జాతీయం

vaccination: క‌రోనా వైర‌స్ పోరులో మ‌రో మైలు రాయిని అధిగ‌మించిన భార‌త్

vaccination

vaccination న్యూఢిల్లీ: క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారిపై జ‌రుగుతున్న పోరులో భార‌త్ మ‌రో మైలు రాయిని అధిగ‌మిం చింది. క‌రోనా వైర‌స్‌ను నివారించే టీకాల పంపిణీలో అత్యంత వేగంగా రూ.95 కోట్ల వ్యాక్సిన్ పంపిణీల‌ను పూర్తి చేసుకుని రూ.100 కోట్ల దిశ‌గా అడుగులు వేస్తోంది. ఈ విష‌యాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మ‌న్‌సుఖ్ మాండ‌వీయ ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించారు. భార‌త్ 95 కోట్ల కోవిడ్‌-19 వ్యాక్సిన్ డోసుల పంపిణీని త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేసింది. 100 కోట్ల వ్యాక్సిన్ డోసుల‌ను అందించే దిశ‌గా అడుగులు వేస్తోంది. మీరు త్వ‌ర‌గా వ్యాక్సిన్ తీసుకొని ఇత‌రుల‌నూ ప్రోత్స‌హించండి అని ఆయ‌న ట్వీట్‌లో(vaccination) పేర్కొన్నారు.

దేశ‌వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్ జ‌న‌వ‌రి 16 నుంచి మొద‌లైన విష‌యం తెలిసిందే. మొద‌టి విడ‌త‌గా ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఫిబ్ర‌వ‌రి 2 నుంచి ఫ్రంట్ లైన్ వ‌ర్క‌ర్ల‌కు టీకాలు అందించారు. త‌ర్వాత మార్చి 1 నుంచి 60 ఏళ్ల వ‌యోజ‌నుల‌కూ వ్యాక్సినేష‌న్ జ‌ర‌గాల‌ని ఆరోగ్య శాఖ ఆదేశించింది. అనంత‌రం ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్ల‌కు పైబ‌డిన వారికి వ్యాక్సినేష‌న్ జ‌ర‌గుగా మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ మొద‌ల‌య్యింది.

See also  The Second Wave Has Begun In India | భార‌త్‌లో మ‌రో లాక్‌డౌన్ త‌ప్ప‌దా?

Comment here