Leading Producer Doraswamy Raju has Passed Away | vmc doraswamy raju | ప్రముఖ నిర్మాత దొరస్వామి రాజు ఇక లేరు
Hyderabad: ప్రముఖ సినీ నిర్మాత, విఎంసీ అధినేత, కృత్రియం తేజం వి. దొరస్వామి రాజు హైదరాబాద్లోని బంజారా హిల్స్ లోని కేర్ ఆసుపత్రిలో సోమవారం ఉదయం గుండె పోటుతో మృతిచెందారు. వి.ఎం.సి ఆర్గనైజేషన్స్ (విఎంసి ప్రొడక్షన్స్, విఎంసి పిక్చర్స్, విఎంసి ఫిల్మ్స్ , విఎంసి 1కంపెనీ , విఎంసీ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్, విఎంసి పిక్చర్ ప్యాలెస్) బహుముఖ వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన వ్యవస్థాపకులు. వి.దొరస్వామి రాజు(విడిఆర్) చిత్ర నిర్మాత మాత్రమే కాదు. 1994లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి, ఆర్.చెంగారెడ్డి వంటి ఉద్దండ నాయకునిపై భారీ మెజార్టితో గెలుపొందారు.
అంతేకాక టిటిడి బోర్డు సభ్యుడిగా, ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా, పంపిణీ మండలి అధ్యక్షుడిగా, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఇలా పలు కీలకమైన భూమికలను అత్యంత ప్రతిభతో నిర్వహించారు. ఆయన ఆంధ్రప్రదేశ్లో అత్యంత విజయవంతమైన తెలుగు చిత్ర నిర్మాత, పంపిణీ దారు, ప్రదర్శనకారులలో ఒకరు. ఆయన నిర్మించిన బ్లాక్ బస్టర్ సినిమాలు, అవార్డు సినిమలు, టెలి సినిమాలు, టెలి సీరియల్స్, తమిళ డబ్బింగ్, హిందీ డబ్బింగ్ చిత్రాలను ఎన్నో నిర్మించారు.
సింహాద్రి, అన్నమయ్య, సీతారామయ్య గారి మనవరాలు వంటి గొప్ప చిత్రాలను తెరకెక్కించిన ఘనత వారది. 1978లో విఎంసి సంస్థను ప్రారంభించారు. దీనిని మహానటుడు, పురాణ వ్యక్తిత్వం ఎన్ టి రామారావు చేతుల మీదుగా ప్రారంభించారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావుతో బ్లాక్ బ్లస్టర్స్ సీతారామయ్య గారి మనవరాలు నిర్మించారు. ఇది ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డును పొందింది. అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులను పొందింది. ఆయన నిర్మించిన, అక్కినేని నాగార్జున తో అన్నమయ్యసంచలన విషయం అదించింది. చాలా అవార్డులను తెచ్చి పెట్టిన సినిమా కూడా. సినీ నిర్మాత వి.దొరస్వామి మృతికి పలువురు సినీ ప్రముఖులు అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఇది చదవండి:జీ-7 సదస్సుకు ప్రధాని మోడీకి ఆహ్వానం పంపిన యూకే ప్రధాని