Lawn | ఇంటి ఆవరణంలో పచ్చని పచ్చిక ఉండే సేదతీరడానికి చాలా అనువుగా ఉంటుంది. ఉన్న కొద్ది పాటి స్థలంలో కూడా లాన్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పటికే మీ ఇంటి ఆవరణంలో Lawn ఉన్నా, కొత్తగా ఏర్పాటు చేసుకుంటున్నా ఈ జాగ్రత్తలు తీసుకోండి.
లాన్‌కు ఉదయం లేక మధ్యాహ్నం సమయంలో నీరు పడితే మంచిది. వేసవికాలంలో రోజూ పట్టాలి. సాయంత్రం వేళ నీరు పడితే Lawn పాడయ్యే అవకాశం ఎక్కువుగా ఉంది. రాత్రివేళ్లల్లో గ్రాస్ నీటిని సరిగ్గా పీల్చుకోలేదు. దీని వల్ల గ్రాస్ దెబ్బతింటుంది. వీలైనంత వరకూ స్పింకర్ల ద్వారా నీరు పట్టాలి. దీనివల్ల నీరు అంతటా సమానంగా పడుతుంది. గ్రాస్ లేక Gardenలో మొక్కలు బాగా పెరగాలంటే ఎరువులు వాడటం తప్పనిసరి. భూమి రకాన్ని బట్టి ఏ ఎరువులు వాడాలో నిర్ణయించుకోవాలి.
మట్టి పరీక్ష చేయించడం మూలంగా ఏయే పోషకాలు తక్కువగా ఉన్నాయో తెలుసుకోవచ్చు. తద్వారా సంబంధిత ఎరువులను వాడి మంచి ఫలితాన్ని పొందవచ్చు. Fertilizers వేసిన వెంటనే నీళ్లు పట్టాలి. ఎరువులు వేసిన తర్వాత నీళ్లు పట్టకపోతే గ్రాస్, మొక్కలు మాడిపోయే ప్రమాదం ఉంటుంది. లాన్‌ను క్రమం తప్పకుండా కత్తిరించాలి. గ్రాస్‌ను పీకడం చేయకూడదు. లాన్‌ను కత్తిరించే యంత్రంతోనే కట్ చేయాలి. యంత్రం బ్లేడ్‌లు పదునుగా ఉండేలా చూసుకోవాలి. ఒక వేళ షార్ప్‌గా లేకపోతే గ్రాస్ చెల్లాచెదురు అయ్యే అవకాశం ఉంటుంది.
Gross మరీ చిన్నగా అయ్యేలా కత్తిరించుకోకూడదు. అలాగే తడిగా ఉన్నప్పు కత్తిరించడం మంచిది కాదు.లాన్ ఆకర్షణీయంగా కనిపించాలంటే రాలిన ఆకులు, ఇతర చెత్త చెదారాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఆకర్షణీయమైన ఆహ్లాదకరమైన లాన్ మీ సొంతమవుతుంది.