Learn Car Driving tipsకారు నడిపేవాళ్లు కోపంగా ఉన్నా, విషాదంగా ఉన్నా ఏడుస్తున్నా, ఉద్వేగంతో ఉన్నా, రోడ్డు మీద నుంచి తమ చూపు మరల్చినా యాక్సిడెంట్ రిస్కు పది రెట్లు ఎక్కువుగా ఉంటుందట. ఇది ఒక పరిశోధనలో తేలింది. అంతేకాదు ఇతర పనుల్లో నిమగ్నమై ఉన్నా అంటే కారు నడుపుతూ సెల్‌ఫోన్(Cellphone) లో మాట్లాడటం, రోడ్డు మీద ఉన్న బోర్డు(Board)లను చదవడం, రోడ్డు మీద వెళ్లే వారి వైపు చూడ్డం వంటి వాటి వల్ల కూడా వారి చూపు రోడ్డు మీద సరిగా ఉండదు. ఈ తరహా డ్రైవర్లు 50 శాతం సమయం డ్రైవింగ్‌లో ఉండటం ఆందోళన కలిగించే (Learn Car Driving tips)విషయం.
అమెరికాలో వర్జీనియా టెక్ యూనివర్శిటీకి చెందిన అధ్యయన కారులు ఈ స్టడీని నిర్వహించారు. ఇందులో 90 శాతం యాక్సిడెంట్లు అలసట వల్ల లేదా పొరబాటు వల్ల, లేదా రోడ్డు మీద నుంచి చూపు మర్చలడం వల్ల, ఏకాగ్రత లోపించడం వల్ల జరుగుతున్నాయట. అధ్యయనంలో భాగంగా పదహారు వందల వరకూ సాధారణ స్థాయి యాక్సిడెంట్లు నుంచి తీవ్రమైన యాక్సిడెంట్ల(accident)ను స్టడీలో పరిశీలించారు. వీటిల్లో 905 పెద్ద యాక్సిడెంట్లు వల్ల బళ్ళను నడిపేవారికి, ఇతరులకి తీవ్ర గాయాలు అయితే, కొన్ని సందర్భాల్లో బాగా ఆస్తినష్టం కూడా జరిగిందట. అయితే చాలా యాక్సిడెంట్లు బండి నడిపే వాళ్ల తప్పిదనం వల్లే జరుగుతున్నాయట. వెహికల్ రియర్ సీటు(Vehical rear seat) నుంచి చిన్న పిల్లలతో మాట్లాడం వల్ల కొంత వరకూ రక్షణ ఉంటుందని, రిస్కు తక్కువుగా ఉంటుందని కూడా అధ్యయకారులు అంటున్నారు.

డ్రైవింగ్‌లో డిస్ట్రాక్టింగ్ను నియంత్రించకపోతే భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. అందుకే బళ్లు నడిపే వాళ్లు ఏకాగ్రతతో పనిచేయాలి. ప్రతి క్షణం రోడ్డును జాగ్రత్తగా గమనించుకుంటుండాలి అని అధ్యయనకారులు హెచ్చరిస్తున్నారు.
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి