legal notice | చట్ట పరంగా అందించే విధానాన్నే లీగల్ నోటీసు అంటారు. మొదటిగా ఓ బాధితుడు భూమికి సంబంధించిన విషయంపై కోర్టును ఆశ్రయించి సదరు వ్యక్తి, సంబంధీకులకు లీగల్ నోటీసు(legal notice) పంపిస్తారు. ఇది బాధితుడికి న్యాయం దిశగా ఉపయోగపడేందుకు దోహద పడుతుంది. ఓ వివాదం విషయంలో ఎవరికైనా లీగల్ నోటీసు పంపిన తర్వాత వారు ఆ నోటీసుకు లోబడి, దాని పర్యావసానం తెలుసుకొని దానికి అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. అందుకనే లీగల్ నోటీసు పంపించగానే సదరు వ్యక్తి తన వెర్షన్‌ను తెలియజేస్తూ రిప్లై అందిస్తారు.
ఆ రిప్లైలో మనం ఏమైతే నోటీసులో డిమాండ్లు పంపినామో, వాటికి ఒప్పుకొని మనకు నోటీసు రిప్లై పంపించే అవకాశం ఉంది. లేదా మన డిమాండ్లను పూర్తిగా వ్యతిరేకిస్తూ తన యొక్క వెర్షన్లో నోటీసుకు రిప్లై పంపిస్తారు. ఏదైనా నోటీసు ఇచ్చిన తర్వాత ఆ నోటీసులో పేర్కొన్న సమయం వరకు ఎదుట వ్యక్తి స్పందించకపోతే, పట్టించుకోకపోతే మనం కోర్టుకు వెళ్లవచ్చు. మనం కోర్టులో గెలిచిన తర్వాత మనం ఇప్పటి వరకు కోర్టుకు ఎంత ఖర్చు పెట్టాం. లాయరుకు ఎంత ఇచ్చాం అనే విషయాలపై వారం రోజుల తర్వాత మనం కోర్టులో కాస్ట్ మెమో అనేది ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఆ కాస్ట్ మెమో గనుక జడ్జి అనుమతి ఇస్తే మనం ఎంత ఖర్చు పెట్టామో దానికి తగ్గట్టుగా ఎదుట పార్టీ నుండి చెల్లించుకునేలా కూడా చేసుకోవచ్చు.
నోటీసు ఎలా పంపాలి?
ఈ విధంగా లీగల్ నోటీసు ఉపయోగపడుతుంది. అది ఒక రకమైన ముందు జాగ్రత్తగా తీసుకునే చర్యలో మొదటి సాధనంగా చెప్పవచ్చు. కాబట్టి ఈ లీగల నోటీసు అనేది మామూలు కేసులకు ఒక విధంగా ఉంటుంది. చెక్‌బౌన్స్‌కు మరో రకంగా ఉంటుంది. చెక్ బౌన్స్ కేసులో ఈ నోటీసుకు చాలా ప్రాధాన్యత ఉంది. ఎవరైతే మనకు చెక్‌బౌన్స్ చేశారో వారికి ముందుగా నోటీసు ఇచ్చి తీరాలి. అందులో పేర్కొన్న వల్సిన అంశాలు ఏమిటంటే..మీరు తీర్చవల్సిన చట్టబద్ధమైన అప్పును తీర్చవల్సిన బాధ్యత నీ మీద ఉంది. తీర్చేందుకు నువ్వు ఒక చెక్ ఇచ్చావు. ఆ చెక్ ఇచ్చిన సమయంలో నీ బ్యాంక్ ఖాతాలో సరియైన మొత్తంలో డబ్బులు పెట్టుకోకపోవడం వల్ల చెక్ బౌన్స్ అయింది. కాబట్టి సెక్షన్ 138లో చెప్పబడినట్టుగా నీవు నేరం చేశావు. కాబట్టి ఈ నోటీసు నీకు అందిన 15 రోజుల్లోపు మాకు అమౌంట్ అందజేయాలి. లేని యెడల మీ మీద చెక్‌బౌన్స్ వేస్తావు. అని బాధిత వ్యక్తి లీగల్ నోటీసు పంపించాల్సి ఉంటుంది.
ఈ చెక్ బౌన్స్ నోటీసు అందుకున్న 15 రోజుల్లోపు ఎదుట పార్టీ వారు కచ్చితంగా డబ్బులు చెల్లించాలి. అలా డబ్బు కట్టని యెడల ఎదుటి వ్యక్తి వేసే చెక్‌బౌన్స్ కేసులో సదరు వ్యక్తి జైలుకు పోవాల్సి ఉంటుంది. డబ్బు కూడా కట్టాల్సి ఉంటుంది. ఈ లీగల్ నోటీసు పంపినప్పుడులో పోస్టులో ఇచ్చిన ఎక్నాల్జిమెంట్ ఫారమ్, మనం పంపినట్టు ఎక్నాల్జిమెంట్ను జాగ్రత్తగా ఉంచుకొని కోర్టులో మనం వేసిన కేసు తాలూకూ సమర్పించాల్సి ఉంటుంది.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!