less Sleep cause Obesity | ప్రతిరోజూ నిద్రపోవడానికి ఓ నిర్ణీత సమయం అంటూ పాటించని వాళ్లు త్వరగా ఊబకాయం భారిన పడతారట. ‘నిద్రకు సంబంధించి నిర్ధిష్టమైన సమయాలను పాటించడం వల్ల ఆరోగ్యమే కాదు, నాజూగ్గా కూడా ఉండొచ్చు’ అని అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. అలాగే రోజులో ఆరున్నర గంటల కన్నా తక్కువ నిద్ర పోతున్న వారూ, ఎనిమిదన్నర గంటల కన్నా ఎక్కువ నిద్రపోతున్న వారిలో కూడా అదనపు కొవ్వు పేరుకుపోతుందని అదే పరిశోధనలో తెలిపింది. కనుక రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం (less Sleep cause Obesity), లేవడం అలవాటు చేసుకోవాలని పరిశోధకులు చెబుతున్నారు.
పిల్లల్లో ఊబకాయంతో ఒత్తిడే

పిల్లలు బొద్దుగా ఉంటే ముద్దుగానే ఉంటారు. అయితే మరీ బొద్దుగా ఉంటే అది వారి శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచిది కాదు. నాజూకు పిల్లలతో పోలిస్తే లావుగా ఉన్నవారు త్వరగా ఒత్తిడికి, నిరాశకూ లోనవుతారని తాజా అధ్యయనం ఒకటి తెలిపింది. బాగా లావుగా ఉన్న పిల్లలు కొంచెం ఒత్తిడికి లోనైనా వారిలో కార్టిసాల్ హార్మోను ఎక్కువగా విడుదలవుతుంది. ఇది మానసికపరమైన ఇబ్బందులకూ, ఇతర ఆరోగ్య సమస్యలకూ కారణం అవుతుంది. ఎనిమిది నుంచి పన్నెండేళ్ల వయసున్న కొంత మంది నాజూకు, ఊబకాయంతో ఉండే పిల్లల్ని తీసుకుని ఈ అధ్యయనం చేసి, వివరాల్ని వెల్లడించారు.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!