దేశంలో Health Emergencyని ప్ర‌క‌టించాలి : LHPS

దేశంలో Health Emergencyని ప్ర‌క‌టించాలి : LHPS

Health Emergency : Khammam : క‌రోనా సెకండ్ వేవ్ రెండో ద‌శ‌లో ఉన్నందున దేశంలో ప్ర‌స్తుతం ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారింద‌ని, దీనిని దృష్టిలో ఉంచుకొని దేశ‌వ్యాప్తంగా హెల్త్ ఎమ‌ర్జెన్సీని ప్ర‌క‌టించాల‌ని నంగార భేరి ఎల్‌హెచ్‌పిఎస్ రాష్ట్ర ఉపాధ్య‌క్షులు, తెలంగాణ బ‌హుజ‌న జెఎసి బ‌హుజ‌నుల జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ క‌న్వీన‌ర్ బానోతు భ‌ద్రునాయ‌క్ గురువారం ఓ ప్ర‌క‌ట‌న‌లో డిమాండ్ చేశారు. అదే విధంగా మ‌హారాష్ట్ర త‌ర్వాత ఆ స్థాయిలో క‌రోనా రోగులు సంఖ్య‌లో కేసులు రోజురోజుకూ తీవ్రంగా పెరుగుతున్నాయ‌ని, పేద మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాల‌కు ట్రీట్మెంట్ చేయించుకునే స్థోమ లేద‌ని భ‌ద్రు నాయ‌క్ అన్నారు. వీలైనంత వ‌ర‌కు క‌రోనాను ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కంలోకి చేర్చాల‌ని దీని వ‌ల్ల క‌రోనా వైద్యానికి సంబంధించిన ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్నంత వ‌ర‌కు అధిక ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌కుండా ఆప‌వ‌చ్చున‌ని అన్నారు. అదే విధంగా ప్ర‌తి పంచాయ‌తీ కేంద్రాల్లో క‌రోనా టెస్టుల‌కు ప్ర‌తి పంచాయ‌తీ స్థాయిలో విభాగాల మొబైల్ వాహ‌నాల‌ను ఏర్పాటు చేసి ప్ర‌తి ఒక్క‌రికీ క‌రోనా ప‌రీక్ష‌లు చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

ఇందుకు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు త‌గిన చ‌ర్య‌లు తీసుకొని ప్ర‌జ‌ల‌కు ప్ర‌తి ఒక్క‌రికీ త‌ప్ప‌ని స‌రిగా మాస్కులు, శానిటైజ‌ర్లు, భౌతిక దూరాని పాటిస్తూ వారి ప‌నుల‌ను చేసుకోవాల్సిందిగా అధికారులు ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తూ విజ్ఞ‌ప్తి చేయాల‌ని కోరారు. హెల్త్ ఎమర్జెన్సీని ప్ర‌క‌టించ‌ని ప‌క్షంలో కార్పొరేట్ ఆసుప‌త్రుల దోపిడీ విప‌రీతంగా పెరిగి అధిక ప్రాణ న‌ష్టం జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌ల‌కు క‌రోనా ఉచిత వైద్యం అందుబాటులో ఉండే విధంగా చూడాల‌ని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌రోనాకు ప్ర‌త్యేక బ‌డ్జెట్‌ను కేటాయించాల‌ని కోరారు.

చ‌ద‌వండి :  GHMC Elections 2020 Polling date | 1న పోలింగ్‌..4న ఫ‌లితాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *