Motivation Story : ఎందరిలో ఉన్న నీ విలువ ప్రత్యేకమే మిత్రమా! |Telugu Motivation Story
Motivation Story : ఒక వ్యక్తి…భగవంతుడా! నా జీవితం విలువ ఎంతో తెలుపగలవా? అని అడిగాడు. అప్పుడు దేవుడు సమాధానం ఇస్తూ ఓ రాయిని ఆ వ్యక్తికి ఇచ్చాడు. ఇప్పుడు ఈ రాయి విలువ ఎంతో తెలుసుకొనిరా అంటాడు. కానీ దీనిని అమ్మకూడదు అని చెప్పి పంపించి వేశాడు. ఆ వ్యక్తి ఓ పండ్ల వ్యాపారి వద్దకు వెళ్లి ఇదిగో ఈ రాయి విలువ ఎంత ఉంటుంది అంటావ్? అని అడిగాడు. అప్పుడు ఆ రాయికి 5 అరటి పండ్లు ఇస్తానని వ్యాపారి చెబుతూ అమ్ముతావా? అని సమాధానం ఇస్తాడు. అయితే దేవుడు ఈ రాయి విలువ మాత్రమే తెలుసుకోవాలి తప్ప అమ్మడానికి వీలులేదని చెప్పిన మాట ఆ వ్యక్తికి గుర్తుకు వస్తుంది.


వెంటనే ఇది అమ్మడానికి కాదు అని అరటి పండ్ల వ్యాపారి వద్ద నుండి బయటకు వస్తాడు. ఆ తర్వాత ఒక కూరగాయల వ్యాపారి వద్దకు వెళ్లి ఆ రాయి విలువ ఎంత ఉంటుందో చెప్పగలవా? అని అడుగుతాడు. అప్పుడు ఆ కూరగాయల వ్యాపారి ఈ రాయికి నేను 10 కేజీల కూరగాయలు ఇస్తాను నాకు అమ్ముతావా? అని అడుగుతాడు. మళ్లీ ఆ వ్యక్తికి దేవుడు చెప్పిన నిబంధన గుర్తుకు వచ్చింది. వెంటనే ఆ వ్యాపారి వద్ద నుండి వెళ్లిపోయాడు. తర్వాత ఓ బంగారు నగలు వ్యాపారి వద్దకు ఆ రాయిని తీసుకెళ్లి ఏవండీ? ఈ రాయి విలువ ఎంత ఉంటుంది? అని అడుగుతాడు. అప్పుడు ఆ బంగారు నగల వ్యాపారి రాయిని పరిశీలించి ఆశ్చర్యపోయి నేను రూ.50 లక్షలు ఇస్తాను. నాకు ఆ రాయిని అమ్మవా? అని అడుగుతాడు. కనుక ఆ వ్యక్తి మళ్లీ ఆ బంగారు నగల వ్యాపారి దగ్గరి నుండి కూడా వెళ్లిపోతుంటే ఆ నగల వ్యాపారి సరే రూ.3 కోట్లు ఇస్తాను అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తికి మనసులో కొంచెం ఆశ కలిగింది.


ఆ రాయిని అమ్మకూడదని దేవుడు ప్రత్యేకంగా చెప్పారు కనుక ఆ వ్యక్తి అమ్మను అని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి ఓ వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్లి ఆ రాయి విలువ ఎంత ఉంటుంది? అని ఆ వ్యాపారిని అడుగుతాడు. ఆ రాయి తీసుకొని పరీక్షించి ఇంత విలువైన రాయి మీకు ఎక్కడిది అండి అంటూ ప్రశ్నిస్తాడు. నేను నా ఆస్తిని, నా దగ్గర ఉన్న సంపదను అమ్మినా కూడా నేను మీ వద్ద ఉన్న రాయిని కొనలేను. చివరకు ఈ ప్రపంచాన్ని మొత్తం అమ్మినా కూడా ఈ రాయి విలువకు సరిపోదు. ఆ వ్యక్తి మాటలకు ఏమనలో అర్థగాక తిరిగి రాయిని తీసుకొని దేవుడు వద్దకు వస్తాడు.


అప్పుడు దేవుడు.. ఓ మనిషీ! నీ జీవితం విలువ ఎంత? అని అడిగావు కదా! చెబుతా విను. ఈ రాయిని నువ్వు పండ్ల వ్యాపారి దగ్గరికి , కూరగాయాల వ్యాపారి వద్దకి, బంగారు నగల వ్యాపారికి చూపినప్పుడు వాళ్లు ఈ రాయికి ఇచ్చిన విలువ చూశావా? ఆ విలువ వారి స్థాయిని బట్టి వారు నిర్ణయించారు.


నిజంగా ఈ రాయి విలువ తెలిసిన వజ్రాల వ్యాపారి కూడా దీని విలువ చెప్పలేకపోయాడు. నువ్వు కూడా వెలకట్టలేని ఈ రాయి వంటి వాడివే!..నీ జీవితం కూడా వెలకట్టలేనిది! కానీ మనుషులు వారి వారి స్థాయిని బట్టి వెల కడతారు. నీ స్థాయిని బట్టి నిన్ను వెల కడతారు. నువ్వు వారికి ఉపయోగపడే విధానాన్ని బట్టి నీ జీవితానికి వెల కడతారు. అది వారి స్థాయి. కానీ నీ విలువ నాకు ఒక్కడికే తెలుసు. నువ్వు నాకు వెలకట్టలేని అమూల్యమైన నిధివి. మిత్రమా! నీ విలువ నీదే. ఎందరిలో ఉన్న నీ విలువ ప్రత్యేకమే!.
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court