Jaggayyapeta : కృష్ణా జిల్లాలో విచిత్రమైన దొంగతనం బయటపడింది. రూ.500 కే టీవీ అమ్ముతుంటే పోలీసులకు అనుమానం వచ్చింది. అదుపులోకి తీసుకుని ఆరా తీస్తే దిమ్మ తిరిగే విషయాలు తెలిశాయి. జగ్గయ్యపేట మండలం గౌరవరం హైవేపై రూ.500 టివిని అమ్మేందుకు ప్రయత్నించారు. అంత తక్కువ ధరకు టీవీ విక్రయించేందుకు ప్రయత్నించడంతో అనుమానం వచ్చింది. వెంటనే టీవీ అమ్ముతున్న వారిని పట్టుకున్నారు. అవి ఎక్కడ నుంచి తీసుకొచ్చారని ప్రశ్నించారు.


ఎనికేపాడు ఎల్జీ షోరూం నుంచి భీమవరం వెళ్లేందుకు ఎలక్ట్రానిక్ వస్తువుల ఆటోను లోడ్ చేశారు. యూపీకి చెందిన వ్యక్తుల కన్ను ఆ ఆటోపై పడింది. లోడ్ చేసిన వస్తువుల్ని దొంగిలించి అక్కడి నుండి పారిపోయారు. ఎనికేపాడులో దొంగిలించి వాటిని హైదరాబాద్ తీసుకువెళుతున్నారు. గౌవరం దగ్గరకు రాగానే డీజిల్ అయిపోవడంతో చేసేది ఏమీ లేక రూ.500లకే టీవీ అంటూ అమ్మే ప్రయత్నం చేశారు. ఇది పోలీసుల కంట పడటంతో దొరికిపోయారు. రూ.9 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
ఇది చదవండి:సగటు వాలంటీర్ లోపల ఆవేదన ఇదేనేమో!?
ఇది చదవండి:వత్సవాయి : టిడిపి కార్యకర్త వాహనానికి నిప్పు!
ఇది చదవండి:దైవదర్శనానికి వెళ్తూ రోడ్డు ప్రమాదం
ఇది చదవండి:చాపకింద నీరులా సెకండ్ స్ట్రెయిన్ ముప్పు!
ఇది చదవండి:పీఎస్ఎల్వీ సీ-51 రాకెట్ ప్రయోగం విజయవంతం
ఇది చదవండి:బ్రిందలో అరుదైన శస్త్ర చికిత్స
ఇది చదవండి:రైతు గొప్పతనాన్ని తెలిపిన శ్రీకారం మూవీ సాంగ్ సూపర్!