Lemon water Bath: శరీరానికి ఉపశమనం కలిగి, ఉత్తేజం పొందాలన్నా, కూల్ కూల్‌గా ఉండాలన్నా సబ్బుకు బదులు కేవలం నిమ్మకాయతో స్నానం చేయడమే మంచిది. Swimming చేసేవారు తప్పనిసరిగా దీనితో స్నానం చేయడం ఎంతో ప్రయోజనకరం. నిమ్మకాయలో ఉండే ఆమ్లగుణం చర్మాన్ని శుభ్రపరిచి, మృదువుగా చేస్తుంది.
లెమన్ బాత్ (Lemon water Bath) ఎలా చేయాలంటే?
నిమ్మకాయ ఒకటి తీసుకోండి. స్నానానికి ఉపయోగించే నిమ్మకాయ (Lemon water Bath) లేత పసుపు రంగులో ఉండాలి. ఆకుపచ్చని చుక్కలున్నా పర్వాలేదు. నిమ్మకాయ పైన తెల్లని పొర ఉండేలా వలవాలి. ఆ తర్వాత రెండు భాగాలుగా కట్ చేయాలి. ఇక లెమన్ షవర్ బాత్ (Lemon water) ప్రారంభించడమే తరువాయి. ముందుగా జుట్టును నీళ్లతో ముందు కడగాలి. ఆ తర్వాత ఒక నిమ్మ చెక్కను పట్టుకుని సుతి మెత్తగా నిమ్మ రసాన్ని తలపై పిండాలి. ఆ తర్వాత రెండో వైపుకు (తొక్క ఉన్న వైపుకు) తిప్పి జుట్టుపై రుద్ధాలి. ఇలా కాకుండా రసం పిండిన వైపే రుద్దుకుంటే నిమ్మకాయ (Lemon) లోని ముత్యాలు తలలో ఇరుక్కుంటాయి.
రెండు చేతుల్లోకి నిమ్మ తొక్కల్ని తీసుకుని, తొక్కవైపు భాగంతో జుట్టుపై రుద్దాలి. పొడవైన జుట్టున్న వారు రెండు చేతులూ ఉపయోగించాల్సిందే. మీ జుట్టును నిమ్మ తొక్కలతో పూర్తిగా రుద్దిన తర్వాత నీటితో శుభ్రంగా కడిగేయాలి. మీ ముఖాన్ని శరీరాన్ని కూటా నీటితో ముందు శుభ్రంగా కడగాలి. ఇప్పుడు జుట్టును ఎలా శుభ్రం చేసుకున్నారో అలాగే మీ ముఖాన్ని నిమ్మ చెక్కతో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత మీ శరీరాన్ని కూడా శుభ్రం చేసుకోవాలి. నిమ్మ చెక్కలతో రుద్దిన తర్వాత నీటితో శరీరాన్నిమొత్తం శుభ్రంగా కడగాలి. దీనితో మీ Skin మృదువుగా అయిన అనుభూతి కలుగుతుంది.

Lemon water Bath | జాగ్రత్తలు ఇవే!
నిమ్మ తొక్కని వలిచేటప్పుడు మొత్తం తొక్క ఒకేసారి వచ్చేలా జాగ్రత్తగా వలిచి, నిమ్మ తొక్కని కూడా రెండు భాగాలుగా చేయాలి. నిమ్మ రసాన్ని కళ్లల్లో పడకుండా చూసుకోవాలి. మీ శరీరతత్వాన్ని బట్టి కొందరికి మీ చర్మానికి నిమ్మకాయలోని ఆమ్ల గుణాలని తట్టుకునే శక్తి ఉండకపోవచ్చు. ఒక వేళ మీ శరీరంపైన సున్నితమైన ప్రదేశాలలో మీకు చర్మం మండుతున్నట్టు కొన్ని నిమిషాల కంటే ఎక్కువ సేపు అనిపిస్తే, నిమ్మకాయతో స్నానాన్ని ఇంకెప్పుడూ చేయకండి.