legal advice on propertyప్రశ్న: మా అమ్మమ్మ నాకు నా చెల్లెలకు తన ఇల్లు చెందాలని వీలునామా రాసింది. అమ్మమ్మకు స్థలాన్ని అప్పట్లో ప్రభుత్వం ఇచ్చింది. మాకు వీలునామా(veelunama) రాసి నాలుగు సంవత్సరాలు అవుతోంది. ఈ మద్యే మా అమ్మమ్మ చనిపోయారు. మేము ఆ ఇంటికి వెళితే.. మా మామయ్య పేరున మరో వీలునామా ఉంది. అని ఆయన ఆక్రమించుకున్నారు. మాకు తెలిసి మా అమ్మమ్మ ఆయన దగ్గరే ఉంటుంది. చనిపోయిన తరువాత వేలిముద్ర తీసుకున్నారు అనుకుంటున్నాము. ఇప్పుడు మేం కేసు వేయవచ్చా? (legal advice on property)అది ఎవరికి వస్తుంది?
జవాబు: వీలునామా ఎప్పుడు కూడా చనిపోయేముందు ఎవరైతే ఎవరికి రాస్తారో అంటే.. చివరిసారిగా వీలునామా ఎవరి పేరున రాస్తే.. అదే సక్రమమైన వలునామా. ప్రతి వ్యక్తి చనిపోయేలోపు ఎన్నిసార్లు అయినా వీలునామా రాయవచ్చు. మార్చుకోవచ్చు. చివరిసారిగా రాసిన వీలునామానే చెల్లుతుంది. వీలునామాకు రిజిస్ట్రేషన్ తప్పనిసరికాదు. అయితే రిజిస్ట్రేషన్ చేయించుకుంటే చాలా లిటిగేషన్స్ నుంచి తప్పించుకోవచ్చు.


ఇ మీ మీ విషయానికి వస్తే వీలునామా మీ మామయ్యకు రాసి ఉంటే అతనికే చెల్లుతుంది. పైగా ఇప్పటి వరకూ ఆమెను అతనే పోషించారు కాబట్టి.. అతనికే వర్తిస్తుంది. అయితే మీ మామయ్య వీలునామాను దొంగతనంగా సృష్టించారు అనే అనుమానం మీకుంటే వీలునామాల్లో ఏది నిజమైనదని చెప్పడానికి రుజువులు ఉంటే మీ ఆస్థిని దక్కించుకోవడానికి కోర్టుకు వెళ్లవచ్చు. ఇక్కడ మీకు ఉన్న మరో విషయం ఏమిటంటే అది ప్రభుత్వం మీ అమ్మమ్మ గారికి ఉండానికి ఇచ్చింది. అంతేగాని వారసత్వంగా ఆస్తులు అనుభవించడానికి కాదు. ప్రభుత్వ స్థలాలను, ప్రభుత్వం ఎన్నటికైనా స్వాధీనం చేసుకుంటుంది. అంతేగాక ఈ విషయంలో మీరు కోర్టుకు వెళితే ఇంటిని ప్రభుత్వం దక్కించుకునే అవకాశం ఉంది. తరువాత ఆ స్థలాన్ని వేరే పేదవారికి ఇస్తారు. చివరకు అది మీ ఇద్దరికి కాకుండా పోతుంది. కాబ్టటి మీరు మీ మామయ్య గారితో కూర్చుని మాట్లాడుకుని విషయాన్ని సెటిల్ చేసుకుంటే సరిపోతుంది. (సేకరణ:-న్యాయ సలహాదారు ఆకుల రమ్య కుమారి).
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!