Lemon Juice Benefits: తాజా నిమ్మపండ్లలో పోషక విలువలు మెండుగా ఉన్నాయి. నిమ్మపండులో సి విటమిన్ ఉంది. జీర్ణశక్తికి బహుళ ప్రయోజనకారి. నిమ్మరసం దాహానికి చక్కగా పనిచేస్తుంది. ఒక గ్లాసు నిమ్మరసం రోజూ పరగడుపున త్రాగేవారికి జీర్ణశక్తి బాగా పని చేస్తుంది. స్త్రీలకు శరీరక కాంతినిస్తుంది. నిమ్మరసం వృద్ధులకు ఉపశమనం కలిగిస్తుంది. నీరసంగా ఉన్నవారికి కాస్తంత ఉత్సాహం కలిగిస్తుంది.
నిమ్మపండు(Lemon Juice Benefits) ఉపయోగాలు!
స్త్రీలు స్నానం చేసేటప్పుడు గోరువెచ్చని నీటిలో రెండు చుక్కలు నిమ్మరసం కలుపుకుని స్నానం చేస్తే శరీరంలో తాజాదనంతో నిగనిగలాడుతుంది. రాయలసీమ ప్రాంతవాసులు పులిహోర వంటకంలో నిమ్మకాలయు ఉపయోగిస్తారు. తాజా నిమ్మపండులో సమృద్ధిగా Vitamins ఉన్నాయి. ఆయుర్వేద శాస్త్రంలో నిమ్మ ప్రాముఖ్యత గురించి వివరించడం జరిగింది. అమ్మవారి పూజలకు, జాతరలకు నిమ్మపండ్లు ఉపయోగిస్తారు. నిమ్మ మహిమ కలదంటారు.
నిమ్మరసం(Lemon Juice Benefits) లాభాలు!
నిమ్మరసం ఆకలిని పెంచుతుంది. మలబద్ధకాన్ని పోగొడుతుంది. మజ్జిగలో నిమ్మ ఆకులు వేస్తే మంచి సువాసనతో మజ్జిగ బావుంటుంది. నిమ్మకాయలు సాధారణంగా అన్ని కాలాలలోనూ లభిస్తుంది. అనేక రకాల సుగుణాలు నిమ్మకాయలో ఉన్నాయి. మనం వాడేసిన నిమ్మతొక్కలను బాగా ఎండబెట్టి వాటిని మిక్సీలో వేసి పొడి చేసి దానిని సెనగపిండి కొంచెం నిమ్మరసం కలిపి పేస్టు చేసి స్త్రీలు తమ ముఖానికి కడుక్కుంటే మరింత తాజాదనంతో ప్రకాశిస్తారు. గోరు వెచ్చని Water లో ఒక స్పూను తేనె రెండు స్పూన్ల నిమ్మరసం కలుపుకుని తాగితే కఫం తగ్గిపోతుంది. నిమ్మలో పోషక విలువలతో పాటు ఔషధ గుణాలు అధికంగా ఉన్నాయి.


నిమ్మ రసాని (Lemon Juice Benefits) కున్న సుగుణాలను లెక్క పెడితే రెండు చేతులుకున్న వేళ్లు సరిపోవు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం గ్లాసుడు గోరు వెచ్చని నీళ్లలోకి కాస్త నిమ్మరసం కలుపుకుని తాగితే అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. మానసిక ఒత్తిళ్లను తగ్గించి, కొత్త ఉత్సాహాన్నిచ్చే శక్తి నిమ్మకు పుష్కలం. కాలేయంలో పేరుకున్న విషతుల్యాలను తొలగిస్తుంది. కాలేయ జీవితకాలాన్ని పెంచుతుంది. నిమ్మలో దొరికినంత సి విటమిన్ మరే పండులోను లభించదు. వయసు పెరుగుతున్నా చర్మాన్ని ముడుతలు పడనీయదు. మేని ఛాయలు మెరుగవుతుంది. ఇది యాంటీసెఫ్టిక్ గా పని చేయడం వల్ల చర్మ సమస్యలూ దరి చేరవు.
ఎప్పుడైనా కలుషిత నీటిని తాగినప్పుడు గొంతువాపు వస్తుంది. దీనికి సరైన విరుగుడు నిమ్మరసం, వెంటనే ఉపశమనాన్ని ఇస్తుంది. పంటి నొప్పిని తగ్గించే శక్తి నిమ్మకు ఉంది. పళ్ల నుంచి వెలువడే రక్తస్రావాన్ని అడ్డుకుంటుంది. లెమన్ వాటర్ గమ్ నమిలినా ఈ ఫలితం కనిపిస్తుంది. నిమ్మలోని Antioxidants దండిగా ఉంటాయి. చౌక ధరలో దొరికే నిమ్మ ద్వారా విలువైన వీటిని పొందవచ్చు.


బ్లాక్ హెడ్స్ తొలగించే నిమ్మ (Lemon Juice Benefits)
నిమ్మరసంలో చర్మ ఛాయను మెరుగుపరిచే Bleaching గుణాలు అధికం. అర చెక్క నిమ్మరసానికి కొద్దిగా నీళ్లూ, అరచెంచా తేనె కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దీనిని ముఖానికి పట్టింటి ఇరువై నిమిషాల తర్వాత కడిగేయాలి. రెండు చెంచాల నిమ్మ రసానికి చెంచా తేనె, చెంచా బాదం నూనె కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. దీనిని ముఖానికి, మెడకీ పట్టించి ఆరాక గోరువెచ్చని నీటితో కడిగేయాలి. దీనివల్ల తేమతో పాటు ముఖం నిగారింపు సంతరించుకుంటుంది. మృతకణాలు తొలగించడానికి నిమ్మరసం ఎంతో ఉపయోగపడుతుంది.
సగానికి కోసిన నిమ్మ చెక్కని పంచదారలో అద్ది, దాంతో ముఖాన్ని సున్నితంగా రుద్దుకుంటే మృతకణాలు తొలిగిపోతాయి. Blackheads ఎక్కువుగా ఉండే ప్రాంతంలో సన్నగా తరిగిన నిమ్మచెక్కతో కానీ, నిమ్మరసంలో ముంచిన దూదితో కానీ రుద్దితే ఫలితం ఉంటుంది. ముఖంపై పేరుకున్న బ్యాక్టీరియా తొలిగి Acne వంటి సమస్యలు పోతాయి. ముఖ చర్మమూ మృదువుగా మారుతుంది.