పెద్దపల్లిలో హైకోర్టు న్యాయ వాది దంపతుల దారుణ హత్య
పెద్దపల్లిలో హైకోర్టు న్యాయ వాది దంపతుల దారుణ హత్య
Peddapalli: తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రామగిరి మండలం కల్వచర్ల ప్రధాన రహదారిపై గుంజపడుగు గ్రామానికి చెందిన ప్రముఖ హైకోర్టు న్యాయవాది గట్టు వామన్ రావు దంపతులపై కారులోనే కత్తులతో దాడి చేశారు. ప్రాణపాయ స్థితిలో రక్తం మడుడులో రోడ్డుపై పడి ఉన్న న్యాయవాది వామన్‌రావును స్థానికులు గమనించారు. తమపై గుంజపడుగు గ్రామానికి చెందిన మంథని మండలం టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కుంట శ్రీనివాస్ కత్తులతో దాడి చేశారని న్యాయవాది చెప్పినట్టు తెలుస్తోంది. అడ్డు వచ్చిన భార్య నాగమణిపైనా కత్తితో దాడి చేశారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించగా వామనరావు దంపతులు ఇద్దరూ ఆసుపత్రిలోనే మృతి చెందారు. శీలం రంగయ్య లాకప్ డెత్ కేసులో హైకోర్టులో వామన్‌రావు పిల్ వేశారు. గతంలో పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధుకు అక్రమ ఆస్తులపై వామనరావు స్పందించారు. పుట్ట మధుకు వ్యతిరేకంగా పలు కేసులు వాదించినట్టు తెలుస్తోంది. పట్టపగలు న్యాయవాది దంపతులపై దుండగులు కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేయడంతో ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది.

ఇది చదవండి: కేసీఆర్ ఒక విలన్: భట్టి విక్రమార్క
ఇది చదవండి:తమిళ స్మగ్లర్ అరెస్టు
ఇది చదవండి:అన్నం తిన్నొచ్చే లోపులో విషాదం మిగిలింది!
ఇది చదవండి:మార్చి 10 నుంచి మున్సిపల్ ఎన్నికలు
ఇది చదవండి:ఖమ్మం పాత బస్టాండ్‌పై పెద్దల కన్ను
ఇది చదవండి:జమిలి ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు!