Lemongrass benefits | నిమ్మగడ్డి వాడకం ఈనాటిది కాదు. వంటకాలు, సౌందర్య చికిత్సల్లో దీనిని విస్తృతంగా ఉపయోగిస్తారు. నిమ్మగడ్డి లేకుండా Thai వంటకాలుండవు. అన్ని చోట్లా సులువుగా దొరికే నిమ్మగడ్డి ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. ఈ నిమ్మగడ్డి గురించి తెలుసుకుంటే మీకు చాలా ప్రయోజనాలు తెలుస్తాయి. నిమ్మగడ్డి(Lemongrass benefits) యొక్క ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు చూద్ధాం!.
ఆకర్షణీయమైన ముదురు, లేత ఆకుపచ్చ వర్ఱ మిశ్రమంతో ఉల్లిపొరక మాదిరి కనిపించే నిమ్మగడ్డి మదిదోచే ఆహ్లాదభరితమైన నిమ్మవాసన వెదజల్లుతుంది. దీనిని తాజాగా వాడుకోవచ్చు. లేదంటే ఎండబెట్టి కూడా ఉపయోగించుకోవచ్చు. చరిత్ర తిరగిస్తే ఎన్నో ఏళ్ల కిందట Malaysiaలోని కొన్ని ప్రాంతాలకు చెందిన గిరిజనులు నిమ్మగడ్డిని శక్తివంతమైన పదార్థంగా నమ్మేవారట. యుద్ధానికి వెళ్లే ముందు Nimmagaddi లేపనాన్ని శరీరమంతా రాసుకునేవారట. అలా చేయడం వల్ల కత్తి చర్మంలోకి అంత సులువుగా దిగదని వారి నమ్మకం. 150 సెంటీమీటర్ల పొడవు పెరిగే నిమ్మగడ్డి కాడ బాగా గట్టిగా ఉంటుంది. అందుకే నేరుగా తినడం కన్నా స్లైసుల్లా కోసి వంటకాల్లో వాడాలి.
నిమ్మగడ్డి నూనె లాభాలు
నిమ్మ గడ్డి నూనె Skin సౌందర్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని స్పాల్లో కొన్ని రకాల చికిత్సల్లో బాగా వాడుతున్నారు. Skin Tonerగా పనిచేసే Lemon grass oilకు అస్ట్రిజెంట్ సుగుణాలున్నాయి. శరీరదుర్వాసనలనూ మాయం చేసే సహజడియోడరెంట్ నిమ్మగడ్డి నూనె. పేలు, అథ్లెట్స్‌ఫుట్, కీళ్లనొప్పులు, కొన్ని రకాల చర్మవ్యాధులకు ఇది దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఒత్తిడి దూరం చేసి శరీరానికి, మనసుకు స్వాంతనివ్వడంలో Lemongrass నూనెపాత్ర కీలకం. శరీరంలో అతిగా స్పందించే గ్రంథుల్ని కూడా సమతకూకంలో ఉండేలా నియంత్రించగల శక్తి నిమ్మగడ్డి నూనెకు ఉంది. Dandruff సమస్య కూడా ఇట్టే దూరమవుతుంది. జలుబు, జర్వానికి ఇది మందులా బేషుగ్గా పనిచేస్తుంది. దీనిలోని యాంటీమైక్రోబయల్, యాంటీపైరెటిక్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్ సుగుణాలే అందుకు కారణం.
లెమన్ గ్రాస్ టీ ఉపయోగాలు
జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది Lemongrass Tea. భావోద్వేగాలను నియంత్రించగులుతుంది. ఒత్తిడినిట్లే దూరం చేస్తుంది. దీనికున్న నిమ్మసువాసనే అందుక్కారణం. అప్పుడప్పుడు నిమ్మటీని తాగడం వల్ల శరీరంలోని చెడు రసాయనాలు, మలినాలు తొలిగిపోతాయి. అందుకే అప్పుడప్పుడు భోజనానికి ముందు లేదా తర్వాతైనా కొద్దిగా నిమ్మగడ్డి టీ తాగడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. చాలా స్పాల్లో నిమ్మగడ్డిటీని వెల్‌కమ్ డ్రింక్‌గా ఇస్తారు.


నిమ్మగడ్డిని సన్నగా తురిమి రోజు తీసుకునే వంటకాలపై చల్లుకుని తినవచ్చు. నిమ్మగడ్డి పొడి, కొబ్బరి పాలు చక్కని కాంబినేషన్. చేపలు, చికెన్ తదితర వంటకాల్లో కొబ్బరిపాలతో పాటు నిమ్మగడ్డిని కూడా చేర్చవచ్చు. వేపుళ్లు, కూరలు, పప్పులు, Salad, పచ్చళ్లు ఇలా ఎలాంటి వంటకంలోనైనా నిమ్మగడ్డిని వాడవచ్చు. చివరగా ఒక్క మాట నిమ్మగడ్డిని వాడేముందు నిపుణుల సలహా తీసుకోవడం అవసరం. ఒక్కోసారి దీనివల్ల ఎలర్జీలు రావచ్చు.