Aruna Hospital

Aruna Hospital: ప‌లుమార్లు ఆప‌రేష‌న్ బాలింత మృతి.. శిశువు ప‌రిస్థితి విష‌మం!

Spread the love

Aruna Hospital: హైద‌రాబాద్: ఎల్బీన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని అరుణ ఆస్ప‌త్రిలో దారుణం చోటు చేసుకుంది. అనేస్థీషియా అధికంగా ఇవ్వ‌డంతో కోమాలోకి వెళ్లిన గ‌ర్భిణీ ప్ర‌తిభ‌(27) హ‌డావిడిగా ప‌లుమార్లు ఆప‌రేష‌న్ చేయ‌డంతో అప‌స్మార్థ‌క స్థితిలోకి వెళ్లింది. పుట్టిన బాబు ప‌రిస్థితి విష‌మంగా ఉంది. బాలింత‌ను అవేర్ గ్లోబ‌ల్ ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా అక్క‌డే మృతి చెందింది. ప్ర‌తిభ మృతి చెంద‌డంతో అరుణ ఆసుప‌త్రి ఎదుట బంధువులు, కుటుంబ స‌భ్యులు ధ‌ర్నాకు దిగారు.

వివ‌రాల్లోకి వెళితే.. గ‌ద్వాల్‌కు చెందిన సువ‌ర్ణ ల‌క్ష్మ‌ణ్ దంప‌తుల‌కు చెందిన ప్ర‌తిభ‌వ (27) కూతురు. ఎల్బీన‌గ‌ర్‌లో చింత‌ల కుంట ఇంజ‌నీరింగ్ కాల‌నీ ఫేస్ 2లో దాదాపుగా 20 సంవ‌త్స‌రాలుగా నివాసం ఉంటున్నారు. సింకింద్రాబాద్ అల్వాల్ కి చెందిన విజ‌య్ తో 2000 సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ 27న వివాహం జ‌రిగింది.

ఇటీవ‌ల స్టాఫ్ సెలెక్ష‌న్‌లో కూడా సెలెక్ట్ అయింద‌ని త‌ల్లిదండ్రులు చెబుతున్నారు. అనేస్థీషియా అధికంగా ఇవ్వ‌డంతో కోమాలోకి వెళ్లిన గ‌ర్భిణీ ప్ర‌తిభ‌(27) కు హ‌డావుడిగా మూడు ర‌కాలుగా ప‌లుమార్లు ఆప‌రేష‌న్ల‌ను అరుణ్ ఆసుప‌త్రి యాజ‌మాన్యం చేశార‌ని చెబుతున్నారు.

మృతిరాలి గ‌ర్భ‌సంచి కూడా తీసేసిన డాక్ట‌ర్లు దానితో అప‌స్మార‌క స్థితిలో బాబు కి జ‌న్మ‌నిచ్చిన‌ప్ప‌టికీ శిశువు ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని అవేర్ గ్లోబ‌ల్ ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా అక్క‌డే బాలింత మృతి చెందింది. ప్ర‌తిభ మృతి చెంద‌డంతో అరుణ ఆస్ప‌త్రి(Aruna Hospital) వ‌ద్ద ధ‌ర్నాకు దిగిన బాధిత కుటుంబ స‌భ్యులు మాకు న్యాయం చేయాల‌ని మీడియా ఎదుట వేడుకున్నారు.

Covid Vaccine : ఇక గ‌ర్భిణీల‌కు కూడా! రాష్ట్రాల‌కు కేంద్రం సూచ‌న‌!

Covid Vaccine : దేశంలో క‌రోనా ముప్పును త‌గ్గించేందుకు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు తీసుకుంటున్న చ‌ర్య‌ల్లో భాగంగా వ్యాక్సిన్ ప్ర‌ధాన‌మైన‌ది. ఈ నేప‌థ్యంలో 18 సంవ‌త్స‌రాలు నిండిన Read more

Tumor Surgery : ఖ‌మ్మంలో అరుదైన శ‌స్త్ర చికిత్స

సెయింట్ మేరీస్ హాస్పిట‌ల్‌లో 10 కేజీల గ‌డ్డ తొల‌గింపు Tumor Surgery : Khammam : ఖ‌మ్మం న‌గ‌రంలో స్థానిక సెయింట్ మేరీస్ హాస్పిట‌ల్ లో అరుదైన Read more

Tumour operation: బ్రింద‌లో అరుదైన శ‌స్త్ర చికిత్స‌ |Brinda hospital| khammam

Tumour operation: Khammam: న‌గ‌రంలోని భ‌క్త‌రామ‌దాసు క‌ళాక్షేత్రం ఎదురుగా ఉన్న ప్ర‌ముఖ బ్రింద ఆసుప‌త్రిలో శ‌నివారం అరుదైన శ‌స్త్ర చికిత్స చేశారు. ఖ‌మ్మం జిల్లా ఎర్రుపాలెంకు చెందిన Read more

Ruia Hospital : మా వ‌ల్ల కాదు బాబోయ్‌! రుయాలో న‌ర్సుల గోడు!

Ruia Hospital : మా వ‌ల్ల కాదు బాబోయ్‌! రుయాలో న‌ర్సుల గోడు! Ruia Hospital : తిరుప‌తి : రాయ‌ల‌సీమ‌కే త‌ల‌మానిక‌మైన తిరుప‌తి రుయా ఆస్ప‌త్రిలో Read more

Leave a Comment

Your email address will not be published.