naga chaitanya samantha divorce తెలుగు యువ హీరో, యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున కుమారుడు అక్కినేని నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో శనివారం నాగచైతన్య తన ట్విట్టర్ ఖాతాలో అధికారికంగా ఒక పోస్టును విడుదల చేశారు. తాము విడాకులు తీసుకోనున్నట్టు నాగచైతన్య, సమంత సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వారు పేర్కొన్నారు.


తన ట్విట్టర్లో పేర్కొన్న విధంగా (naga chaitanya samantha divorce)”మా శ్రేయోభిలాషులందరికీ ఇక నుంచి మే భార్య- భర్తలుగా దూరంగా ఉండాలనుకుంటున్నాం. చాలా చర్చలు, ఆలోచనలు తర్వాత విడిపోవాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇక నుంచి వేర్వేరుగా మా సొంత మార్గాల్లో ప్రయాణిలించాలను కుంటున్నాం. పదేళ్లుగా మా స్నేహం కొనసాగినందుకు మే అదృష్టవంతులం. మా స్నేహం వివాహ బంధానికి చాలా కీలకంగా నిలిచింది. ఇప్పుడు ఈ కష్ట సమయంలో అభిమానుల మద్దతు కావాలి. మా గోప్యతను కాపాడాలని శ్రేయోభిలాషులు, మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాం.” అని సోషల్ మీడియా వేదికగా ఇరువురు ప్రకటించారు.


నాగచైతన్య సమంత విడాకుల ప్రకటనపై అభిమానుల్లో మిశ్రమ స్పందన వస్తోంది. నాగచైతన్య అభిమానులు విడాకులు తీసుకోవడం మంచిదేనని.. మీ నాన్న గారికి కూడా మొదట విడాకులు అయిన తర్వాత రెండో జీవితంలో తిరుగులేని గొప్పవాడిగా ఎదిగారని చెబుతున్నారు. కొందరు మజ్ను సినిమాతో ప్రారంభమైన వీరి జీవితం లవ్ స్టోరీ సినిమాతో తెర పడిందని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు చూడముచ్చటైన జంట ఇలా విడిపోవడం నమ్మకలేపోతున్నామని, చాలా బాధాకరమని వారి అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా తెలుపుతున్నారు.
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!
- Migraine: భరించలేని మైగ్రేన్ తలనొప్పి వస్తుందా?
- Amavasya: అమావాస్య రోజున ఏమి జరుగుతుంది?
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?