Murder case news: కడప జిల్లాలో మరో సారి పాత కక్షలు భగ్గుమన్నాయి. భూమి విషయంలో తల్లికూతుళ్లను దారుణంగా హత్య చేసిన సంఘటన బ్రహ్మంగారి మఠం నేలటూరులో వెలుగుచూసింది. 2019 మే నెలలో అంజనమ్మ(55) కోడలు ఛరిష్మా అనుమానస్పదంగా మృతి చెందింది. అదనపు కట్నం కోసం భర్త, అత్త, ఆడబిడ్డలే చంపారని బంధువులు కేసు పెట్టారు. చరిష్మా శవాన్ని అంజనమ్మ ఇంట్లోనే బంధువులు పూడ్చిపెట్టారు. అంజనమ్మకు చెందిన నాలుగు ఎకరాల భూమిని కోడలు బంధువులకు పెద్దమనుషులు పంచాయతీ చేసి రాయించారు. పంచాయతీ అనంతరం అంజనమ్మ తన కుటుంబ సభ్యులతో కలిసి బ్రహ్మంగారిమఠంలో నివసిస్తున్నారు.
అయితే ఆ నాలుగు ఎకరాల భూమిని అమ్ముతున్నారని తెలిసి అడ్డుకోవడానికి సొంత ఊరుకు అంజనమ్మ(55), కూతురు వరలక్ష్మి (35) వచ్చారు. పాత కక్షలతో రగిలిపోతున్న కోడలు బంధువులు వారిద్దర్ని దారుణంగా నరికి చంపారు. సంఘటనా స్థలాన్ని మైదుకూరు డిఎస్పీ విజయ్‌కుమార్, రూరల్ సిఐ కొండారెడ్డి, స్థానిక ఎస్సై శ్రీనివాసులు చేరుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!
- Migraine: భరించలేని మైగ్రేన్ తలనొప్పి వస్తుందా?
- Amavasya: అమావాస్య రోజున ఏమి జరుగుతుంది?
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?