగితే బాగా తుప్పు పట్టి ఉంది. 10 రూపాయలకి కొనగలను అని చెప్తాడు. ఈ సారి తండ్రి కొడుకుతో మ్యూజియం దగ్గరికి వెళ్లి అడిగి చూడు అంటాడు. వాళ్లు అది చూసి ఇది చాలా పురాతనమైనది మరియు అత్యంత అరుదైనది. రూ.5 లక్షలు ఇవ్వగలం అంటారు. అప్పుడు తండ్రి కొడుకు father son, తో ఈ ప్రపంచం చాలా వైవిధ్యమైనది. నీకు ఎక్కడ విలువ ఉండదో అక్కడ ఉండకు. అలా అని వారి మీద కోపం వద్దు. వారితో వాదించి కూడా ప్రయోజనం ఉండదు. నీకు తగిన విలువ దొరికిన చోట ఉండు..అని చెప్తాడు.
life short story: మనశ్మాంతి కరువైన ఆఫీసర్!
ఒక IAS ఆఫీసర్ ప్రక్క ఇంట్లో ఒక రైతు నివసించేవాడు. రోజూ తెల్లవారు జామునే అతని కోడి కూసేది. ఒకనాడు ఆఫీసరు రైతుని పిలిచి, నీ కోడివల్ల నాకు రాత్రంతా నిద్రపట్టడం లేదు..అన్నాడు. ఆ రైతు ఆశ్చర్యపోయి, నా కోడి తెల్లవారు జామునే కూస్తుంది కదండీ! మరి, రాత్రంతా తమరికి నిద్రాభంగం కల్గడానికి నా కోడి కూతలకి ఏం సంబంధమో అర్థం కావడం లేదు..అన్నాడు.

అప్పుడు ఆఫీసరు..అదేనయ్యా! నీ కోడి ఎప్పుడు కూస్తుందా అని రాత్రంతా ఎదురు చూడటంతో నా నిద్రంతా చెడిపోతుంది..అన్నాడు. ఈనాడు లోకంలో 90 శాతం మంది ఈ ఆఫీసరులాగ ఉన్నారు. అనుభవించే కష్టాలకన్నా కష్టాలు మీద పడతాయేమో, ఏం చేయాలి? అన్న ఆలోచనలతో, దిగులతో మనశ్మాంతిని దూరం చేసుకుంటున్నారు.